Yash: య‌శ్‌.. ఓ చ‌రిత్ర రాసిన ఘ‌నుడు

Updated on May 01, 2022 06:58 PM IST
Yash: కేజీఎఫ్ సినిమాలు చూశాక చాలా మంది య‌శ్ అభిమ‌నులుగా మారారు. హీరో య‌శ్‌ ఏం మాయ చేశాడు? య‌శ్ లైఫ్ స్టైల్ ఏంటి?, య‌శ్ వ్య‌క్తిత్వం ఏంటి?. యాక్టింగ్ కింగ్ య‌శ్ బాస్‌పై పింక్‌విల్లా స్పెష‌ల్ స్టోరీ.
Yash: కేజీఎఫ్ సినిమాలు చూశాక చాలా మంది య‌శ్ అభిమ‌నులుగా మారారు. హీరో య‌శ్‌ ఏం మాయ చేశాడు? య‌శ్ లైఫ్ స్టైల్ ఏంటి?, య‌శ్ వ్య‌క్తిత్వం ఏంటి?. యాక్టింగ్ కింగ్ య‌శ్ బాస్‌పై పింక్‌విల్లా స్పెష‌ల్ స్టోరీ.

కేజీఎఫ్ సినిమాలు చూశాక చాలా మంది య‌శ్ అభిమానులుగా మారారు. హీరో య‌శ్‌ ఏం మాయ చేశాడు? య‌శ్ లైఫ్ స్టైల్ ఏంటి? య‌శ్ వ్య‌క్తిత్వం ఏంటి?... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలో యాక్టింగ్ కింగ్ య‌శ్ బాస్‌పై పింక్‌విల్లా స్పెష‌ల్ స్టోరీ.


 

Yash Photo Still (యశ్ ఛాయాచిత్రం)

య‌శ్ ఎవ‌రు?
య‌శ్ అస‌లు పేరు న‌వీన్ కుమార్ గౌడ .1986 జ‌న‌వ‌రి 8 న య‌శ్ పుట్టారు. క‌ర్ణాట‌క‌లోని భువ‌న‌హ‌ల్లీ య‌శ్ సొంతూరు. య‌శ్ నాన్న అర్జున్ కుమార్ ఆర్టీసీ డ్రైవ‌ర్. య‌శ్ త‌ల్లి పుష్ప హౌస్ వైఫ్. య‌శ్ త‌ల్లి బంధువులు అతడిని య‌శ్వంత్ అని పిలిచేవారు. య‌శ్వంత్ పేరుతో యాక్టింగ్ ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన ఈ యువ నటుడు, య‌శ్ పేరుతో పాపుల‌ర్ అయ్యారు. బాబుకోడి వెంక‌ట‌ర‌మ‌ణ‌ క‌రంత్ (బీవీ క‌రంత్)  ద‌గ్గ‌ర నేష‌న‌ల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో యాక్టింగ్ పాఠాలు నేర్చుకుని  పరిశ్రమలోకి అడుగుపెట్టారు. బీవీ క‌రంత్ ప్రముఖ క‌న్న‌డ సినిమా డైరెక్ట‌ర్, ర‌చ‌యిత‌. 

Yash Family (యశ్ కుటుంబం)

య‌శ్ తండ్రి అర్జున్ కుమార్ కేజీఎఫ్ చాప్ట‌ర్ 1 సినిమా విడుదల వ‌ర‌కు ఆర్టీసీ డ్రైవ‌ర్‌గానే ప‌నిచేశారట‌. "ఎందుకు నాన్న ఇంకా ఆ ఉద్యోగం చేస్తున్నార‌ని" య‌శ్ త‌న తండ్రిని అడిగారు. "య‌శ్..! నువ్వు చేసే యాక్టింగ్ నీకు ఆనందాన్ని ఇస్తుంది.. నేను చేసే ఉద్యోగం నాకు ఆనందాన్ని ఇస్తుంది" త‌న తన తండ్రి అన్నార‌ని య‌శ్ తెలిపారు . తమకు ఇష్ట‌మైన ప్రొఫెష‌న్స్ ఎవరికైనా చాలా ఆనందం క‌లిగిస్తాయంటారు య‌శ్.

