KGF Chapter 2 : 50 రోజులు పూర్తి చేసుకుని రికార్డు సృష్టించిన యశ్ సినిమా కేజీఎఫ్ చాప్టర్2
KGF Chapter 2 : కేజీఎఫ్ చాప్టర్2 కన్నడ సినిమా చరిత్రలోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. యశ్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఏప్రిల్ 14న కేజీఎఫ్ చాప్టర్ 2 ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయిన తొలి రోజు నుంచి ఇప్పటి వరకు రికార్డులు మీద రికార్డులు సాధిస్తూనే ఉంది. వేయి కోట్లకు పైగా వసూళ్లు చేసిన ఇండియన్ సినిమాగా యశ్ సినిమా దూసుకుపోతుంది.
కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా విడుదల అయిన 50 రోజులు పూర్తి చేసుకుంది. చిత్ర యూనిట్ 50 రోజులు పూర్తి చేసుకోవడంపై సంతోషం వ్యక్తం చేస్తుంది. రూ.1235 కోట్ల రూపాయలను వసూళ్లు చేసిన సినిమాగా చరిత్ర కెక్కింది కేజీఎఫ్ చాప్టర్2. కేజీఎఫ్ చాప్టర్2. కన్నడతో పాటు హిందీ, తమిళ్, తెలుగు, మళయాళంలో ఈ సినిమాను విడుదల చేశారు.
యశ్, శ్రీనిధి శెట్టి జంట వెండితెరపై ప్రేక్షకులను మెప్పించారు. అమ్మ సెంటిమెంట్‌తో బంగారం గని నేపథ్యంలో కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. పాన్ ఇండియా సినిమాగా కేజీఎఫ్ చాప్టర్ 2 ఓ వండర్ సృష్టించింది.
KGF Chapter 2 : ఇండియన్ సినిమాలో కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా ఆల్ టైం హిట్‌గా నిలిచిందంటూ సినీ ప్రముఖులు అంటున్నారు. సినిమాకు భాష కాదు ఎమోషన్స్ ముఖ్యం అంటున్నారు. కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాకు వచ్చిన ఆదరణ మరే సినిమాకు రాలేదని అంటున్నారు. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై నిర్మాత విజయ్ కిరంగన్‌దూర్ కేజీఎఫ్ చాప్టర్2ను నిర్మించారు. కేజీఎఫ్ చాప్టర్1 2018లో నిర్మించారు. ఇక యశ్ సినిమా 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కేజీఎఫ్ చాప్టర్3పై ప్రకటన వస్తుందనే టాక్ వినిపిస్తుంది.
KGF Chapter 2: ఇండియాలో మొత్తం 390 థియేటర్లలో కేజీఎఫ్ చాప్టర్2 ఆడుతుంది. ఓవర్సీస్‌లో 10 స్కీన్లులో ఇంకా ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు. అంటే ప్రపంచ వ్యాప్తంగా 400 వందల థియేటర్లలలో కేజీఎఫ్ చాప్టర్2 సినిమా 50 రోజుల నుంచి ఆడుతుంది. కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా రిలీజ్ అయిన ఈ 50 రోజుల్లో ఎన్నో బడా సినిమాలు వచ్చాయి. అవేవీ రాఖీభాయ్‌ని ఢీ కొట్ట లేక పోయాయి. యశ్, ప్రశాంత్ నీల్ కాంబో వంద రోజులు దాటి ప్రపంచ సినిమా రికార్డులు బద్దలు కొడుతుందని సినీ వర్గాలు అంటున్నాయి.