పునీత్ రాజ్ కుమార్(Puneet Rajkumar): ‘కాంతార’(Kantara)లో ముందు అనుకున్న హీరో రిషబ్ శెట్టి(Rishab Shetty) కాదా?

Updated on Nov 03, 2022 12:03 PM IST
ఈ సినిమాలో ముందు అనుకున్న హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty) కాదట. మొదట వేరే హీరోతో చేద్దామనుకున్నారట రిషబ్.
ఈ సినిమాలో ముందు అనుకున్న హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty) కాదట. మొదట వేరే హీరోతో చేద్దామనుకున్నారట రిషబ్.

కన్నడ సినిమా ‘కాంతార’ (Kantara) రిలీజైన ప్రతి చోట రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకెళ్తోంది. భాషలతో సంబంధం లేకుండా అన్ని ఏరియాల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. కన్నడ, తెలుగు, తమిళంతోపాటు హిందీలోనూ మెగా హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో హీరోగానే గాక రచయితగా, దర్శకుడిగా కూడా రిషబ్ శెట్టి (Rishab Shetty) ప్రశంసలు అందుకున్నారు. సాధారణ ప్రేక్షకులతోపాటు విమర్శకులు కూడా ‘కాంతార’ మూవీ టీమ్‌ను, రిషబ్ శెట్టిని మెచ్చుకుంటున్నారు.

ఇకపోతే, శాండల్‌వుడ్ స్టార్ హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి ‘కాంతార’ను స్వీయ దర్శకత్వంలో నటిస్తూ తెరకెక్కించారు. ఈ సినిమాలో ఆయన సరసన సప్తమి గౌడ (Sapthami Gowda) కథానాయికగా యాక్ట్ చేశారు. అచ్యుత్ కుమార్, కిషోర్, ప్రమోద్ శెట్టి ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. ‘విక్రాంత్ రోణ’ (Vikrant Rona) ఫేమ్ అజినీష్ లోక్‌నాథ్ ‘కాంతార’కు సంగీతం అందించారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ హోంబాలే ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

ఇక, తెలుగు ఇండస్ట్రీలో అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌ (Allu Aravind) 'గీతాఫిల్మ్‌ డిస్ట్రిబ్యూషన్‌' ద్వారా ఈ సినిమాను విడుదల చేశారు. 'కాంతార' చిత్రం విడుదలైన 2 వారాల్లోనే రూ.45కోట్లు వసూళ్లు సాధించి రికార్డు సాధించింది. 'కాంతార' కేవలం తెలుగులోనే కాకుండాప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఒక డబ్బింగ్ సినిమా ఈ స్థాయిలో కలెక్షన్ల పరంగా వసూలు చేయడం రికార్డేనని సినీ పండితులు అంటున్నారు. మరోవైపు ఈ సినిమాపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ముందు అనుకున్న హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty) కాదట. మొదట వేరే హీరోతో చేద్దామనుకున్నారట రిషబ్. ఆ విషయం ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో హీరో కం డైరెక్టర్ రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. నిజానికి మొదట ఈ సినిమా స్టోరీని తాను దివంగత పునీత్ రాజ్ కుమార్ (Puneet Rajkumar) గారికి వినిపించానని అన్నారు. 

అయితే అప్పట్లో ఆయన వరుసగా ఇతర సినిమాల షెడ్యూల్ తో బిజీగా ఉండటంతో ఈ సినిమాని చేయలేకపోయారని అన్నారు. అయితే ఇదే విషయం పునీత్‌ రాజ్‌కుమార్‌తో చెబితే.. ఆ మట్టి వాసన బాగా పండాలంటే.. హీరోగా నువ్వే నటించాలి అని సలహా ఇచ్చాడట. దాంతో రిషబ్ (Rishab Shetty) ఈ సినిమాలో హీరోగాను నటించాడట.

Read More: కర్ణాటక ప్రభుత్వంపై ‘కాంతార’ (Kantara) ఎఫెక్ట్.. 60ఏళ్లు దాటిన 'దైవ నర్తకుల'కు ప్రతి నెలా రూ.2వేల ఆర్థిక సాయం!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!