‘ఆదిత్య 369’ నుంచి ‘బింబిసార’ వరకు.. టాలీవుడ్‌ (Tollywood) టైమ్ ట్రావెల్ జోనర్ సినిమాలు

Updated on Nov 24, 2022 07:07 PM IST
ప్రతి సినిమాకు కథ చాలా ముఖ్యమే.. కానీ టైమ్ ట్రావెల్ సినిమా (Time Travel Movie)లకు అద్భుతమైన స్క్రిప్ట్ ఉంటేనే సక్సెస్ సాధిస్తాయి.
ప్రతి సినిమాకు కథ చాలా ముఖ్యమే.. కానీ టైమ్ ట్రావెల్ సినిమా (Time Travel Movie)లకు అద్భుతమైన స్క్రిప్ట్ ఉంటేనే సక్సెస్ సాధిస్తాయి.

టాలీవుడ్‌ (Tollywood) తో పాటు ప్రతి భాషలోనూ టైమ్ ట్రావెల్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది. మనం గతంలోకి వెళ్తే ఎలా ఉంటుంది?.  వర్తమానం నుంచి ఉన్నట్టుండి భవిష్యత్తులోకి మనము మాత్రమే వెళ్తే ఏం జరుగుతుంది?.. ఇలాంటి కథలతో తెరకెక్కించే కథలేట్రైమ్ ట్రావెల్ చిత్రాలు. 

టైమ్ ట్రావెల్ సినిమా తెరకెక్కించాలంటే చాలా ధైర్యం కూడా ఉండాలి. ప్రతి సినిమాకు కథ చాలా ముఖ్యమే.. కానీ టైమ్ ట్రావెల్ సినిమాలకు అద్భుతమైన స్క్రిప్ట్ ఉంటేనే సక్సెస్ సాధిస్తాయి. టాలీవుడ్‌లో కొంతమంది దర్శకులు మాత్రమే టైమ్ ట్రావెల్ సినిమాలను చిత్రీకరించారు. టైమ్ ట్రావెల్ జోనర్‌లో తెలుగులో విడుదలైన సినిమాలపై పింక్ విల్లా ప్రత్యేక కథనం. 

టైమ్ ట్రావెల్ సినిమా (Time Travel Movie)

1. ఆదిత్య 369  

1991ఆగస్టు 18 తేదీన విడుదలైన 'ఆదిత్య 369' అప్పట్లో సంచలనాలను సృష్టించింది. తెలుగు సినిమా పరిశ్రమలో విడుదలైన మొదటి టైమ్‌ ట్రావెల్‌ చిత్రం. నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన 'ఆదిత్య 369' సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. అంతేకాదు బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టింది. ఈ సినిమాకు సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వం వహించారు.  బాలకృష్ణకు జోడిగా మోహిని నటించారు. 

'ఆదిత్య 369' సినిమాలో టైమ్ మిషన్ గతంలోకి, భవిష్యత్తులోకి తీసుకెళుతుంది. ప్రముఖ సినీ గేయ రచయిత వేటూరి సుందరరామమూర్తి రాసిన 'జాణవులే.. నెర జాణవులే', 'సెంచురీలు కొట్టే వయస్సు మాది' పాటలు మోత మోగాయి. ఈ సినిమాను అనితాకృష్ణ నిర్మించగా ప్రముఖ గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం సమర్పించారు.

టైమ్ ట్రావెల్ సినిమా (Time Travel Movie)

2. 24 

తమిళ స్టార్‌ హీరో సూర్య నటించిన టైమ్ ట్రావెల్ చిత్రం '24'. 2016 మే 6 వ తేదీన విడుదలైన ఈ సినిమాలో సూర్య మూడు విభన్న పాత్రలలో నటించారు. వాచ్‌ రిపేరర్‌, సైంటిస్ట్, విలన్‌గా సూర్య వెండితెరపై అదరగొట్టారు. '24' చిత్రాన్ని స్టార్ దర్శకుడు కె. విక్రమ్‌ కుమార్‌ తెరకెక్కించారు. ఈ సినిమాలో హీరోయిన్లు సమంత, నిత్యా మీనన్ నటించారు.

