కేజీఎఫ్2 (KGF2) కోసం అంత కష్టపడ్డారా
కేజీఎఫ్2 (KGF2) సినిమా హవా ఇంకా కొనసాగుతుంది. ఎక్కడ చూసినా యశ్ సీన్స్‌పై చర్చ జరుగుతుంది. కేజీఎఫ్2 సీన్స్ తీసిన వారెవరో తెలుసుకోవడానికి నెటజన్లు సెర్చ్ చేస్తున్నారు.
పాన్ ఇండియన్ స్టార్ యశ్ నటించిన కేజీఎఫ్2(KGF2) సినిమా రికార్డులు బద్దలు కొట్టింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ బాక్సాఫీస్ వద్ద సంచనాలు సృష్టిస్తుంది. కన్నడ భాషలో తీసిన కేజీఎఫ్2ను ఐదు భాషల్లో విడుదల చేశారు. ఇండియన్ సినిమా రేంజ్‌ను ఒక్కసారిగా మరింత పెంచింది.
కేజీఎఫ్2 రిలీజ్ అయిన 15 రోజుల్లో వేయి కోట్లు వసూళ్లు చేసి కొత్త రికార్డును కొల్లగొట్టింది. కొద్ది రోజుల్లో వేయి కోట్ల మార్కును దాటి కాసుల తుఫాను కురిపించనుంది. హిందీలో కూడా 300 కోట్ల రూపాయల వసూళ్లును దాటి 400 కోట్ల రూపాయలకు చేరువవుతుంది. హాలీవుడ్ రేంజ్ సినిమాగా దూసుకుపోతుంది.
కేజీఎఫ్2(KGF2) సినిమా కోసం చిత్ర యూనిట్ చాలా కష్టపడింది. సినిమా హిట్‌లో వాళ్ల కష్టం చాలా ఉంది. కెమెరా డిపార్ట్ మెంట్ ఎంత శ్రమపడిందో చూపించడానికి ఓ వీడియోను విడుదల చేశారు. రూట్ టు ఎల్డోరాడో (ఎపిసోడ్ -1) పేరుతో ఓ మేకింగ్ వీడియోని కేజీఎఫ్2 టీం విడుదల చేసింది.
భువన్ గౌడ కేజీఎఫ్2 సినిమాకు కెమెరామెన్‌గా వర్క్ చేశారు. తన టీం కేజీఎఫ్2 మేకింగ్‌కు పడిన శ్రమను వివరించారు. రియాలిటీకి దగ్గరగా చూపించేందుకు ప్రయత్నించారు. ఎలాంటి కష్టానికైనా తట్టుకుని సినిమాను నిలబెట్టారు. బుల్లెట్ల వర్షం కురిసిందా అన్నట్లు కొన్ని సీన్స్ కెమెరాలో బంధించారు.
ఇక ఆర్ట్ డిపార్టుమెంట్ వేసిన సెట్లు కళ్లారా చూశాక.. రీల్ కోసం కాదు రియల్ అనిపించేలా ఉన్నాయి. రోజుకు 12 గంటలు శ్రమించారట. వందల మంది కనిపించే సీన్ల కోసం ఇంకా ఎక్కువ గంటలు పనిచేశారట. బ్లాస్టింగ్ సీన్స్ దుమ్ములేపాలా చేశారు. డస్ట్ వల్ల వచ్చే ప్రాబమ్స్‌ని లెక్కచేయలేదు.
చీకటిలో కాగడాలను వెలిగించి సీన్స్ చేశారట. ప్రశాంత్ నీల్ అనుకున్నది అనుకున్నట్లు తెరకెక్కించారట టెక్నికల్ టీం. ఎక్కువ రోజుల అనుకున్న షూటింగ్ షెడ్యూల్ తక్కువ రోజుల్లో చేసి చూపించారట. పగలు, రాత్రి తేడా లేకుండా కేజీఎఫ్2 జపం చేశారట. బ్లాస్టింగ్ సీన్స్ తీసేటప్పుడు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. అవన్నీ పట్టించుకోకుండా అదిరే సినిమా కోసం అందరూ ఇష్టపడి చేశారట.
ఇండియన్ సినిమాలో కేజీఎఫ్2 (KGF2) సరి కొత్తగా చూపించాలనుకున్నారు. అంతే కొత్తగా సినిమా తీశారు. కేజీఎఫ్ సామ్రాజ్యం వెండి తెరపై మెరిసిపోయేలా చేశారు. ఐదేళ్ల ప్రయాణం ఎంతో ఆనందం ఇచ్చిందని డీవోపీ టీం చెప్పింది. తమ శ్రమకు తగిన రిజల్ట్ వచ్చిందని డీవోపీ టీం సంతోష పడుతుంది.