గిరిజన నాయకుడి పాత్రలో చియాన్ విక్రమ్ (Chiyaan Vikram).. విభిన్న కథాంశంతో ‘తంగలాన్’ (Thangalaan)

Updated on Oct 24, 2022 10:28 AM IST
స్వాతంత్ర్యానికి పూర్తం జరిగే కథతో ‘తంగలాన్’ (Thangalaan) చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది
స్వాతంత్ర్యానికి పూర్తం జరిగే కథతో ‘తంగలాన్’ (Thangalaan) చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది

విలక్షణ కథానాయకుడు చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) మరో క్రేజీ ప్రాజెక్టులో నటిస్తున్నారు. తమిళంలో విభిన్నమైన కథాంశాలతో చిత్రాలు తీసే దర్శకుడిగా పేరున్న పా. రంజిత్ (pa.ranjith) డైరెక్షన్‌లో విక్రమ్ కొత్త మూవీ చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేయనున్న ఈ మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమయ్యింది. దీపావళి సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేశారు. విక్రమ్ కొత్త మూవీకి ‘తంగలాన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు ఆ చిత్రానికి సంగీతం అందిస్తున్న జీవీ ప్రకాష్​ కుమార్ సోషల్ మీడియా ద్వారా ఓ వీడియో గ్లింప్స్‌ను షేర్ చేశారు. 

వీడియో గ్లింప్స్‌ను బట్టి చూస్తే.. స్వాతంత్ర్యానికి పూర్వం జరిగే కథతో ‘తంగలాన్’ను పా రంజిత్ రూపొందిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందులో విక్రమ్ ఓ గిరిజన తెగకు చెందిన నాయకుడి పాత్రలో నటిస్తున్నట్లు అర్థమవుతోంది. యదార్థ సంఘటనల స్ఫూర్తితో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది. ఈ ‘తంగలాన్’ సినిమాను స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మిస్తోంది. ఈ మూవీలో విక్రమ్ సరసన సోషల్ మీడియా సెన్సేషన్ మాళవిక మోహనన్ (Malavika Mohanan) కథానాయికగా యాక్ట్ చేస్తున్నారు.

‘తంగలాన్’ కథను 2014లోనే విక్రమ్‌కు పా రంజిత్ వినిపించారట. కానీ కొన్ని కారణాల వల్ల అప్పట్లో సెట్స్ పైకి వెళ్లలేకపోయిందని తెలిసింది. ఎట్టకేలకు ఇప్పుడు ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చింది. ఈ ఏడాది జూలై 15 నుంచి ‘తంగలాన్’ షూటింగ్‌ను ప్రారంభించామని నిర్మాత జ్ఞానవేల్ రాజా ఇటీవలే ప్రకటించారు. 

‘తంగలాన్’ విక్రమ్ కెరీర్‌లో 61వ చిత్రం కానుంది. వీడియో గ్లింప్స్, విజువల్స్ చూస్తుంటే మాత్రం విక్రమ్ కెరీర్‌లో ఇది మరో మర్చిపోలేని చిత్రంగా నిలుస్తుందని ఆయన అభిమానులు అంటున్నారు. ఈ సినిమాతో ఆయన నేషనల్ అవార్డ్ కొట్టడం ఖాయమని చెబుతున్నారు. మరి, ‘పొన్నియిన్ సెల్వన్ 1’తో భారీ విజయం సాధించిన విక్రమ్.. ‘తంగలాన్’తో దాన్ని కొనసాగిస్తారేమో చూడాలి. అలాగే ఫ్యాన్స్ కోరుకుంటున్నట్లు పురస్కారాలను గెలుచుకుంటారేమో చూడాలి. 

Read more: కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) త్రీడీ చిత్రం!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!