Salman Khan : సల్మాన్ ఖాన్‌తో కలిసి ఒకే ఫ్రేములో బందీలైన.. వెంకటేష్, పూజా హెగ్డే, రామ్ చరణ్ దంపతులు

Updated on Jun 27, 2022 01:11 PM IST
బచ్చన్ పాండే, హౌస్ ఫుల్ 4 లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన ఫర్హాద్ సామ్జీ కభీ ఈద్ కభీ దివాళీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు
బచ్చన్ పాండే, హౌస్ ఫుల్ 4 లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన ఫర్హాద్ సామ్జీ కభీ ఈద్ కభీ దివాళీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు

అప్పుడప్పుడు ఇండస్ట్రీలో సినీ అభిమానులు కొన్ని కొన్ని అరుదైన సంఘటనలను చూసి ఆశ్చర్యపోతుంటారు. అందులో ముఖ్యంగా బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు, అరుదైన సందర్భాలలో కలిసి ఫోటోలు దిగితే, ఫ్యాన్స్‌కు ఆ మజాయే వేరు. పవన్ కళ్యాణ్ గతంలో అమితాబ్ బచ్చన్‌తో ఫోటో దిగినప్పుడూ.. అలాగే చిరంజీవి సంజయ్‌దత్‌తో ఫోటోలు దిగినప్పుడు కూడా అవి బాగా వైరల్ అయ్యాయి. 

ఇద్దరు వేరు వేరు ఇండస్ట్రీలకు చెందిన వ్యక్తులు కలిసి మాట్లాడుకుంటే.. వారి ఎందుకు కలిశారా? అన్న ఆసక్తి అభిమానులకు ఏర్పడడం సహజం. కానీ అది ఒకప్పుడు మాత్రమే. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్‌లో భాషా బేధం లేకుండా నటులందరూ అన్ని ప్రాంతాల సినిమాలలోనూ నటిస్తున్నారు. ప్రభాస్, అల్లు అర్జున్, యశ్ లాంటి వారు నటించిన సినిమాలు ఉత్తరాదిలో కూడా దుమ్ముదులిపాయి. 

రామ్ చరణ్, సల్మాన్ ఖాన్ ఒకే ఫ్రేములో.. 

ఈ క్రమంలో ఇటీవలే ఒకే ఫ్రేములో నలుగురు సెలబ్రిటీలు కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియా బాగా ట్రెండ్ అయ్యింది. ఈ ఫోటోలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) , విక్టరీ వెంకటేష్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, అతని సతీమణి ఉపాసనతో పాటు కథానాయిక పూజా హెగ్డే కూడా ఒకే ఫ్రేములో ఉన్నారు. 

హైదరాబాద్‌లో సల్మాన్ సందడి

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ (Salman Khan) కభీ ఈద్ కభీ దివాళీ (Kabhi Eid Kabhi Diwali) అనే సినిమా షూటింగ్ నిమిత్తం హైదరాబాద్‌లో గడుపుతున్నారన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, రామ్ చరణ్‌‌లు కూడా నటిస్తున్నారని ఓ టాక్ వచ్చింది. అయితే, అది ఎంత వరకు నిజమో తెలియదు. మరో వైపు, రామ్ చరణ్‌కు బాలీవుడ్‌లో ఆఫర్లు రావడం గమనార్హం. 

ఇక, సల్మాన్ ఖాన్ (Salman Khan) నటిస్తున్న కభీ ఈద్ కభీ దివాళీ సినిమా విషయానికి వస్తే, ఈ చిత్రం సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. బచ్చన్ పాండే, హౌస్ ఫుల్ 4 లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన ఫర్హాద్ సామ్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు నటుడు జగపతి బాబు కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

Read More: చిరంజీవి (Chiranjeevi) సినిమాలో విలన్‌గా న‌టిస్తున్న స‌ల్మాన్ ఖాన్.. ఆ సినిమా పేరేమిటో తెలుసా ? 


 

Advertisement
Credits: Instagram

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!