31 ఏళ్ల తర్వాత క్రేజీ కాంబినేషన్‌! రజినీకాంత్‌ (Rajinikanth)కు స్టోరీ లైన్ చెప్పిన మణిరత్నం (ManiRatnam)?

Updated on Oct 15, 2022 03:44 PM IST
సూపర్‌‌స్టార్ రజినీకాంత్‌ (Rajinikanth) – క్లాసిక్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో 1991వ సంవత్సరంలో విడుదలైన దళపతి సూపర్‌‌హిట్ అయ్యింది
సూపర్‌‌స్టార్ రజినీకాంత్‌ (Rajinikanth) – క్లాసిక్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో 1991వ సంవత్సరంలో విడుదలైన దళపతి సూపర్‌‌హిట్ అయ్యింది

సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ (Rajinikanth) ఫోక‌స్ అంతా సినిమాల‌పైనే పెట్టారు. ప్రస్తుతం ఆయన హీరోగా జైలర్ సినిమా తెరకెక్కుతోంది. రజినీ 169వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌‌పై తెరకెక్కుతున్న జైలర్‌‌ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన రజినీ ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  

జైలర్ సినిమా తర్వాత రజినీకాంత్ ఏ డైరెక్టర్‌‌తో సినిమా చేయనున్నారనే దానిపై చర్చ మొదలైంది. చాలా కాలం నుంచి ఆయన కొత్త సినిమాలకు సంబంధించిన వార్తలు ఏవీ బయటకు రాలేదు. పోయినేడాది నుంచి రజినీ పలుసార్లు అనారోగ్యంతో ఆసుపత్రిలో అడ్మిట్‌ అయ్యి చికిత్స కూడా తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకోనున్నారనే వార్తలు కూడా వచ్చాయి. దీంతో ఫ్యాన్స్‌ కూడా కొంత నిరాశకు గురయ్యారు.

సూపర్‌‌స్టార్ రజినీకాంత్‌ (Rajinikanth) – క్లాసిక్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో 1991వ సంవత్సరంలో విడుదలైన దళపతి సూపర్‌‌హిట్ అయ్యింది

రెండు సినిమాలకు గ్రీన్‌సిగ్నల్..

ఇటీవల వచ్చిన వార్తలు రజినీ అభిమానులకు కొంత ఊరటనిచ్చింది. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థతో రెండు సినిమాలు చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. వాటిపై పూర్తిగా క్లారిటీ రాలేదు. త్వరలోనే ఈ వార్తలపై అధికారిక సమాచారం రానుందని టాక్. ఇక, ఇండస్ట్రీలో మరో వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది. పొన్నియిన్ సెల్వన్ 1 సినిమాతో ఇటీవలే హిట్‌ అందుకున్నారు క్లాసికల్ డైరెక్టర్ మణిరత్నం.

ఇక రజినీకాంత్ – మణిరత్నం కాంబినేషన్‌లో దళపతి అనే సినిమా తెరకెక్కింది. 1991లో విడుదలైన ఈ సినిమా ఇండస్ట్రీ ఆల్‌టైమ్ హిట్‌ సినిమాల్లోనే కాకుండా రజినీకాంత్, మణిరత్నం కెరీర్లలో కూడా వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ సినిమాగా నిలిచింది. ఈ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రాలేదు. దాదాపు 31 సంవత్సరాల తర్వాత వీరిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారనే వార్త ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది.

రజినీకాంత్‌కు మణిరత్నం ఇప్పటికే స్టోరీ లైన్ చెప్పారని.. తలైవాకు కూడా అది బాగా నచ్చిదని టాక్. పొన్నియిన్ సెల్వన్‌2 షూటింగ్ పూర్తైన తర్వాత మణిరత్నం (ManiRatnam).. జైలర్ సినిమా తర్వాత రజినీకాంత్‌ (Rajinikanth) కాంబినేషన్‌లో సినిమా పట్టాలెక్కే చాన్స్ ఉందని ఇండస్ట్రీ టాక్. అదే నిజమైతే రజినీ ఫ్యాన్స్‌కు నిజంగా పండుగే మరి.

Read More : రెండు సినిమాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సూపర్‌‌స్టార్ రజినీకాంత్‌ (Rajinikanth)! లైకా ప్రొడక్షన్స్‌తో డీల్‌?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!