Gargi: గార్గి ట్రైల‌ర్‌ను రిలీజ్ చేసిన రానా ద‌గ్గుబాటి .. న్యాయం కోసం పోరాడే పాత్ర‌లో సాయిప‌ల్ల‌వి

Updated on Jul 08, 2022 04:04 PM IST
Gargi: సాయి ప‌ల్ల‌వి (Sai Pallavi) న‌టించిన గార్గి సినిమా జూలై 15న విడుదల కానుంది.
Gargi: సాయి ప‌ల్ల‌వి (Sai Pallavi) న‌టించిన గార్గి సినిమా జూలై 15న విడుదల కానుంది.

Gargi: టాలీవుడ్‌లోనే కాకుండా ద‌క్షిణాది చిత్ర రంగంలో సాయిప‌ల్ల‌వి (Sai Pallavi) పాపుల‌ర్ హీరోయిన్‌గా కొన‌సాగుతున్నారు. ప్ర‌స్తుతం సాయి ప‌ల్ల‌వి న‌టిస్తున్న గార్గి చిత్రం నుంచి ట్రైల‌ర్ రిలీజ్ అయింది. ఈ సినిమా తెలుగు ట్రైల‌ర్‌ను ప్ర‌ముఖ హీరో రానా ద‌గ్గుబాటి రిలీజ్ చేశారు. ఈ ట్రైల‌ర్ రిలీజ్ చేసిన రానా.. కొన్ని విజ‌యాలు ప్ర‌పంచానికి చెందుతాయంటూ సాయిప‌ల్ల‌విని ప్ర‌శంసించారు. గార్గి ట్రైల‌ర్ ఆస‌క్తి క‌రంగా సాగింది. గార్గి చిత్రానికి గౌత‌మ్ రామ‌చంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 

గార్గిగా సాయిప‌ల్ల‌వి
బ‌ల‌మైన క‌థ‌ల‌తో సాగే సినిమాల్లో సాయిప‌ల్ల‌వి (Sai Pallavi) ఎక్కువ‌గా న‌టిస్తుంటారు. తాను న‌టించే పాత్ర కీల‌కంగా ఉంటేనే ఆ సినిమాకు ఓకే చెప్తారు. అంతేకాకుండా ఈ మ‌ల‌యాళ బ్యూటీ గార్గి లాంటి లేడీ ఓరియెంటెడ్ పాత్ర‌ల్లోనూ న‌టిస్తున్నారు. త‌న తండ్రి కోసం న్యాయ పోరాటం చేసే అమ్మాయి క‌థ‌గా గార్గిని తెర‌కెక్కించారు. గార్గి ట్రైల‌ర్‌లో సాయిప‌ల్ల‌వి డైలాగులు సినిమాపై అంచ‌నాలు పెంచాయి.

ఆస‌క్తిక‌రంగా ట్రైల‌ర్
ఒక్క రోజులో త‌మ‌ జీవితాలు త‌ల‌కిందులైపోయాయని గార్గి ఎందుకంది? గార్గి వాళ్ల నాన్న‌ను పోలీసులు ఎందుకు అరెస్టు చేశారు? 'ఒక్క నిమిషం నాన్న‌ను త‌లుచుకో.. ధైర్యం అదే వ‌స్తుంద‌ని' గార్గికి వాళ్ల నాన్న ఎందుకు చెప్పార‌నే విష‌యాలు తెలియాలంటే సినిమా రిలీజ్ వ‌ర‌కు ఆగాల్సిందే.  

Gargi: గార్గి చిత్రాన్ని 2డీ ఎంటర్‌టై‌న్‌మెంట్స్ పతాకంపై త‌మిళ‌ హీరో సూర్య, జ్యోతికలు స‌మ‌ర్పిస్తున్నారు. తెలుగులో హీరో రానా దగ్గుబాటి స‌మ‌ర్ఫ‌ణ‌లో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమాకు నిర్మాత‌లుగా రవిచంద్రన్‌ రామచంద్రన్,  ఐశ్వర్యా లక్ష్మి, థామస్‌ జార్జి, గౌతమ్‌ రామచంద్రన్ వ్య‌వ‌హ‌రించారు. కోర్టు నేప‌థ్యంలో తెర‌కెక్కిన గార్గి సినిమా తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో జూలై 15న విడుదల కానుంది.

Read More: Virata Parvam : 'విరాట ప‌ర్వం'లో గ‌న్ ప‌ట్టుకోవ‌డం.. ఎంతో థ్రిల్లింగ్‌గా అనిపించింది : సాయిప‌ల్ల‌వి

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!