హీరో సూర్య (Hero Suriya) అవార్డు విన్నింగ్ మూవీ 'జై భీమ్' (Jai Bhim)కు త్వరలో సీక్వెల్.. దర్శకుడు ఏమన్నారంటే?

Updated on Dec 01, 2022 12:32 PM IST
‘జై భీమ్’ సినిమాకు రాజశేఖర్ పాండియన్ ఒక్కరే ప్రొడ్యూసర్ కాదు. హీరో సూర్య, అతని భార్య జ్యోతిక (Jyothika) కూడా నిర్మాణంలో భాగస్వాములయ్యారు.
‘జై భీమ్’ సినిమాకు రాజశేఖర్ పాండియన్ ఒక్కరే ప్రొడ్యూసర్ కాదు. హీరో సూర్య, అతని భార్య జ్యోతిక (Jyothika) కూడా నిర్మాణంలో భాగస్వాములయ్యారు.

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Hero Suriya) ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'జై భీమ్' (Jai Bhim) ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో మనందరికి తెలిసిందే. 2డి ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై నిర్మించిన చిత్రమిది. ఈ చిత్రం 1993లో విల్లుపురం సమీపంలోని గిరిజనుల జీవన విధానం మరియు వారి కష్టాలను చూపుతుంది. జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆదివాసీల రక్షణ కోసం పోరాడే జడ్జి చంద్రుడి పాత్రలో సూర్య నటించారు.

ఎలాంటి వాణిజ్యాంశాలు లేకుండా గిరిజనులకు జరిగిన అన్యాయంపై పోరాడిన న్యాయవాది చంద్రుగా సూర్య నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో.. దీనికి సీక్వెల్ ఉంటుందా? అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కబోతోందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఇదిలా ఉంటే.. ‘జై భీమ్’ (Jai Bhim) మూవీని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా ప్రదర్శించారు. అంతేకాకుండా ఈ సినిమా పలు విభాగాల్లో అవార్డుల్ని కూడా గెలుచుకుంది. ఈ చిత్రోత్సవానికి హాజరైన దర్శకులు జ్ఞానవేల్ ను జై భీమ్ కు సీక్వెల్ ఉంటుందా? అని విలేకరులు ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానంగా..”కచ్చితంగా ఉంటుంది. అది కూడా సూర్యనే హీరోగా తెరకెక్కిస్తాం. ఇక న్యాయవాది చంద్రు వాదించిన ఎన్నో గొప్ప గొప్ప కేసులు ఉన్నాయని, వాటిల్లో ఏదో ఒక కేసును కథగా తెరకెక్కిస్తాం” అని డైరెక్టర్ చెప్పారు.

‘జై భీమ్’ సినిమాకు రాజశేఖర్ పాండియన్ ఒక్కరే ప్రొడ్యూసర్ కాదు. హీరో సూర్య, అతని భార్య జ్యోతిక (Jyothika) కూడా నిర్మాణంలో భాగస్వాములయ్యారు. సీక్వెల్‌లోనూ వారి పార్ట్‌నర్‌షిప్ కొనసాగబోతున్నట్లు తెలుస్తోంది. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ‘జై భీమ్’ సినిమాని రూపొందించారు.

‘జై భీమ్’ చిత్రంలో లిజోమోల్ జోస్, మణికందన్, రజిషా విజయన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, తదితరులు నటించారు. జై భీమ్ IFFI 53లో ఇండియన్ పనోరమా ఫీచర్ ఫిల్మ్స్ విభాగం క్రింద ప్రదర్శించబడింది.

Read More: 3D టెక్నాలజీలో 10 భాషల్లో విడుదల కాబోతున్న 'సూర్య 42' (Suriya 42).. మోషన్ పోస్టర్ రిలీజ్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!