టైమ్ ట్రావెల్ సినిమా (Time Travel Movie)

3. ప్లే బ్యాక్

2021లో విడుదలైన థ్రిల్లర్ టాలీవుడ్ (Tollywood) సినిమా 'ప్లే బ్యాక్'. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన హరిప్రసాద్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఫోన్‌ కాల్స్‌ ద్వారా గతంలో జరిగిన సంఘటనలో మార్పు తీసుకొస్తే వర్తమానం, భవిష్యత్తులో ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలిపేదే కథ ప్లే బ్యాక్. దినేష్ తేజ్, అనన్య నాగళ్ల, టిఎన్ఆర్, ఆనంద చక్రపాణి ముఖ్యపాత్రల్లో నటించారు.

టైమ్ ట్రావెల్ సినిమా (Time Travel Movie)

4. అద్భుతం

తేజ సజ్జా, శివాని రాజశేఖర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం అద్భుతం. 2021 నవంబర్ 19 తేదీన విడుదలైన అద్భుతం సినిమాకు మాలిక్‌ రామ్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్న హీరో హీరోయిన్లు ఓ ఫోన్ కాల్‌తో విరమించుకుంటారు.  నాలుగేళ్ల టైమ్ కనెక్షన్‌తో ఈ సినిమా కథ సాగుతుంది. చంద్రశేఖర్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేశారు.

టైమ్ ట్రావెల్ సినిమా (Time Travel Movie)

5. అ!

సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం 'అ!'. దర్శకుడిగా ప్రశాంత్ వర్మ తొలి చిత్రం 'అ!'. ఈ చిత్రాన్ని హీరో నాని, ప్రశాంత్‌ తిపిర్నేని నిర్మించారు.  కాజల్ అగర్వాల్‌, నిత్యా మీనన్‌, ఈషా రెబ్బ, రెజీనా కసాండ్ర, శ్రీనివాస్‌ అవసరాల, ప్రియ దర్శిని, మురళి శర్మ నటించారు. టైమ్ మిషన్‌తో గతంలోకి వెళ్లాలని ఓ వ్యక్తి ఆశ పడతాడు. ఇంద్రజాలం మాయలు ఎలా సాగాయనే కథతో అ! చిత్రం తెరకెక్కింది. 

 

టైమ్ ట్రావెల్ సినిమా (Time Travel Movie)

6. బింబిసార

మగధ రాజు బింబిసార రాజు కథతో 'బింబిసార' సినిమాను దర్శకుడు శ్రీ వశిష్ఠ్ తెరకెక్కించారు. 2022 ఆగస్టు 5 వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్, కేథరిన్ థ్రెసా, సంయుక్త మీనన్ నటించారు. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ నిర్మించారు. టైం ట్రావెల్ చేసిన ఒకప్పటి క్రూరమైన రాజు ప్రస్తుతం ఉన్న ప్రపంచానికి ఎలా అడ్జస్ట్ అయ్యాడనే కథతో బింబిసార చిత్రం తెరకెక్కించారు.

 

టైమ్ ట్రావెల్ సినిమా (Time Travel Movie)

7. ఒకే ఒక జీవితం స్టోరి

'ఒకే ఒక జీవితం' సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం. ఈ సినిమాలో శర్వానంద్, రైతు వర్మ, అమల అక్కినేని, వెన్నెల కిశోర్, ప్రియదర్శి నటించారు. 2022 సెప్టెంబర్ 9 తేదీన విడుదలైన ఈ చిత్రానికి శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఎస్ ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు కలిసి నిర్మించారు. టైమ్ మిషన్ ద్వారా బాల్యానికి వెళ్లి.. మళ్లీ వర్తమాన కాలానికి వచ్చే ప్రయత్నంపై ఈ సినిమాను తెరకెక్కించారు.

Read More: Tollywood: టాలీవుడ్‌లో సొంత జెట్ విమానాలు ఉన్న హీరోలు ఎవరో మీకు తెలుసా!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!