మణిరత్నం (Mani Ratnam) ‘పొన్నియిన్ సెల్వన్‌’ సినిమా మోషన్‌ పోస్టర్‌‌ రిలీజ్‌ చేసిన మేకర్స్

Updated on Jul 02, 2022 06:16 PM IST
మణిరత్నం (Mani Ratnam) ‘పొన్నియిన్ సెల్వన్‌’  సినిమా పోస్టర్
మణిరత్నం (Mani Ratnam) ‘పొన్నియిన్ సెల్వన్‌’ సినిమా పోస్టర్

మణిరత్నం (Mani Ratnam).. సినిమాల గురించి ఏ మాత్రం అవగాహన ఉన్న వాళ్లకైనా పరిచయం అక్కర్లేని పేరు. ఆయన తీసిన సినిమాలన్నీ రత్నాల్లాగే ఉంటాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సినిమా చరిత్రలో గర్వించదగిన దర్శకుల్లో మణిరత్నం ఒకరు. రోజా, రజనీకాంత్ దళపతి, కమల్‌హాసన్ నాయకుడు, దిల్‌ సే, సఖి, రావణ్‌, గురు, గీతాంజలి, అంజలి.. ఇలా చెప్పుకుంటూ పోతే మణిరత్నం తీసిన ఒక్కో సినిమాకి ఒక్కో స్పెషాలీటి ఉంటుంది. తన సినిమాలను విజువల్‌గానే కాకుండా మ్యూజికల్‌గా కూడా ఆల్‌టైమ్‌ గ్రేట్‌గా ఉండేలా చూసుకుంటారు మణి.

ఇటువంటి క్లాసికల్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌ ఏంటో తెలుసా. అదే ‘పొన్నియిన్ సెల్వన్’. రాజ రాజ చోళుల కథ ఆధారంగా రచించిన నవల ‘పొన్నియిన్ సెల్వం’. ఆ పుస్తకం ఆధారంగా ‘పొన్నియిన్ సెల్వన్‌’ సినిమాను తెరకెక్కిస్తున్నారు మణి. రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌ పార్ట్ షూటింగ్ పూర్తయ్యింది. ఈ విషయాన్ని ఇటీవలే చిత్ర యూనిట్ ప్రకటించింది. అంతేకాదు ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీన ‘పొన్నియిన్ సెల్వన్’ మొదటి భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు కూడా వెల్లడించింది.

మణి డ్రీమ్ ప్రాజెక్ట్‌..

మణిరత్నం (Mani Ratnam) సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఇక, ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘పొన్నియిన్ సెల్వన్’ కోసం అయితే చెప్పాల్సిన పనిలేదు. సినిమా మొదటి భాగాన్ని రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించనప్పటి నుంచి ఆ సినిమా నుంచి ఎటువంటి అప్‌డేట్స్ వస్తాయా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి మణిరత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్‌ వచ్చింది.

తాజాగా మేకర్స్‌ ‘చోళులు వస్తున్నారు’ అనే మోషన్ పోస్టర్‌‌ను విడుదల చేశారు. చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యారాయ్, త్రిష, బాబీ సింహా సహా పలువురు స్టార్లు కీలకపాత్రల్లో మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వంలోని ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా విడుదల అవుతోంది.

Read More : క్లాసికల్ సినిమాలకు కేరాఫ్‌.. మణిరత్నం (Mani Ratnam).. డైరెక్టర్లలో ఆయనొక దళపతి

పొన్నియిన్ సెల్వన్ పోస్టర్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!