త్వరలో ఓటీటీలోకి రానున్న ‘పొన్నియిన్ సెల్వన్ 1’ (Ponniyin Selvan 1)!.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..?

Updated on Oct 27, 2022 03:58 PM IST
ప్రముఖ దర్శకుడు మణిరత్నం (Mani Ratnam) తీసిన ‘పొన్నియిన్ సెల్వన్ 1’ (Ponniyin Selvan 1) సినిమా త్వరలో ఓటీటీలో అందుబాటులోకి రానుంది 
ప్రముఖ దర్శకుడు మణిరత్నం (Mani Ratnam) తీసిన ‘పొన్నియిన్ సెల్వన్ 1’ (Ponniyin Selvan 1) సినిమా త్వరలో ఓటీటీలో అందుబాటులోకి రానుంది 

భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరు మణిరత్నం (Mani Ratnam). కొన్నాళ్ల గ్యాప్ తర్వాత ‘పొన్నియిన్ సెల్వన్ 1’ (Ponniyin Selvan 1) చిత్రంతో ఆయన ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్టు. అహర్నిషలు కష్టపడి భారీ బడ్జెట్‌తో మణిరత్నం ఈ మూవీని తెరకెక్కించారు. అందుకు తగ్గట్లే సినిమా కూడా ఊహించని విజయాన్ని సాధించింది. ముఖ్యంగా తమిళనాట ఆల్ టైమ్ హిట్స్ జాబితాలో చోటు సంపాదించుకుంది. 

కలెక్షన్ల పరంగా తమిళనాట టాప్–3 హయ్యెస్ట్ గ్రాసర్స్‌లో ఒకటిగా ‘పొన్నియిన్ సెల్వన్ 1’ నిలిచింది. ట్రేడ్ వర్గాల ప్రకారం ఈ చిత్రం రూ.460 కోట్ల గ్రాస్‌ను సాధించింది. తమిళ వెర్షన్‌ను మినహాయిస్తే మిగిలిన భాషల్లో ఈ సినిమా అంతగా ఆడలేదు. తెలుగులో బ్రేక్ ఈవెన్‌కు సమీపంగా వచ్చి ఆగిపోయింది. హిందీలో ఓ మోస్తరు వసూళ్లే చేసింది. అయితే తమిళంలో మాత్రం ఇంకా సక్సెస్ ఫుల్ రన్‌ను కొనసాగిస్తోంది. అలాంటి ‘పీఎస్ 1’ ఇప్పుడు ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమవుతోంది. 

భారీ తారాగణంతో రెండు భాగాలుగా తెరకెక్కించిన ‘పొన్నియిన్ సెల్వన్ 1’ త్వరలో ఓటీటీలోకి రానుంది. నవంబర్ 18 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుందని సమాచారం. ఓటీటీలో వచ్చే ఆదరణను బట్టి.. సీక్వెల్‌పై మరింత అంచనాలు ఏర్పడే అవకాశం ఉందని మేకర్స్ భావిస్తున్నారట. తెలుగులో చాలా మంది ఈ సినిమాను థియేటర్లలో చూడలేదు. మరి, ఓటీటీ స్ట్రీమింగ్‌తో ‘పీఎస్ 2’పై టాలీవుడ్‌లో క్రేజ్ పెరుగుతుందేమో చూడాలి. 

ఇకపోతే, మణిరత్నం తన కలల ప్రాజెక్టు అయిన ‘పొన్నియిన్ సెల్వన్’ రెండు భాగాలను రూ.500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారట. అయితే మొదటి పార్ట్‌కే చాలా వరకు పెట్టుబడి వచ్చేయడంతో చిత్ర యూనిట్ ఫుల్ హ్యాపీలో ఉన్నారట. ప్రస్తుతం రెండో పార్ట్‌కు సంబంధించిన పనులతో మణిరత్నం టీమ్ బిజీబిజీగా ఉన్నారట. సెకండ్ పార్ట్‌ను మరింత భారీదనంతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. మరి, ‘పొన్నియిన్ సెల్వన్ 1’కు మించిన రేంజ్‌లో సెకండ్ పార్ట్ విక్టరీ సాధిస్తుందేమో చూడాలి. 

కాగా, ‘పొన్నియన్ సెల్వన్ 1’లో ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ఆదిత్య కరికాలన్ రోల్‌లో విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ నటించారు. ఆయనతోపాటు కోలీవుడ్ స్టార్ హీరోలు కార్తి, జయం రవి కూడా ఈ సినిమాలో యాక్ట్ చేశారు. వీరితోపాటు స్టార్ హీరోయిన్లు త్రిష, ఐశ్వర్యారాయ్, శోభితా ధూళిపాళ్ల కూడా ‘పీఎస్ 1’లో తమదైన నటనతో ప్రేక్షకులను అలరించారు. మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహ్మాన్ ఈ మూవీకి బాణీలు సమకూర్చారు. 

Read more: దళపతి విజయ్ (Vijay) హీరోగా నటించిన 'వరిసు' (Varisu) పూర్తిగా తమిళ చిత్రం.. వంశీ పైడిపల్లి కామెంట్స్ వైరల్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!