Mani Ratnam: భారతదేశం గర్వించదగ్గ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన టాప్ 10 చిత్రాలు

Updated on Nov 09, 2022 10:39 PM IST
ప్రేమకథలతో పాటు దేశంలో జరిగిన సంఘటనలపై, ఉగ్రవాద సమస్యలపై గొప్ప సినిమాలను రూపొందించిన దర్శకుడు మణిరత్నం (Mani Ratnam).
ప్రేమకథలతో పాటు దేశంలో జరిగిన సంఘటనలపై, ఉగ్రవాద సమస్యలపై గొప్ప సినిమాలను రూపొందించిన దర్శకుడు మణిరత్నం (Mani Ratnam).

భారతీయ సినిమా రంగానికి దొరికిన ఓ ఆణిముత్యం మణిరత్నం. దర్శకుడిగా అద్భుతమైన సినిమాలను తెరకెక్కించిన దర్శకుడిగా మణిరత్నం ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రేమకథలతో పాటు మన దేశంలో జరిగిన వివిధ చారిత్రక సంఘటనలపై, ఉగ్రవాద సమస్యలపై కూడా గొప్ప సినిమాలను రూపొందించిన ఏకైక దర్శకుడు మణిరత్నం. అందులో మనసుకు హత్తుకునే సినిమాలు కొన్నైతే.. మంచిని పంచే సినిమాలు మరెన్నో.


 లెజండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన టాప్ 10 సినిమాల గురించిన విశేషాలు పింక్ విల్లా ఫాలోవర్స్ కోసం..

మణిరత్నం (Mani Ratnam)

పొన్నియిన్ సెల్వన్ 1

మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వం వహించిన సినిమాల్లో "పొన్నియిన్ సెల్వన్ 1" అత్యంత భారీ బడ్జెట్ సినిమా. ఈ సినిమాను రూ. 500 కోట్లతో నిర్మించారు. చోళ రాజుల పాలనపై కల్కి కృష్ణమూర్తి రాసిన ఓ ఫిక్షన్ నవల ఆధారంగా ఈ సినిమాను మణిరత్నం అద్భుతంగా తెరకెక్కించారు. పొన్నియిన్ సెల్వన్ 1 చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 2022 సెప్టెంబర్ 30 వ తేదీన  తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ అయింది. పొన్నియిన్ సెల్వన్ 1 చిత్రంలో  విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు. ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందించారు. 

మణిరత్నం (Mani Ratnam)

గురు
మణిరత్నం హిందీలో తెరకెక్కించిన చిత్రాల్లో "గురు" ఒకటి. ఈ సినిమాను 2007లో చిత్రీకరించారు. బాలీవుడ్ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ లు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను రూ. 220 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. బాక్సాఫీస్ వద్ద ఇదే కలెక్షన్ల వర్షం కురింపించింది. ఈ చిత్రాన్ని వ్యాపారవేత్త ధీరుబాయ్ అంబానీ జీవితాన్ని ప్రేరణగా తీసుకొని రూపొందించడం జరిగింది.

మణిరత్నం (Mani Ratnam)

సఖి

"సఖి" సినిమా ఓ అందమైన ప్రేమకావ్యం. మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వంలో ఈ సినిమా 2000 లో విడుదలైంది. మాధవన్, షాలిని జంటగా నటించారు. ఈ సినిమా వంద రోజులు ఆడింది.  మూడు ఫిలిమ్ ఫేర్ అవార్డులు అందుకున్న సినిమా సఖి. అంతేకాదు బెర్లిన్ ఇంటర్నేషన్ ఫిలిమ్ ఫెస్టివల్ 2001లో ప్రదర్శితమైన సినిమాగా వార్తల్లోకెక్కింది.

మణిరత్నం (Mani Ratnam)

దిల్ సే 

షారూఖ్ ఖాన్, మనీషా కోయిరాల నటించిన "దిల్ సే" సినిమా 1998లో విడుదలై ఇండియన్ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సినిమాతో దర్శకుడు మణిరత్నం ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు పలు అవార్డులను అందుకున్నారు. ఇంటర్నేషనల్ స్థాయిలో నెట్పాక్ అవార్డును మణిరత్నం సాధించారు. అంతేకాకుండా జాతీయ అవార్డులు, ఫిలిమ్ ఫేర్ అవార్డులు "దిల్ సే" సినిమాకు లభించడం విశేషం.

