రిషబ్ శెట్టి (Rishab Shetty) మూవీ ‘కాంతార’ (Kantara) ఓటీటీ స్ట్రీమింగ్ రూమర్‌పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత

Updated on Oct 28, 2022 09:53 AM IST
రిషబ్ శెట్టి (Rishab Shetty) మూవీ ‘కాంతార’ (Kantara) త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందంటూ వస్తున్న రూమర్‌పై చిత్ర నిర్మాత క్లారిటీ ఇచ్చారు 
రిషబ్ శెట్టి (Rishab Shetty) మూవీ ‘కాంతార’ (Kantara) త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందంటూ వస్తున్న రూమర్‌పై చిత్ర నిర్మాత క్లారిటీ ఇచ్చారు 

కన్నడ సినిమా ‘కాంతార’ (Kantara) ఇటీవల విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. భాషలతో సంబంధం లేకుండా రిలీజైన ప్రతి చోట ఈ సినిమాకు ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నారు. కన్నడ తర్వాత తెలుగులో ఈ చిత్రం భారీ లాభాలు ఆర్జిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన తొలి రోజే బ్రేక్ ఈవెన్‌ను సాధించిన ‘కాంతార’.. ఇక్కడ రూ.40 కోట్ల మార్కును అందుకునే దిశగా పరుగులు తీస్తోంది. 

దీపావళికి పలు సినిమాలు రిలీజైనప్పటికీ ‘కాంతార’ వాటితో పోటీపడుతూ కలెక్షన్లు కొల్లగొట్టింది. ‘సర్దార్’, ‘ఓరి దేవుడా’ చిత్రాల జోరును తట్టుకుని నిలబడింది. పండగ ముగియడంతో ‘కాంతార’కు తెలుగుతోపాటు తమిళంలోనూ స్క్రీన్స్‌ను పెంచుతున్నారని తెలిసింది. దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయంలా కనిపిస్తోంది. ఇకపోతే, ‘కాంతార’ ఓటీటీపై ఇటీవల పలు రూమర్లు వచ్చాయి. ఓ ప్రముఖ సంస్థ ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని దక్కించుకుందని పలు వెబ్ సైట్లు వార్తలు ప్రచురించాయి. త్వరలో ఓటీటీలో ఈ చిత్రం అందుబాటులోకి వస్తుందంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కూడా చర్చించుకున్నారు. 

అవన్నీ రూమర్లే

తాజాగా ఈ విషయంపై ‘కాంతార’ క్రియేటివ్ ప్రొడ్యూసర్ కార్తిక్ గౌడ స్పందించారు. నవంబర్ 4 నుంచి ఓటీటీలో ‘కాంతార’ స్ట్రీమింగ్ అవుతుందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. అదో రూమర్ అని కొట్టిపారేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కార్తిక్ గౌడ క్లారిటీ ఇచ్చారు. దీంతో ‘కాంతార’ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీపై వస్తున్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. ఈ సినిమా పలు భాషల్లో ఇంకా సక్సెస్‌ఫుల్ రన్ కొనసాగిస్తున్నందున ఓటీటీలో అందుబాటులోకి వచ్చేందుకు మరికొన్ని వారాల సమయం పట్టేలా ఉంది.

ఇకపోతే, శాండల్‌వుడ్ స్టార్ హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి (Rishab Shetty) ‘కాంతార’ను స్వీయ దర్శకత్వంలో నటిస్తూ తెరకెక్కించారు. ఈ సినిమాలో ఆయన సరసన సప్తమి గౌడ కథానాయికగా యాక్ట్ చేశారు. అచ్యుత్ కుమార్, కిషోర్, ప్రమోద్ శెట్టి ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. ‘విక్రాంత్ రోణ’ ఫేమ్ అజినీష్ లోక్‌నాథ్ ‘కాంతార’కు సంగీతం అందించారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ హోంబాలే ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.   

Read more: టాలీవుడ్‌ (Tollywood)లో చిన్న సినిమాల సందడి.. నవంబర్‌‌లో రిలీజ్‌ కానున్న చిత్రాలు!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!