‘కేజీయఫ్‌2’, కాశ్మీర్‌‌ఫైల్స్‌ సినిమాలపై డైరెక్టర్ రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) షాకింగ్‌ కామెంట్స్‌

Updated on Sep 05, 2022 06:32 PM IST
డైరెక్టర్ రాంగోపాల్ వర్మ (RGV).. ఇప్పటికే ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాపై పలు కామెంట్లు చేశారు
డైరెక్టర్ రాంగోపాల్ వర్మ (RGV).. ఇప్పటికే ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాపై పలు కామెంట్లు చేశారు

బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్ కేజీయఫ్‌2 (KGF2) సినిమాపై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) సంచలన కామెంట్లు చేశారు. బిగ్గెస్ట్‌ యాక్షన్ ఎంటర్‌‌టైనర్‌‌గా, కేజీఎఫ్‌ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన కేజీయఫ్‌2 సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా దాదాపుగా రూ.1,250 కోట్లు కలెక్ట్‌ చేసి బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. కేజీయఫ్‌2 సినిమా సంచలన విజయం బాలీవుడ్‌ను భయపెట్టిందని వ్యాఖ్యలు చేశారు రాంగోపాల్ వర్మ.

తన మనసులో ఉన్న మాటలను ముక్కుసూటిగా బయటపెట్టే దర్శకుడు రాంగోపాల్‌ వర్మ. ఇటీవల మీడియాలో మాట్లాడిన వర్మ.. కేజీయఫ్‌2తోపాటు కశ్మీర్‌‌ ఫైల్స్‌ సినిమాపై తన అభిప్రాయాలను తెలియజేశారు.

‘కేజీయఫ్‌2’ సినిమా బాలీవుడ్‌లో చాలా మందికి నచ్చలేదు. బీటౌన్‌కు చెందిన ఒక పెద్ద దర్శకుడు నాకు ఫోన్‌ చేసి సినిమా అరగంట కూడా చూడకముందే బోర్‌గా అనిపించిందని చెప్పారు. అదే సినిమాలోని ఒకసీన్‌ విషయంపై ఆయనకు, ఆయన స్క్రిప్ట్‌ రైటర్‌కు మధ్య చర్చ జరిగినట్లు కూడా తెలిపారు. వాళ్లకు నేను చెప్పేది ఒక్కటే. కేజీయఫ్‌2 సినిమా మీకు నచ్చినా, నచ్చకపోయినా అది సాధించిన విజయాన్ని ఎవరూ కాదనలేరు.

డైరెక్టర్ రాంగోపాల్ వర్మ (RGV).. ఇప్పటికే ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాపై పలు కామెంట్లు చేశారు

కొన్ని సీన్స్‌ ఎలా చూశానంటే..

నా దృష్టిలో ‘కేజీయఫ్‌2’ సినిమా ఒక డిఫరెంట్‌ కథతో తెరకెక్కింది. 1970ల్లో బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్‌ నటించిన సినిమాల జానర్‌‌కు జోన్‌కు సంబంధించిన కథ ఇది. నిజాలకు దూరంగా దర్శకుడు ప్రశాంత్‌నీల్‌ కేజీయఫ్‌2 సినిమాను తెరకెక్కించారు. ఒకసారి ‘పెద్దమ్మ’ సీన్‌నే గుర్తు చేసుకుంటే రాఖీభాయ్‌ మెసీన్‌ గన్‌తో పేలిస్తే జీపులన్నీ గాల్లోకి ఎగురుతాయి. ఇలా జీపులు గాల్లోకి లేవడం విడ్డూరంగా అనిపిస్తుంది. ఈ సినిమా నాకు నచ్చలేదని చెప్పను. కేజీయఫ్‌2 (KGF2) సినిమాలోని కొన్ని సీన్స్‌ నోరెళ్లబెట్టుకుని మరీ చూశా’ అని చెప్పారు ఆర్జీవీ.

‘ఈ ఏడాది విడుదలై అద్భుత విజయాన్ని అందుకున్న వాటిలో ‘కశ్మీర్‌ఫైల్స్‌’ సినిమా కూడా ఒకటి. బాలీవుడ్‌ వాళ్లు కూడా పెద్దగా పట్టించుకోని ఒక దర్శకుడి నుంచి ఇలాంటి సినిమా రావడం చాలా గొప్ప విషయం. ఈ సినిమాలో నటించిన వారిలో అందరికీ తెలిసింది అనుపమ్ ఖేర్‌ ఒక్కరు మాత్రమే.

కానీ, ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర రూ.250 కోట్లు వసూలు చేసింది. దర్శకుడు ఈ చిత్రాన్ని స్లో నెరేషన్‌లో రూపొందించారు. సరైన స్క్రీన్‌ప్లే, ఇంటర్వెల్‌, క్లైమాక్స్‌ లేనప్పటికీ ప్రేక్షకులు కశ్మీర్‌‌ఫైల్స్‌ సినిమాను విశేషంగా ఆదరించారు. గడిచిన 20 ఏళ్లలో ‘కశ్మీర్‌ ఫైల్స్‌’ని చూసినంత సీరియస్‌గా ఏ సినిమానూ కూడా ప్రేక్షకులు చూసి ఉండరు’ అని చెప్పుకొచ్చారు ఆర్జీవీ (Ram Gopal Varma).

Read More : RRR Movie: ఆర్ఆర్ఆర్ ఓ 'గే' సినిమా అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్.. ఆర్జీవీని ఆడుకుంటున్న నెటిజన్లు!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!