'గార్గి' సినిమా కలెక్షన్ తెలిస్తే షాక్ అవాల్సిందే!.. సాయిపల్లవి (Sai Pallavi) నటనకు ఫ్యాన్స్ ఫిదా
Gargi: టాలీవుడ్‌లోనే కాకుండా సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే సాయిపల్లవి (Sai Pallavi) నటనకు మంచి గుర్తింపు ఉంది. దక్షిణాదిన సాయిపల్లవికి ఉన్న క్రేజే వేరు. విభిన్న కథలతో కమర్షియల్‌తో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటిస్తూ సాయిపల్లవి టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు. సాయిపల్లవి నటించిన 'గార్గి' చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ దిశగా దూసుకెళుతుంది. మొదటి నుంచి 'గార్గి' సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఆ అంచానాలు ఇప్పుడు నిజమయ్యాయి. 'గార్గి' చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది.
హిట్ కొట్టిన 'గార్గి'
సాయిపల్లవి (Sai Pallavi) బలమైన పాత్రల్లో ఎక్కువగా నటిస్తారు. 'గార్గి' చిత్రంలో న్యాయం కోసం పోరాడే ఓ మహిళగా అద్భుతమైన నటన కనబరిచారు. 'గార్గి' చిత్రం జూలై 15న విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది. 'గార్గి' చిత్రానికి గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించారు. ఇప్పటివరకు 'గార్గి' దాదాపు రూ. 13 కోట్ల బిజినెస్ చేసింది. కేవలం సాయిపల్లవికి ఉన్న ఫాలోయింగ్‌తోనే రూ. 5 కోట్ల బిజినెస్ జరిగిందని అంచనా.
ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే
'గార్గి' చిత్రాన్ని ఓటీటీలో కూడా విడుదల చేయనున్నారు. ఆగస్టు మూడో వారం 'గార్గి' ఓటీటీలో రిలీజ్ కానుందని సమాచారం. ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన వివరాలను చిత్ర యూనిట్ త్వరలో అధికారికంగా ప్రకటించనుంది.
సాయిపల్లవి ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. తమిళ నటుడు శివకార్తికేయన్ సినిమాలో సాయిపల్లవి నటించనున్నారు. విశ్వనటుడు కమల్ హాసన్ సినిమాలో కూడా సాయిపల్లవి కీలక పాత్రలో కనిపిస్తారని టాక్.
Gargi: 'గార్గి' చిత్రాన్ని 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తమిళ హీరో సూర్య, జ్యోతికలు సమర్పించారు. నిర్మాతలు రవిచంద్రన్ రామచంద్రన్, ఐశ్వర్యా లక్ష్మి, థామస్ జార్జి, గౌతమ్ రామచంద్రన్ ఈ సినిమాను నిర్మించారు. తెలుగులో హీరో రానా దగ్గుబాటి సమర్ఫణలో సాయిపల్లవి (Sai Pallavi) నటించిన 'గార్గి' మూవీ రిలీజ్ అయింది. తెలుగులో కూడా 'గార్గి' రూ. 1.5 కోట్లకు పైగా షేర్‌ను సాధించి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. కోర్టు నేపథ్యంలో తెరకెక్కిన 'గార్గి' సినిమా తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో జూలై 15న విడుదలైంది.
Read More : Gargi: గార్గి ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రానా దగ్గుబాటి .. న్యాయం కోసం పోరాడే పాత్రలో సాయిపల్లవి