చిరంజీవి (Chiranjeevi) సినిమాలో విలన్‌గా న‌టిస్తున్న స‌ల్మాన్ ఖాన్.. ఆ సినిమా పేరేమిటో తెలుసా ?

Updated on Jun 21, 2022 04:50 PM IST
చిరంజీవి (Chiranjeevi) న‌టిస్తున్న గాడ్ ఫాద‌ర్ సినిమాలో సల్మాన్ ఖాన్ న‌టించ‌నున్నారు.
చిరంజీవి (Chiranjeevi) న‌టిస్తున్న గాడ్ ఫాద‌ర్ సినిమాలో సల్మాన్ ఖాన్ న‌టించ‌నున్నారు.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ న‌టిస్తున్నారు. రాజ‌కీయ నేప‌థ్యంలో ఈ సాగే సినిమాలో ఈ ఇద్దరు లెజండరీ స్టార్లు ప్రేక్షకులకు కనువిందు చేయనున్నారు. చిరంజీవి, స‌ల్మాన్ ఇద్ద‌రి న‌ట‌న ఒకే స్కీన్‌పై క‌నిపిస్తే.. ఇక ఫ్యాన్స్‌కు పండుగే. టాలీవుడ్, బాలీవుడ్ స్టార్లు క‌లిసి చేసే ఆ సినిమా సంగ‌తులేంటో తెలుసుకుందాం.

మ‌ళ‌యాళం సినిమా రీమేక్
చిరంజీవి న‌టిస్తున్న 'గాడ్ ఫాద‌ర్' సినిమాలో సల్మాన్ ఖాన్ న‌టించ‌నున్నారు. 'గాడ్‌ఫాద‌ర్' సినిమా పొలిటిక‌ల్ యాక్ష‌న్ సినిమాగా తెర‌కెక్కుతోంది. మ‌ళ‌యాళం సినిమా 'లూసిఫ‌ర్'ను రీమేక్ చేసి గాడ్ ఫాద‌ర్‌గా తెలుగులో నిర్మించనున్నారు. మ‌లయాళంలో ఇదే చిత్రంలో మోహ‌న్‌లాల్ హీరోగా న‌టించారు. ద‌ర్శ‌కుడు, న‌టుడు పృథ్విరాజ్ సుకుమార‌న్ 'లూసీఫ‌ర్' సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

చిరంజీవి సొంత నిర్మాణ సంస్థ 'కొణిద‌ల ప్రొడ‌క్ష‌న్‌'లో గాడ్ ఫాద‌ర్ తెర‌కెక్కుతోంది. ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో 'గాడ్ ఫాద‌ర్' సినిమాను నిర్మిస్తున్నారు. 'గాడ్ ఫాద‌ర్' చిత్రంలో చిరంజీవికి జోడిగా లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార న‌టిస్తున్నారు .

గాడ్ ఫాద‌ర్‌లో సల్మాన్ ఖాన్
బాలీవుడ్ సీనియ‌ర్ హీరో స‌ల్మాన్‌ఖాన్ టాలీవుడ్ సినిమాల్లో చేస్తున్నారంటూ ఆ మ‌ధ్య పుకార్లు వ‌చ్చాయి. ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా హరీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న భ‌వ‌దీయుడు భ‌గ‌త్‌సింగ్ సినిమాలో కూడా.. స‌ల్మాన్ న‌టిస్తున్నార‌నే ప్ర‌చారం జ‌రిగింది . అయితే ప‌వ‌న్ న‌టిస్తున్న చిత్రంలో స‌ల్మాన్ యాక్ట్ చేయ‌డం అబ‌ద్ధం అంటూ హ‌రీష్ శంక‌ర్ ట్వీట్ చేశారు. 

