Ponniyin Selvan2 : పొన్నియిన్ సెల్వన్‌2 ఎప్పుడు రిలీజ్ కానుందంటే? త్వరలో అధికారిక ప్రకటన వచ్చే చాన్స్!

Updated on Nov 16, 2022 08:47 PM IST
మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్‌1 (Ponniyin Selvan) విడుదలై  హిట్‌ అయ్యింది. రెండో భాగం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు
మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్‌1 (Ponniyin Selvan) విడుదలై హిట్‌ అయ్యింది. రెండో భాగం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు

క్లాసికల్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్1 మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి పొన్నియిన్ సెల్వన్‌2 (Ponniyin Selvan2)పై పడింది, ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ప్రస్తుతం పొన్నియిన్ సెల్వన్‌2 విడుదల తేదీపై పలు వార్తలు నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

పొన్నియిన్ సెల్వన్ మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా రూ.450 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఇప్పటికే రూ.450 కోట్లు కొల్లగొట్టింది. పొన్నియిన్ సెల్వన్ 2వ భాగం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. పొన్నియిన్ సెల్వన్ మొదటి భాగం ప్రమోషన్ల సందర్భంగా మణిరత్నం పలు కామెంట్లు చేశారు.

మొదటి భాగాన్ని విడుదల చేసిన 9 నెలల తర్వాత రెండో భాగాన్ని విడుదల చేయనున్నట్టు చెప్పారు. దీంతో 2023, ఏప్రిల్‌ 28వ తేదీన రెండో భాగం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అయితే పొన్నియిన్ సెల్వన్‌2 (Ponniyin Selvan2) విడుదల తేదీపై అధికారిక ప్రకటన వెలువడలేదు. కల్కి కృష్ణమూర్తి రచించిన ప్రముఖ నవల ఆధారంగా పొన్నియిన్ సెల్వన్ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు మణిరత్నం. ఈ సినిమాలో విక్రమ్, ఐశ్వర్యారాయ్ బచ్చన్, త్రిష, కార్తి, జయం రవి ప్రధాన పాత్రలు పోషించారు. పొన్నియిన్ సెల్వన్ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు.  

Read More : 31 ఏళ్ల తర్వాత క్రేజీ కాంబినేషన్‌! రజినీకాంత్‌ (Rajinikanth)కు స్టోరీ లైన్ చెప్పిన మణిరత్నం (ManiRatnam)?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!