మణిరత్నం బాటలో శంకర్ (Shankar)!.. సూర్య (Suriya) హీరోగా వెయ్యి కోట్ల బడ్జెట్‌తో భారీ చిత్రానికి ప్లాన్?

Updated on Nov 11, 2022 02:29 PM IST
‘పొన్నియన్ సెల్వన్’ (Ponniyin Selvan) మాదిరిగా భారీ చారిత్రక కథా చిత్రాన్ని తీయాలని డైరెక్టర్ శంకర్ (Shankar) ప్లాన్ చేస్తున్నారని సమాచారం
‘పొన్నియన్ సెల్వన్’ (Ponniyin Selvan) మాదిరిగా భారీ చారిత్రక కథా చిత్రాన్ని తీయాలని డైరెక్టర్ శంకర్ (Shankar) ప్లాన్ చేస్తున్నారని సమాచారం

భాషలకు సంబంధం లేకుండా ఇప్పుడు ఎక్కడ చూసినా చారిత్రక కథా చిత్రాల ట్రెండ్ నడుస్తోందని చెప్పొచ్చు. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) ఇలాంటి నేపథ్యంలో సాగే స్టోరీలకు ఊతమిచ్చారు. ‘బాహుబలి’ (Baahubali) సిరీస్, ‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) మూవీలే అందుకు ఉదాహరణ. ఈ రెండు సినిమాలు సాధించిన విజయాలు.. ఇలాంటి స్టోరీలతో సినిమాలు తీసేందుకు దర్శకులను ప్రేరేపిస్తోంది. భారతదేశం గర్వించదగ్గ డైరెక్టర్లలో ఒకరైన మణిరత్నం (Mani Ratnam) తాజాగా ‘పొన్నియన్ సెల్వన్’ (Ponniyin Selvan) లాంటి భారీ చారిత్రక కథా చిత్రాన్ని తెరకెక్కించి సక్సెస్ అయ్యారు. ఈ మూవీని రూపొందించడానికి రాజమౌళే స్ఫూర్తి అని స్వయంగా మణిరత్నమే చెప్పడం విశేషం. 

ఇప్పుడు రాజమౌళి, మణిరత్నం బాటలో నడిచేందుకు మరికొంత మంది దర్శకులు సిద్ధమవుతున్నారు. అందులో స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) కూడా చేరనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. లార్జర్ దెన్ లైఫ్​ చిత్రాలకు మారుపేరుగా నిలిచే శంకర్.. తదుపరి ఒక చారిత్రక కథా నేపథ్యం ఉన్న చిత్రాన్ని తీయడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. ఇందులో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) హీరోగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

‘వేల్పారి’ (Velpari) అనే నవల ఆధారంగా ఈ మూవీని శంకర్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది

‘వేల్పారి’ (Velpari) అనే ప్రముఖ తమిళ నవల ఆధారంగా ఈ మూవీని శంకర్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. రూ.1,000 కోట్ల బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను ఆయన తీస్తారని సమాచారం. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని వినికిడి. చేర, చోళ, పాండ్యన్ రాజుల తర్వాత రాజైన నేర్పాలి ఇతివృత్తం ఆధారంగా ఈ కథ సాగుతుందని సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. మరి, శంకర్ ఈ సినిమాపై త్వరలో ఏదైనా అప్‌డేట్ ఇస్తారేమో చూడాలి. 

ప్రస్తుతం కమల్ హాసన్‌తో ‘భారతీయుడు’ (Indian 2) సీక్వెల్‌ను శంకర్ తెరకెక్కిస్తున్నారు. అదే విధంగా రామ్ చరణ్​‌తోనూ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ రెండు మూవీల షూటింగ్స్ ఏకకాలంలో చేస్తూ శంకర్ బిజీబిజీగా ఉన్నారు. ఇకపోతే, ‘వేల్పారి’ నవల ఆధారంగా తీయనున్న సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్​ వీర్ సింగ్ (Ranveer Singh) నటిస్తాడని ఇటీవల వార్తలు వచ్చాయి. వీళ్లిద్దరి కాంబోలో తీయనున్న ‘అపరిచితుడు’ రీమేక్‌ను శంకర్ పక్కనపెట్టేశారని రూమర్స్ వినిపించాయి. ‘వేల్పారి’ ప్రాజెక్టును ట్రయాలజీగా తీయనున్నారని.. త్వరలో రణ్‌వీర్‌కు శంకర్ కథ వినిపిస్తారంటూ కథనాలు వచ్చాయి. మరి, ఈ చిత్రంలో రణ్‌వీర్ నటిస్తారా లేదా సూర్య యాక్ట్ చేస్తారా అనే దానిపై శంకర్ స్పష్టత ఇచ్చే వరకు ఏదీ చెప్పలేం.  

Read more: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటించిన ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) రిలీజ్ డేట్ ఫిక్స్..?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!