మణిరత్నం (Mani Ratnam)

బొంబాయి

మత కలహాలతో మిళితమైన ఓ ప్రేమ కథను "బొంబాయి" సినిమాగా చిత్రీకరించారు మణిరత్నం. 1995 లో "బొంబాయి" సినిమా విడుదలైంది. హీరో అరవింద్ స్వామి, హీరోయిన్ మనీషా కొయిరాలా ఈ సినిమాలో నటించారు. ఎ.ఆర్. రెహమాన్ సంగీతం ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది.

మణిరత్నం (Mani Ratnam)

రోజా

"రోజా" సినిమా 1992 లో విడుదలైంది. కశ్మీరు తీవ్రవాద సమస్యపై మణిరత్నం ఈ సినిమాను చిత్రీకరించారు. తమిళ భాషలో తెరకెక్కిన "రోజా" సినిమా తెలుగు, హిందీ, మలయాళం, మరాఠీ భాషల్లో విడుదలైంది. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్  అయ్యింది. ఎ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.  

మణిరత్నం (Mani Ratnam)

దళపతి

మహాభారతంలోని దుర్యోధన, కర్ణ, అర్జున పాత్రలను ఆధారంగా తెరకెక్కించిన సినిమా దళపతి. రజనీకాంత్, ముమ్ముట్టి, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 1992లో రిలీజ్ అయింది. ఈ సినిమాకు గానూ ఉత్తమ దర్శకుడిగా మణిరత్నం ఫిలిమ్ ఫేర్ అందుకున్నారు. మరో రెండు ఫిలిమ్ ఫేర్ అవార్డులు ఈ సినిమాకు లభించాయి.

మణిరత్నం (Mani Ratnam)

అంజలి

మణిరత్నం చిన్నపిల్లలపై తెరకెక్కించిన సినిమా అంజలి. అంజలి సినిమాలో బాల నటిగా షామిలి నటించారు. రఘువరన్, రేవతి, తరుణ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 1990లో రిలీజ్ అయింది. మూడు జాతీయ అవార్డులు సాధించిన సినిమా. అంతేకాదు, 1991లో భారతదేశం నుంచి ఆస్కార్ అవార్డుకు అధికారికంగా పంపిన చిత్రంగా కూడా వార్తల్లో నిలిచింది.

మణిరత్నం (Mani Ratnam)

గీతాంజలి

మణిరత్నం తెలుగు భాషలో తెరకెక్కించిన ఒకే ఒక సినిమా "గీతాంజలి". నాగార్జున, గిరిజ ప్రధాన పాత్రలలో నటించారు. 1989లో విడుదలైన "గీతాంజలి" సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాను తమిళ, మలయాళ భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. మరణ పోరాటం చేస్తున్న ఇద్దరు యువతీ, యువకుల మధ్య చిగురించే ప్రేమకథ ఈ చిత్రం.

మణిరత్నం (Mani Ratnam)

నాయకుడు

1987లో "నాయకుడు" సినిమా విడుదలైంది. విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన ఈ సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహించారు. శరణ్య, కార్తీక కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు మూడు జాతీయ అవార్డులు లభించాయి.

మణిరత్నం (Mani Ratnam)

మౌనరాగం

"మౌనరాగం"..  పేరుకు తగినట్టుగానే ఈ సినిమాలో భార్య భర్తల మధ్య ఏర్పడే ఒక జీవన బంధాన్ని ప్రేమకథగా మలచి చిత్రాన్ని మణిరత్నం అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా 1986లో విడుదలైంది. మోహన్, రేవతి ప్రధాన పాత్రల్లో నటించారు. కార్తీక్ కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమాకు జాతీయ అవార్డు లభించింది. అలాగే ఉత్తమ దర్శకుడిగా మణిరత్నం ఫిలిమ్ ఫేర్ అవార్డును అందుకున్నారు. 

Read More: Ponniyin Selvan 1: 'పొన్నియిన్ సెల్వన్ 1' ట్రైల‌ర్ కోసం ఏక‌మైన కోలీవుడ్.. చోళ రాజుల పాల‌న‌పై మ‌ణిర‌త్నం సినిమా

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!