‘సింగం 4’ (Singam 4) స్క్రిప్టును సిద్ధం చేస్తున్న హరి?.. సూర్య (Suriya) ఓకే చెబితే పట్టాలెక్కే చాన్స్!

Updated on Nov 10, 2022 11:55 AM IST
‘సింగం 4’ (Singam 4) సినిమాకు సంబంధించిన స్క్రిప్టును రాసే పనుల్లో దర్శకుడు హరి తలమునకలై ఉన్నారని సమాచారం
‘సింగం 4’ (Singam 4) సినిమాకు సంబంధించిన స్క్రిప్టును రాసే పనుల్లో దర్శకుడు హరి తలమునకలై ఉన్నారని సమాచారం

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya)కు తమిళంలోతోపాటు తెలుగులోనూ ఫుల్ క్రేజ్ ఉంది. ‘గజినీ’, ‘సింగం’, ‘24’, ‘సెవెన్త్ సెన్స్’, ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ లాంటి చిత్రాలు తెలుగు ఆడియెన్స్‌కు సూర్యను దగ్గర చేశాయి. ఆయనకు ఇక్కడ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే సూర్య నటించిన చిత్రాలను తెలుగు, తమిళంలో ఏకకాలంలో విడుదల చేస్తుంటారు. సూర్యను క్లాస్ ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడతారు. అయితే ఆయనను ‘సింగం’ (Singam) సినిమా మాస్ ఆడియెన్స్‌కూ చేరువ చేసింది. ఈ మూవీ హిట్టవ్వడంతో అనంతరం ఫ్రాంచైజీలుగా తెరకెక్కింది. 

‘సింగం’ సిరీస్‌లోని మూడు భాగాలు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చి.. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు అందుకున్నాయి. హరి దర్శకత్వం వహించిన ఈ మూవీస్ భారీ స్థాయిలో వసూళ్లు రాబట్టాయి. దీంతో నాలుగో భాగాన్ని రూపొందించాలని హరి అనుకుంటున్నారట. ‘సింగం 4’ (Singam 4) స్క్రిప్టును ఆయన సిద్ధం చేస్తున్నారని సమాచారం. 

ప్రస్తుతం హరి (Director Hari) ఇతర ప్రాజెక్టు పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. వాటికి సంబంధించిన పనులను చూసుకుంటూనే ‘సింగం 4’ కథను రెడీ చేస్తున్నారని తెలుస్తోంది. ఫైనల్ స్క్రిప్ట్ సిద్ధమవ్వడానికి మరికొంత సమయం పడుతుందట. అది పూర్తవ్వగానే సూర్యకు వినిపిస్తాడని సమాచారం. ఒకవేళ సూర్యకు కథ నచ్చితే వెంటనే పట్టాలెక్కించే అవకాశం ఉంది. 

‘సింగం’ తొలి భాగం 2010లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో రెండో భాగాన్ని ‘సింగం 2’ టైటిల్‌తో రూపొందించారు. 2013లో రిలీజైన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. 2017లో ప్రేక్షకుల ముందుకొచ్చిన మూడో భాగానికి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధించింది.

ఇక, సూర్య కెరీర్ విషయానికొస్తే.. ఆయన చివరగా ‘ఈటీ’ (ఎవరికీ తలవంచకు) చిత్రంలో నటించారు. ఈ సినిమా తమిళంలో సక్సెస్ అయ్యింది. కానీ తెలుగు నాట మాత్రం ఈ ఫిల్మ్‌కు ఆడియెన్స్ నుంచి అంతగా ఆదరణ దక్కలేదు. సూర్య ప్రస్తుతం సిరుత్తై శివ, బాల దర్శకత్వం వహిస్తున్న సినిమాల్లో నటిస్తున్నారు. సిరుత్తై శివ డైరెక్షన్ చేస్తున్న మూవీ పాన్ ఇండియాగా తెరకెక్కుతోంది. దాదాపుగా పది భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారని తెలుస్తోంది.

Read more: క్రేజీ ఆఫర్ కొట్టేసిన అనూ ఇమ్మాన్యుయేల్( Anu Emmanuel).. ‘ఊర్వశివో.. రాక్షసివో’ టాక్‌తో క్యూ కడతున్న అవకాశాలు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!