Yash Photo Still (యశ్ ఛాయాచిత్రం)

య‌శ్ యాక్టింగ్..
య‌శ్ మొద‌ట సీరియ‌ల్స్‌తో బుల్లితెర‌పై మెరిశాడు. ఈ-టీవీ క‌న్న‌డ‌లో మొద‌టి సీరియ‌ల్ చేశారు. మాలేబిల్లు, ముక్తా, ప్రీతి ఇల‌దా మేలే వంటి సీరియ‌ల్స్‌లో యాక్ట్ చేశారు. ఆ త‌ర్వాత వెండితెర‌పైన య‌శ్ అద‌ర‌గొట్టారు. మెగ్గిన మ‌న‌సు అనే సినిమాలో  రాధిక పండిట్ లీడ్ రోల్ చేశారు. అదే సినిమాలో య‌శ్ స‌పోర్ట్ ఆర్టిస్టుగా న‌టించారు. ఆ సినిమాలో య‌శ్ న‌ట‌న‌కు బెస్ట్ స‌పోర్టింగ్ యాక్ట‌ర్ అవార్డు వ‌చ్చింది. ఇక అప్ప‌టి నుంచి వెండితెర బాస్‌గా అయ్యేవ‌ర‌కు వ‌రుస హిట్ సినిమాలు చేస్తూ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు యశ్. రాఖీ, రాజ‌ధాని, ల‌క్కీ, జాను, గూగ్లీ, మాస్ట‌ర్ పీస్, సంతు, మిస్ట‌ర్ అండ్ మిసెస్ రామాచారి సినిమాల‌తో కన్న‌డ ఫిలిమ్ ఇండ‌స్ట్రీలో సూప‌ర్ హీరోగా య‌శ్ పేరు తెచ్చుకున్నారు. 

KGF 1 Poster

కేజీఎఫ్ అవ‌కాశం
ద‌ర్మ‌కుడు ప్ర‌శాంత్ నీల్ కేజీఎఫ్ క‌థ కోసం హీరోని వెతుకున్నారు. క‌న్న‌డ స్టార్ య‌శ్ ఆయన క‌ళ్ల‌లో ప‌డ్డారు. య‌శ్ స్టైల్ చూసిన ప్ర‌శాంత్ కేజీఎఫ్ హీరోగా ఆయన100%  సెట్ అవుతార‌ని ఫిక్స్ అయ్యారు. య‌శ్ హీరోగా కేజీఎఫ్ చాప్ట‌ర్1 సినిమాను 2018లో క‌న్న‌డ భాష‌లో తెర‌కెక్కించారు. క‌న్న‌డ‌తో పాటు హిందీ, తెలుగు, త‌మిళ్, మ‌ల‌యాళం భాష‌ల్లో ఈ సినిమాను డ‌బ్ చేసి ఓకేసారి ఐదు భాష‌ల్లో రిలీజ్ చేశారు. 

కేజీఎఫ్ చాప్ట‌ర్1 రిలీజ్ అయిన త‌ర్వాత థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లాయి. య‌శ్ యాక్టింగ్‌కు , ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్‌కు ఆకాశ‌మే హ‌ద్దుగా రికార్డుల మోత మోగింది. 250 కోట్ల రూపాయ‌ల వసూళ్లు సాధించిన మొదటి కన్నడ చిత్రంగా., కేజీఎఫ్ చాప్ట‌ర్ 1 వినూత్న రికార్డు సాధించింది. మిగిలిన భాష‌ల్లో కూడా కేజీఎఫ్ చాప్ట‌ర్ 1 దుమ్ము రేగొట్టింది. 

KGF Chapter 2

కేజీఎఫ్ 2 రికార్డుల మోత‌
కేజీఎఫ్ చాప్ట‌ర్‌ 2 సినిమా అనేక ఇండియ‌న్ సినిమా రికార్డులను అధిగమించేసింది . వేయి కోట్ల రూపాయ‌ల మార్క్ దాటింది. రూ.1000 కోట్లు వసూళ్లు సాధించిన నాల్గవ భారతీయ సినిమాగా రికార్డు బ్రేక్ చేసింది. క‌న్న‌డ సినిమా ఇండ‌స్ట్రీలో రూ.100 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన సినిమా కూడా కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 నే. కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 ఉత్తరాదిలో రూ.350 కోట్లు వ‌సూళ్లు సాధించిన మొద‌టి సినిమాగా నిలిచింది. 