చిరంజీవి పార్టీలో సల్మాన్

చిరంజీవి ఇటీవలే త‌న ఇంట్లో క‌మ‌ల్ హాస‌న్‌కు, స‌ల్మాన్ ఖాన్‌కు పార్టీ ఇచ్చారు. ఆ పార్టీ వెనుక ఉన్న సీక్రెట్ రివీల్ అయింది. మెగా 154లో క‌మ‌ల్ హాస‌న్ కూతురు శృతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న 'గాడ్ ఫాద‌ర్' సినిమాలో సల్మాన్ ఖాన్ న‌టిస్తున్నారు. విక్ర‌మ్ స‌క్సెస్‌కు వ‌చ్చిన క‌మ‌ల్‌ను, హైద‌రాబాద్ షూటింగ్ కోసం వ‌చ్చిన స‌ల్మాన్‌ను చిరు త‌న ఇంటికి ఆహ్మానించారు. క‌మ‌ల్, స‌ల్మాన్‌ల‌కు చిరంజీవి పార్టీ కూడా ఇచ్చారు. 

గాడ్ ఫాద‌ర్‌లో స‌ల్మాన్ క్యారెక్ట‌ర్ ఏంటో!
చిరంజీవి, న‌య‌న‌తార న‌టిస్తున్న 'గాడ్ ఫాద‌ర్' సినిమా షూటింగ్ కూడా వేగంగానే జ‌రుగుతోంది. ఈ సినిమ‌లో స‌ల్మాన్ ఖాన్ ఓ ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఆ విష‌యాన్ని చిత్ర యూనిట్ తెలిపింది. 

ఇందులో స‌ల్మాన్ ఖాన్ పాత్ర ఎలా ఉంటుందోన‌నే ఇప్పటికే అభిమానులలో ఆస‌క్తి పెరిగింది. రాజ‌కీయ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో స‌ల్మాన్ కాన్ ఓ గ్యాంగ‌స్ట‌ర్‌గా క‌నిపించ‌నున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి, స‌ల్మాన్ ఖాన్‌ల మధ్య ఓ వార్ సీక్వెన్స్ కూడా ఉంటుందట. మరి ఇద్ద‌రూ ఏ లెవ‌ల్‌లో ఫైట్ చేస్తారో చూడాలి.

మ‌లయాళ చిత్రం 'లూసీఫ‌ర్‌'లో  ద‌ర్శ‌కుడు, న‌టుడు పృథ్విరాజ్ సుకుమార‌న్ ఓ పాత్రలో న‌టించారు. అదే పాత్రను తెలుగులో సల్మాన్ పోషిస్తారని టాక్. 'లూసీఫర్' చిత్రంలో మోహ‌న్ లాల్ మారువేషంలో రష్యా వెళ్లి పృథ్విరాజ్‌ను ప‌ట్టుకుంటారు. ఇక గాడ్ ఫాద‌ర్‌గా చిరంజీవి స‌ల్మాన్ ఖాన్ కోసం ర‌ష్యా వెళ్తారో లేదో తెలియాల్సి ఉంది.

'గాడ్ ఫాద‌ర్' సినిమాలో స‌త్య‌దేవ్ ప్ర‌త్యేక పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. త‌మ‌న్  ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. గాడ్ ఫాద‌ర్ షూటింగ్ హైద‌రాబాద్, ముంబై, ఊటీలో జ‌రుగుతోంది. ఇక సినిమా రిలీజ్ ఎప్పుడో చిత్ర యూనిట్ ప్ర‌క‌టించ‌లేదు. 'ఆచార్య' సినిమాలా కాకుండా.. లేటైనా బ‌ల‌మైన క‌థ‌తో చిరంజీవి సినిమాలు విడుద‌ల చేయాల‌నుకుంటున్నార‌ట‌.

Read More : Brahmastra Trailer : బ్ర‌హ్మాస్త్రం ట్రైల‌ర్ రిలీజ్.. ఇందులో చిరంజీవి డైలాగ్స్ వెంటే ఫ్యాన్స్ ఈలలు వేయాల్సిందే

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!