కర్ణుడి పాత్రలో నటించనున్న ‘కేజీఎఫ్’ హీరో?.. బాలీవుడ్ నుంచి రాకింగ్ స్టార్ యశ్ (Yash)కు రెండు భారీ ఆఫర్లు!

Updated on Oct 28, 2022 03:36 PM IST
‘బ్రహ్మాస్త్ర’ మూవీ సీక్వెల్‌లో నటించాల్సిందిగా రాకింగ్ స్టార్ యశ్‌ (Yash)ను చిత్ర నిర్మాత కరణ్​ జోహర్ కోరారని సమాచారం
‘బ్రహ్మాస్త్ర’ మూవీ సీక్వెల్‌లో నటించాల్సిందిగా రాకింగ్ స్టార్ యశ్‌ (Yash)ను చిత్ర నిర్మాత కరణ్​ జోహర్ కోరారని సమాచారం

‘కేజీఎఫ్’ (KGF) సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించారు యశ్ (Yash). కన్నడ స్టార్ హీరో అయిన యశ్.. ఒకే ఒక్క చిత్రంతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ‘కేజీఎఫ్​’లో రాఖీభాయ్‌ అదిరిపోయే పెర్ఫార్మెన్స్‌తో యూత్‌లో విపరీతమైన క్రేజ్‌ను ఆయన తెచ్చుకున్నారు. ‘కేజీఎఫ్ 2’ (KGF 2)తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి.. తన పాపులారిటీని మరింతగా పెంచుకున్నారు. అయితే ఈ సినిమా తర్వాత ఆయన తదుపరి చేయబోయే చిత్రంపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. 

యశ్ నెక్స్ట్ ఏ సినిమాలో నటిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. తన స్టార్‌డమ్‌ను దృష్టిలో ఉంచుకుని కెరీర్‌ను జాగ్రత్తగా మలుచుకోవాలని ఆయన భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో యశ్ తదుపరి చిత్రాలపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ కన్నడ సూపర్ స్టార్‌కు బాలీవుడ్ నుంచి రెండు మెగా ఆఫర్లు తలుపు తట్టాయని వినికిడి. అందులో ఓ మూవీ సీక్వెల్ అని చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

‘బ్రహ్మాస్త్ర 2’లో  దేవ్ పాత్రలో యాక్ట్ చేయాల్సిందిగా యశ్ (Yash)ను సినిమా నిర్మాత కరణ్ జోహర్ (Karan Johar) కోరారని సమాచారం

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా ‘మహాభారతం’ ఆధారంగా తీయనున్న ‘కర్ణ’ (Karna) అనే సినిమాను తెరకెక్కించనున్నారు. రెండు పార్టులుగా రానున్న ఈ చిత్రంలో ప్రధాన పాత్ర కోసం యశ్‌ను మూవీ యూనిట్ సంప్రదించారట. అలాగే ఇటీవల విడుదలై హిట్‌గా నిలిచిన ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra 2) మూవీ సీక్వెల్ కోసం ఆ చిత్ర నిర్మాత కరణ్​ జోహర్ రీసెంట్‌గా యశ్‌ను కలిశారట. అందులో దేవ్ పాత్రలో యాక్ట్ చేయాల్సిందిగా కోరారని సమాచారం. 

‘కర్ణ’, ‘బ్రహ్మాస్త్ర 2’ సినిమాల్లో ఏ ప్రాజెక్టుకు యశ్ ఓకే చెబుతారో ఇంకా తెలియదు. ఆ సినిమాల ఆఫర్లు యశ్‌కు వచ్చిన మాట నిజమా, కాదా అనేది ఆయనకే తెలియాలి. ఒకవేళ ఆ వార్త నిజమై.. ఆ చిత్రాల్లో నటించడానికి యశ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం ఆయన అభిమానులకు పండుగేనని చెప్పాలి. శక్తిమంతమైన కర్ణుడి పాత్రలో యశ్‌ను ఊహించుకుంటే రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం. మరి, ఈ ఆఫర్లపై యశ్ త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి. 

Read more: కేజీఎఫ్‌ (KGF) స్టార్ యష్‌ (Yash)తో సినిమా చేయబోతున్న డైరెక్టర్ శంకర్?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!