Yash Fan Made Art (ఓ అభిమాని గీసిన చిత్రం)

విజ‌యంపై య‌శ్ ఏమన్నారు
టాలెండ్ ఉంటే రిక‌మండేష‌న్లు అవ‌స‌రం లేదంటారు య‌శ్. సీరియ‌ల్స్ చేసే టైంలో త‌న‌కు వ‌చ్చే డ‌బ్బులు మొత్తం కాస్టూమ్స్ కోసం తెగ ఖ‌ర్చు చేసేవార‌ట‌. ఐదు సీరియ‌ల్స్ చేస్తే... ప్ర‌తీ సీరియ‌ల్ కోసం కొత్త డ్రెస్సులు కొనేవార‌ట‌. త‌న ఫ్రెండ్స్ మాత్రం ఒక సీరియ‌ల్‌లో వేసిన డ్రెస్ మ‌రో సీరియ‌ల్‌లో వేసి... డ‌బ్బులు సేవ్ చేసుకొని కార్లు కొనేవార‌ట‌. య‌శ్ మాత్రం న్యూ లుక్ కోసం కాస్టూమ్స్ కొంటూ కొత్త ద‌నం కోరుకునేవార‌ట‌. త‌న స్టైలిష్ లుక్‌తో సినిమా అవ‌కాశాలు వ‌స్తాయ‌ని య‌శ్ అనుకునేవార‌ట‌.

య‌శ్ డ్రెసింగ్, స్టైలిష్ న‌ట‌న‌ న‌చ్చే ప్ర‌శాంత్ నీల్ కేజీఎఫ్‌లో ఆఫ‌ర్ ఇచ్చారు. కేజీఎఫ్ సినిమాల్లో కూడా య‌శ్ కాస్టూమ్స్ అదిరిపోయాయి. కేజీఎఫ్‌ 2 సినిమాలో య‌శ్ డ్రెస్సింగ్ మూములుగా లేదు. క‌ల‌ర్ కాంబినేష‌న్ కోట్స్, షూస్, ఐ గ్లాసెస్, వాచెస్.. ఇలా ప్ర‌తీ కాస్టూమ్స్ వావ్ అనిపించేలా ఉన్నాయి. య‌శ్ సెలెక్ష‌న్ ఎప్పుడూ ట్రెండ్ సెట్ చేసేదిగా ఉంటుందేమో. 

కేజీఎఫ్ ఛాప్టర్ 2 పోస్టర్

కేజీఎఫ్ య‌శ్ డైలాగ్స్
"ప్ర‌పంచంలో త‌ల్లిని మించిన యోధులు ఎవ‌రూ ఉండరు" అనే డైలాగ్ య‌శ్ రాశారు. కేజీఎఫ్ సినిమా క‌థను గురించి చ‌ర్చించేట‌ప్పుడు, తనకు పదే పదే రాధిక పండిట్ ఫోన్లు చేసేవారట. ఆ టైంలో రాధిక పండిట్ ప్రెగ్నెంట్ అని.. డైలాగ్స్ కోసం చ‌ర్చిస్తుంటే, ఆమె చాలా సార్లు ఫోన్ చేశారని తెలిపారు. అప్పుడు తనకు అమ్మ కంటే పోరాటం చేసేవారు ఎవ‌రూ ఉండరనే మాట స్ఫురించిందని య‌శ్ చెప్పారు. అమ్మ‌పై త‌న ఫీలింగ్ ప్ర‌శాంత్ నీల్‌కు చెప్ప‌గానే.. అదే మాటను డైలాగ్‌గా పెట్టార‌ని చెప్పుకొచ్చారు. 

KGF Chapter 2

కేజీఎఫ్ టీంపై య‌శ్ ఫీలింగ్
కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ సినిమాలో ప్ర‌తీ క్యారెక్ట‌ర్‌ను బలంగా తీర్చిదిద్దారు. ఓ త‌ల్లి లక్ష్యం గురించి చెప్పిన క‌థ‌ను ప్ర‌శాంత్ నీల్ చాలా గొప్ప‌గా తీశారు. ఈ సినిమాలో త‌ల్లి పాత్ర‌ పోషించిన అర్చ‌నతో తనకు ర‌క్త సంబంధం లేక‌పోయినా కూడా.. ఆమె పాత్రలోని ఔచిత్యం తనను కదిలించిందని  య‌శ్ పొగిడారు. అలాగే హీరోయిన్ శ్రీనిధి శెట్టికి ఇది మొద‌టి సినిమా.  ఏదేమైనా, ఆమె ల‌క్కీ హీరోయిన్. విచిత్రమేంటంటే, కేజీఎఫ్ సినిమాపై న‌మ్మ‌కం ఉంచి మెహ‌బూబా (శ్రీనిధి శెట్టి) ఐదారేళ్లు వేరే సినిమాలు చేయ‌కుండా వెయిట్ చేశారు. హీరోయిన్స్ సాధారణంగా ఇంత టైం వేస్ట్ చేయ‌రు. కానీ శ్రీనిధి శెట్టి సినిమా మీద న‌మ్మ‌కంతో వెయిట్ చేశారని య‌శ్ అన్నారు. ఇక డిజైన‌ర్ సానియా కూడా త‌న‌ను మరింత‌ స్టైలిష్‌గా క‌నిపించేలా చేశార‌ని య‌శ్ తనను కొనియాడారు. త‌న స్టైలిష్ లుక్ సీక్రెట్ చెప్పారు.  

