కేజీఎఫ్‌ (KGF) స్టార్ యష్‌ (Yash)తో సినిమా చేయబోతున్న డైరెక్టర్ శంకర్?

Updated on Sep 18, 2022 06:20 PM IST
కేజీఎఫ్‌ సిరీస్ తర్వాత యష్‌ Yash) మరో భారీ బడ్జెట్‌ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయ్యాకా శంకర్‌‌తో సినిమా చేయనున్నట్టు టాక్
కేజీఎఫ్‌ సిరీస్ తర్వాత యష్‌ Yash) మరో భారీ బడ్జెట్‌ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయ్యాకా శంకర్‌‌తో సినిమా చేయనున్నట్టు టాక్

‘కేజీఎఫ్’ (KGF) సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు హీరో య‌ష్‌ (Yash) . కేజీఎఫ్‌ సిరీస్ సినిమాలతోనే బాలీవుడ్ హీరోలతో సమానంగా క్రేజ్‌ను సొంతం చేసుకున్నారాయన.  ప్రస్తుతం యష్‌ .. నార్తన్‌ అనే కన్నడ దర్శకుడితో సినిమా చేయనున్నారు. పాన్‌ ఇండియా స్ఘాయిలో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కనుందని టాక్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా రెగ్యులర్‌‌ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమా తర్వాత యష్‌ చేయబోయే సినిమా గురించిన వార్తలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం మెగా పవర్‌‌స్టార్ రాంచరణ్‌తో ఒక సినిమా చేస్తున్నారు. అలాగే కమల్‌ హాసన్‌తో భారతీయుడు సినిమాకు సీక్వెల్‌గా ఇండియన్‌2 అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తి చేసే పనుల్లో బిజీబిజీగా ఉన్నారు శంకర్. ఈ సినిమాల తర్వాత శంకర్‌‌ ఏ హీరోతో చేయబోతున్నారనే దానిపై ఇప్పటివరకు క్లారీటీ లేదు. ఆర్‌‌సీ15, ఇండియన్‌2 సినిమాల తర్వాత శంకర్ ఏ హీరోతో సినిమా చేయబోతున్నారనే వార్తలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

కేజీఎఫ్‌ సిరీస్ తర్వాత యష్‌ Yash) మరో భారీ బడ్జెట్‌ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయ్యాకా శంకర్‌‌తో సినిమా చేయనున్నట్టు టాక్

అత్యంత భారీ బడ్జెట్‌తో..

ఇక, శంకర్ దర్శకత్వంలో సినిమా చేయాలని స్టార్ హీరోలు కూడా కోరుకుంటారు. అలాగే కేజీఎఫ్ సిరీస్‌ తర్వాత యష్‌తో సినిమా చేయాలని స్టార్ డైరెక్టర్లు కూడా అనుకునే రేంజ్‌కు ఎదిగారు యష్‌. కోలీవుడ్‌ ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం యష్‌ హీరోగా శంకర్‌‌ ఒక భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.

అత్యంత భారీ బడ్జెట్‌తో యష్‌ – శంకర్‌‌ కాంబినేషన్‌ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌, కరణ్‌ జోహార్‌‌ సంయుక్తంగా నిర్మించనున్నారని సమాచారం. ప్రస్తుతం శంకర్ చేతిలో ఉన్న సినిమాల షూటింగ్స్‌ పూర్తయిన తర్వాత యష్‌తో తెరకెక్కించనున్న ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నారని టాక్. అలాగే ప్రస్తుతం యష్‌ చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత తదుపరి ప్రాజెక్టు గురించి క్లారిటీ వస్తుందని సమాచారం. కేజీఎఫ్‌ (KGF) స్టార్ యష్‌ (Yash) – శంకర్ కాంబినేషన్‌లో సినిమాపై వస్తున్న వార్తల్లో నిజం ఎంతుందనే విషయం తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే.

Read More : య‌శ్ (Yash) సినిమాలో ల‌క్కీ ఛాన్స్ కొట్టేసిన బుట్ట‌బొమ్మ‌ (Pooja Hegde)!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!