రాంచరణ్‌ (RamCharan) క్రేజ్ మామూలుగా లేదుగా.. ‘ఆర్‌‌సీ15’ సినిమా నాన్‌ థియేట్రికల్ హక్కులకు అన్ని కోట్లా!

Updated on Sep 05, 2022 07:39 PM IST
ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమా తర్వాత రాంచరణ్‌ (RamCharan) శంకర్ డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నారు
ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమా తర్వాత రాంచరణ్‌ (RamCharan) శంకర్ డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నారు

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మెగాపవర్‌‌స్టార్ రాంచరణ్‌ (RamCharan) నటిస్తున్న సినిమా ‘ఆర్సీ15’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతోంది. శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు పలు టైటిల్స్ పరిశీలనలో ఉన్నా ఏదీ ఖరారు చేయలేదు. ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ వంటి భారీ హిట్ తర్వాత చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఆర్సీ15కు సంబంధించి వార్త ఒకటి వైరల్ అవుతోంది. ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్‌కు భారీ ధర పలికినట్లు తెలుస్తోంది.

రాంచరణ్ – శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను  నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి బయటకొస్తున్న అప్‌డేట్స్ మెగా అభిమానులకు కిక్ ఇస్తున్నాయి.

ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమా తర్వాత రాంచరణ్‌ (RamCharan) శంకర్ డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నారు

ఇంతకు మించే..

ఆర్‌‌సీ15 సినిమా నాన్ థియేట్రికల్ హక్కులకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ బజ్ బయటికి వచ్చింది. ఈ టాక్ ప్రకారం సినిమా నాన్ థియేట్రికల్ హక్కులకు రూ.200 కోట్లు పలికినట్టుగా తెలుస్తోంది. థియేట్రికల్ బిజినెస్ కూడా ఇంతకు మించే జరిగే చాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆ విషయాలకు సంబంధించిన వార్తలు ఏవీ బయటకు రాలేదు. చరణ్‌ – శంకర్‌‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎస్‌ఎస్‌ థమన్‌ సంగీతం అందిస్తున్నారు. దిల్‌ రాజు బ్యానర్‌‌లో 50వ సినిమాగా ఆర్‌‌సీ15 తెరకెక్కుతోంది.

ఔట్ అండ్ ఔట్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రెండు విభిన్న పాత్రల్లో రాంచరణ్ కనిపించనున్నారని సమాచారం. గుబురు గడ్డం, కళ్ల జోడుతో సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నారు చరణ్. ఈ సినిమాకు విశ్వంభర, సర్కారోడు, అధికారి లాంటి టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఎలక్షన్ కమీషనర్‌గా రాంచరణ్ (RamCharan) నటిస్తున్నారని టాక్.  

Read More : జేమ్స్‌బాండ్‌గా హాలీవుడ్‌కి మెగా పవర్‌‌స్టార్‌‌ రాంచ‌ర‌ణ్‌ (RamCharan).. ఆనందంలో మెగా అభిమానులు!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!