KGF Chapter 2


రాధిక పండిట్ గురించి
య‌శ్ సతీమణి పేరు రాధిక పండిట్. య‌శ్, రాధిక పండిట్.. ఇద్ద‌రూ ఒకేసారి యాక్టింగ్ ఫీల్డ్‌కు వ‌చ్చారు. ఇద్ద‌రూ క‌లిసి సీరియ‌ల్స్, సినిమాలు చేశారు.  పిల్లలను ప్రేమగా చూసుకొనే ప్రతీ అమ్మ మనసూ గొప్పదేనని య‌శ్ అంటారు. త‌న భార్య రాధిక పండిట్ కూడా గొప్ప త‌ల్లి అని ఆయన చెబుతారు. య‌శ్ సినిమాకు ఓ పునాదిలా నిల‌బ‌డ‌తార‌ని, అత‌ని భార్య రాధిక పండిట్ పలుమార్లు ఇంటర్వ్యూలలో తెలిపారు. య‌శ్‌కు క‌న్న‌డ త‌ప్ప ఏ భాష రాని టైంలో, అత‌ని భార్య రాధిక ఇంగ్లీష్ నేర్చించార‌ట‌. తాను లోక‌ల్ అంటూ య‌శ్ స‌ర‌దాగా అంటుంటారు. భాష క‌మ్యూనికేషన్ కోసమ‌ని... అవ‌త‌లి వారికి దానిని అర్ధం అయ్యేలా చెబితే చాల‌న్నది య‌శ్ ఫీలింగ్.

KGF Chapter 2

అభిమానుల కోసం య‌శ్
త‌న‌ను అభిమానించే వారిని య‌శ్ కూడా అంతే అభిమానిస్తారు. త‌న సినిమా హిట్ అయితే అభిమానులు ఎలా సంబ‌రాలు జ‌రుపుకుంటారో.. అలాగే వారు తమ జీవితాల్లో లక్ష్యాల సాధనకు కూడా కృషి చేయాలని, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని  య‌శ్ కోరుకుంటున్నారు. త‌న అభిమానులు ఎవరి కెరీర్‌లో వారు సెటిలై సంబరాలు చేసుకుంటూ ఉంటే... అదే త‌న‌కు నిజ‌మైన సంతోషాన్నిస్తుందని ఆయన తెలిపారు. 

KGF Chapter 2

య‌శ్ వ్య‌క్తిత్వం
"టాలెంట్ ఎప్పుడూ మ‌న‌లో ఉండాలి. టాలెంట్ ఉన్న వాళ్లు తమ ప్ర‌య‌త్నాల్లో ఏదో ఒక‌సారి విజ‌యం సాధిస్తారు. "వాళ్లు తెలుసు, వీళ్లు తెలుసు"  అనుకుంటూ మీనమేషాలు లెక్కబెడుతూ, తమ స్కిల్స్‌ను మెరుగుపరచుకోకపోతే ఎవరూ విజయం సాధించలేరు. మ‌న కృషిపై మ‌న‌కు న‌మ్మ‌క‌ముంటే కచ్చితంగా విజయం సాధిస్తాం" అంటున్నారు య‌శ్ బాస్. 

 

KGF Chapter 2

సినిమా న‌చ్చితే చాలు.. భాష అర్ధం కాక‌పోయినా, భావం అర్థం అవుతుంది. క‌న్న‌డ‌లో పుట్టిన య‌శ్ ఇండియ‌న్ హీరో అని చెప్పుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు. ఆయనకు అభిమానులు అన్ని భాష‌ల్లోనూ ఉన్నారు. సినిమాకు కావ‌ల్సింది న‌ట‌న మాత్ర‌మేన‌ని అంటారు ఈ పాన్ ఇండియా హీరో. కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 త‌ర్వాత, కేజీఎఫ్ చాప్ట‌ర్ 3 కూడా చేయాల‌ని అభిమానులు కోరితే త‌ప్ప‌కుండా చేస్తానంటున్నాడు రాఖీభాయ్.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!