కాంతార (Kantara) ఇచ్చిన జోష్‌తో మరో డబ్బింగ్ సినిమా ‘తోడేలు’ను విడుదల చేస్తున్న అల్లు అరవింద్ (Allu Aravind)

Updated on Nov 02, 2022 04:59 PM IST
కన్నడ సినిమా ‘కాంతార’ ను తెలుగులో విడుదల చేసిన అల్లు అరవింద్‌ (Allu Aravind).. హిందీ సినిమా ‘బేడియా’ తెలుగు రైట్స్‌ను సొంతం చేసుకున్నారు
కన్నడ సినిమా ‘కాంతార’ ను తెలుగులో విడుదల చేసిన అల్లు అరవింద్‌ (Allu Aravind).. హిందీ సినిమా ‘బేడియా’ తెలుగు రైట్స్‌ను సొంతం చేసుకున్నారు

వరుణ్‌ ధావన్‌ హీరోగా నటించిన సినిమా ‘బేడియా’. హిందీలో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులోకి డబ్ చేసి విడుదల చేస్తున్నారు అల్లు అరవింద్ (Allu Aravind). తోడేలు అనే టైటిల్‌తో రిలీజ్ చేస్తున్న ఈ సినిమా ట్రైలర్‌‌ ఇప్పటికే విడుదలై ఆకట్టుకుంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో యాక్షన్ ప్లస్ కామెడీ ప్రధానంగా తోడేలు సినిమా తెరకెక్కిందని ట్రైలర్‌‌ ద్వారా తెలుస్తోంది. ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

కన్నడంలో తెరకెక్కి తెలుగులోకి డబ్‌ చేసి విడుదల చేసిన సినిమా ‘కాంతార’ (Kantara). ఈ సినిమా టాలీవుడ్‌లో సెన్సెషన్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. కాంతార సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌‌పై విడుదల చేశారు. కాంతార సినిమా కలెక్షన్లు ఆయనకు మంచి లాభాలను తెచ్చిపెట్టాయి.

కన్నడ సినిమా ‘కాంతార’ ను తెలుగులో విడుదల చేసిన అల్లు అరవింద్‌ (Allu Aravind).. హిందీ సినిమా ‘బేడియా’ తెలుగు రైట్స్‌ను సొంతం చేసుకున్నారు

కాంతార తెచ్చిన లాభాలతో..

ఇక, తాజాగా తోడేలు సినిమాను కూడా తెలుగులో విడుదల చేసే రైట్స్‌ను అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ తీసుకుంది. అమర్‌‌ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తోడేలు కాటుకు గురైన భాస్కర్‌ అనే క్యారెక్టర్‌‌లో వరుణ్‌ ధావన్‌ నటించారు. అనిక అనే డాక్టర్‌‌ పాత్రలో కృతి సనన్ కనిపించనున్నారు.  నవంబరు 25న తోడేలు సినిమా 2డీ, 3డీ వెర్షన్లలో విడుదల కానుంది.

ఇక, అల్లు అరవింద్‌ (Allu Aravind) ఎన్నో సంవత్సరాలుగా సక్సెస్‌ఫుల్‌ ప్రొడ్యూసర్‌‌గా కొనసాగుతున్నారు. ఆయన నిర్మించిన చాలా సినిమాలు దాదాపుగా హిట్‌ అయ్యాయి. అల్లు అరవింద్ తండ్రి అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా అల్లు స్టూడియోస్‌ను స్థాపించారు. మెగాస్టార్ చిరంజీవి అల్లు స్టూడియోస్‌ను ప్రారంభించారు.

Read More : మా బ్యానర్‌‌లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చేసిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి: అల్లు అరవింద్ (Allu Aravind)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!