రిషబ్ శెట్టి (Rishab Shetty)కి గోల్డ్ చైన్ బహూకరించిన రజినీ (Rajinikanth).. ‘కాంతార’ దర్శకుడిపై మెచ్చుకోలు!

Updated on Nov 17, 2022 12:01 PM IST
అద్బుతమైన సినిమా తీశావంటూ రిషబ్ శెట్టి (Rishab Shetty)ని మెచ్చుకున్న తలైవా (Rajinikanth).. ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఆయనకు ఓ బహుమతిని ఇచ్చారు
అద్బుతమైన సినిమా తీశావంటూ రిషబ్ శెట్టి (Rishab Shetty)ని మెచ్చుకున్న తలైవా (Rajinikanth).. ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఆయనకు ఓ బహుమతిని ఇచ్చారు

కన్నడ సినిమా ‘కాంతార’ (Kantara) సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శాండల్‌వుడ్‌లో చిన్న చిత్రంగా రిలీజైన ఈ మూవీ.. పాన్ ఇండియా లెవల్లో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. విడుదలైన ప్రతి చోట, ప్రతి భాషలో రికార్డుల మోత మోగించింది. కన్నడ నాట అత్యధిక వీక్షణలు సొంతం చేసుకున్న సినిమాగా చరిత్ర సృష్టించింది. తెలుగులోనైతే విడుదలైన తొలిరోజే బ్రేక్ ఈవెన్ సాధించి.. ట్రేడ్ అనలిస్టులను ఆశ్చర్యానికి గురి చేసింది. 

కన్నడ నాట కలెక్షన్ల పరంగా ‘కేజీఎఫ్​ 2’ను అధిగమించే దిశగా ‘కాంతార’ మూవీ దూసుకెళ్తోంది. ఈ చిత్రంతో రిషబ్ శెట్టి ఓవర్‌నైట్ స్టార్ అయిపోయారు. ఆయన పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ‘కాంతార’లో ప్రధాన పాత్రను పోషించిన రిషబ్ (Rishab Shetty).. ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలనూ చేపట్టడం విశేషం. ఆయన నటనతోపాటు దర్శకత్వ ప్రతిభకు ప్రేక్షకులతోపాటు సినీ సెలబ్రిటీల నుంచి కూడా ప్రశంసల వర్షం కురుస్తోంది. 

‘కాంతార’ లాంటి సినిమాలు 50 ఏళ్లకు ఒకసారి వస్తాయంటూ రజినీ చెప్పారు

ఇప్పటికే రిషబ్ శెట్టిని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హీరోయిన్లు అనుష్క శెట్టి, కంగనా రనౌత్ తదితరులు మెచ్చుకున్నారు. ఇప్పుడు రిషబ్‌కు అంతకుమించిన సంతోషం కలిగింది. సౌత్ సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ఆయనకు గోల్డ్ చెయిన్, గోల్డ్ లాకెట్ బహుమతిగా ఇచ్చారు. చెన్నైలోని తన నివాసానికి రిషబ్‌ను రజినీ ఆహ్వానించారు. ఈ సందర్భంగా అద్భుతమైన సినిమా తీశావంటూ రిషబ్‌ను ఆయన ప్రశంసించారు. ‘కాంతార’ లాంటి సినిమాలు 50 ఏళ్లకు ఒకసారి వస్తాయంటూ రజినీ చెప్పారు. రిషబ్‌కు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఆయన గిఫ్ట్‌ను అందించారు. 

ఇకపోతే, శాండల్‌వుడ్ స్టార్ హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి ‘కాంతార’ను స్వీయ దర్శకత్వంలో నటిస్తూ తెరకెక్కించారు. ఈ సినిమాలో ఆయన సరసన సప్తమి గౌడ (Sapthami Gowda) కథానాయికగా యాక్ట్ చేశారు. అచ్యుత్ కుమార్, కిషోర్, ప్రమోద్ శెట్టి ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. ‘విక్రాంత్ రోణ’ (Vikrant Rona) ఫేమ్ అజినీష్ లోక్‌నాథ్ ‘కాంతార’కు సంగీతం అందించారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ హోంబాలే ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

Read more: రాంచరణ్ (RamCharan) – శంకర్ సినిమాలో పాట కోసం ఎంత బడ్జెట్‌ పెడుతున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!