“విడాకుల మీద నమ్మకం లేదు. పెళ్లయ్యాక విడాకులు తీసుకోవాలనుకోవడం లేదు” : పెళ్లిపై త్రిష (Trisha) కామెంట్స్!

Updated on Oct 17, 2022 02:03 PM IST
ఇప్పటి వరకు త్రిష (Trisha) పెళ్లి చేసుకోలేదు. గతంలో వరుణ్ అనే వ్యక్తి తో నిశ్చితార్థం జరిగినా పెళ్లికి ముందే క్యాన్సిల్ అయిపోయింది.
ఇప్పటి వరకు త్రిష (Trisha) పెళ్లి చేసుకోలేదు. గతంలో వరుణ్ అనే వ్యక్తి తో నిశ్చితార్థం జరిగినా పెళ్లికి ముందే క్యాన్సిల్ అయిపోయింది.

దక్షిణాది చిత్రపరిశ్రమలో ఉన్న స్టార్ హీరోయిన్లలో త్రిష (Trisha) ఒకరు. ఈ బ్యూటీ దాదాపు 20ఏళ్ళ నుంచి తమిళ, తెలుగులో ఇండస్ట్రీలలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించింది. అనుకోకుండా సినిమాలకు దూరం అయిన ఈ భామ.. చాలా కాలాం తర్వాత 96 తో రీఎంట్రీ ఇచ్చింది. ఇక ఇటీవలే డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన 'పొన్నియిన్ సెల్వన్1' (Ponniyin Selvan I) చిత్రంలో యువరాణి 'కుందవై' పాత్రలో నటించి మెప్పించింది.

కాగా, ఇప్పటి వరకు త్రిష (Trisha) పెళ్లి చేసుకోలేదు. గతంలో వరుణ్ అనే వ్యక్తి తో ఆమెకు నిశ్చితార్థం జరిగింది. కానీ పెళ్లికి ముందే నిశ్చితార్థం క్యాన్సిల్ అయిపోయింది. గతంలో రానా తో కూడా త్రిష ప్రేమలో ఉందని వార్తలు వినిపించాయి. కానీ వాళ్ళు కూడా పెళ్లి దాకా వెళ్ళలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పెళ్లి ప్లాన్స్ గురించి వివరించింది త్రిష.

 “నేను ఎందుకు పెళ్లి చేసుకోలేదని ప్రజలు నన్ను తరచుగా అడుగుతున్నారు. ఇప్పటికే నాకు పెళ్లి జరగాల్సి ఉందని అంటున్నారు. అయితే, వారు అడిగే విధానం నాకు నచ్చలేదు. మీరు సాధారణంగా నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని అడిగితే, మీకు సమాధానం వస్తుంది. నాకు విడాకుల మీద నమ్మకం లేదు. పెళ్లయ్యాక విడాకులు తీసుకోవాలనుకోవడం లేదు” అంటూ చెప్పుకొచ్చింది.

'నా చుట్టూ ఉన్న అనేక మంది వివాహిత జంటలు తమ వివాహం పట్ల అసంతృప్తిగా ఉంటున్నారు. వారిలో కొందరు నా స్నేహితులు. చిన్న చిన్న కారణాల వల్ల వారు విడిపోడానికి నిర్ణయం తీసుకుంటున్నారు. నేను అలాంటి వరుసలో ఉండాలనుకోలేదు' అని త్రిష (Trisha) పేర్కొంది.

Read More: దళపతి విజయ్ (Vijay) & లోకేష్ కనగరాజ్ సినిమాలో హీరోయిన్‌గా త్రిష (Trisha).. 14 ఏళ్ల తర్వాత కాంబో రిపీట్ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!