‘పొన్నియిన్ సెల్వన్‌’ సినిమాలో ఆదిత్య కరికాలన్‌ పాత్రలో చియాన్ విక్రమ్ (Vikram).. పోస్టర్ విడుదల చేసిన మేకర్స్

Updated on Jul 04, 2022 05:13 PM IST
చియాన్‌ విక్రమ్‌ (Vikram) ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా పోస్టర్‌‌
చియాన్‌ విక్రమ్‌ (Vikram) ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా పోస్టర్‌‌

విభిన్న పాత్రల‌ను సెలక్ట్ చేసుకుంటూ విల‌క్షణ న‌ట‌న‌తో సినీ ప్రేమికులను అలరించే నటుడు హీరో విక్రమ్ (Vikram). తెలుగులో కూడా చియాన్ విక్రమ్‌కు మంచి సంఖ్యలో ఫ్యాన్ బేస్ ఉంది. తన నటనతో టాలీవుడ్‌లో కూడా మంచి క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు విక్రమ్.

చాలాకాలం తర్వాత మహాన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన విక్రమ్.. మరో సినిమాతో బాక్సాఫీస్‌ను ఢీ కొట్టడానికి సిద్ధమవుతున్నారు. క్లాసికల్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘పొన్నియిన్ సెల్వన్’ తెరకెక్కిస్తున్న సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు విక్రమ్. చాలాకాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ను చిత్ర యూనిట్ ఇటీవల ఒక్కొక్కటిగా విడుదల చేస్తోంది. దీంతో ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తి పెరిగిపోతోంది.

విక్రమ్(Vikram) కీలకపాత్రలో నటించిన పొన్నియిన్ సెల్వన్ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్‌‌ను ఇటీవలే రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఆ పోస్టర్‌‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న పొన్నియిన్ సెల్వన్‌ సినిమా మొదటి భాగం ఈ ఏడాది సెప్టెంబర్‌‌ 30న విడుదల చేయనున్నట్టు ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ క్రమంలో విక్రమ్‌ పోస్టర్‌‌ను రిలీజ్ చేసింది. 

చియాన్‌ విక్రమ్‌ ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా పోస్టర్‌‌

ఆదిత్య కరికాలన్‌గా..

పొన్నియిన్‌ సెల్వన్ సినిమాలో ‘ఆదిత్య కరికాలన్’ క్యారెక్టర్‌‌లో విక్రమ్ నటిస్తున్నారు. ఈ సినిమాలో విక్రమ్‌ లుక్‌ను విడుదల చేసిన మేకర్స్.. చోళ కిరీట యువరాజు అని పోస్టర్‌‌పై రాశారు. గుర్రంపై కూర్చొని, చిన్నగా నవ్వుతూ గంభీరంగా కనిపిస్తున్నారు విక్రమ్. పొన్నియిన్ సెల్వన్ సినిమాలో కార్తీ, జయం రవి, ఐశ్వర్యారాయ్, త్రిష, బాబీ సింహీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ సినిమాను విడుదల చేయనున్నారు. కాగా, విక్రమ్ (Vikram) నటించిన కోబ్రా సినిమా ఆగస్టు 11వ తేదీన తమిళ, తెలుగు భాషల్లో విడుదల అవుతోంది.

Read More : మణిరత్నం (Mani Ratnam) ‘పొన్నియిన్ సెల్వన్‌’ సినిమా మోషన్‌ పోస్టర్‌‌ రిలీజ్‌ చేసిన మేకర్స్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!