'కాంతార' (Kantara) సినిమాను తెలుగులో తీసుంటే ఈజీగా రూ.200 కోట్ల బడ్జెట్ అయ్యేది!: తమ్మారెడ్డి భరద్వాజ

Updated on Nov 03, 2022 10:30 AM IST
‘కాంతార’ (Kantara) లాంటి సినిమాను తెలుగులో అంత తక్కువ బడ్జెట్‌లో తీయడం సాధ్యం కాదని తమ్మారెడ్డి భరద్వాజ (Thammareddy Bharadwaja) అన్నారు
‘కాంతార’ (Kantara) లాంటి సినిమాను తెలుగులో అంత తక్కువ బడ్జెట్‌లో తీయడం సాధ్యం కాదని తమ్మారెడ్డి భరద్వాజ (Thammareddy Bharadwaja) అన్నారు

కన్నడ సినిమా ‘కాంతార’ (Kantara) రిలీజైన ప్రతి చోట రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకెళ్తోంది. భాషలతో సంబంధం లేకుండా అన్ని ఏరియాల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. కన్నడ, తెలుగు, తమిళంతోపాటు హిందీలోనూ మెగా హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో హీరోగానే గాక రచయితగా, దర్శకుడిగా కూడా రిషబ్ శెట్టి (Rishab Shetty) ప్రశంసలు అందుకున్నారు. సాధారణ ప్రేక్షకులతోపాటు విమర్శకులు కూడా ‘కాంతార’ మూవీ టీమ్‌ను, రిషబ్ శెట్టిని మెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా గురించి ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Thammareddy Bharadwaja) ప్రస్తావించారు.

‘కాంతార’ లాంటి చిత్రాన్ని తెలుగులో తక్కువ బడ్జెట్‌లో తీయడం సాధ్యం కాదని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. టాలీవుడ్‌లో ఆ సినిమాను రూపొందించి ఉంటే బడ్జెట్ చాలా మొత్తంలో పెరిగేదన్నారు. ‘తెలుగు హీరోలు తమ సినిమాల హిందీ డబ్బింగ్ రైట్స్ ఎక్కువ పలుకుతున్నాయనీ.. ఓటీటీల్లో తమ చిత్రాలకు క్రేజ్ ఉందనీ.. ప్యాన్ ఇండియా మార్కెట్ ఉందని రేట్లు, రెమ్యూనరేషన్లు పెంచుకుంటూ పోతున్నారు. ఇది సరికాదు. ఇతర భాషల్లో దర్శకులు చాలా తక్కువ ఖర్చుతో, టెక్నికల్ వాల్యూస్‌తో మంచి ఔట్‌పుట్ ఇస్తున్నారు. కానీ మనవాళ్లు మాత్రం ఎక్కువగా ఖర్చు పెట్టినా ఆ స్థాయి ఔట్‌పుట్‌ను అందించలేకపోతున్నారు’ అని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పుకొచ్చారు. 

 ఇతర భాషల్లో దర్శకులు చాలా తక్కువ  ఖర్చుతో, టెక్నికల్ వాల్యూస్‌తో మంచి ఔట్‌పుట్ ఇస్తున్నారని తమ్మారెడ్డి భరద్వాజ (Thammareddy Bharadwaja) అన్నారు

‘కాంతార’ సినిమా నేపథ్యం మన తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉందని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. అందులో చూపించిన జాతరలు, పూనకాలు మన దగ్గర కూడా ఉన్నాయని ఆయన చెప్పారు. అయితే మూవీలో చూపించిన వేషధారణ మాత్రం ఇక్కడ ఉండదన్నారు. ‘కాంతారను కేవలం రూ.16 కోట్ల బడ్జెట్‌లో తీశారు. అది రూ.200 కోట్లకు పైగా వసూలు చేసింది. అందువల్ల లాభాలు బాగా వచ్చాయి. ఆ స్థాయి డైరెక్టర్.. హిట్లు ఇచ్చిన కథానాయకుడితో ఆ సినిమాను తెలుగులో తీయాలంటే రూ.200 కోట్లు అయ్యుండేది. అప్పుడు ఆ మూవీ రూ.200 కోట్లు రాబట్టినా ప్రయోజనం ఉండేది కాదు. అలా కాకుండా వాళ్లు ఎక్కడ ఉండాలో.. అక్కడే ఉండి, ప్లాన్ ప్రకారం ఎలా చేయాలనుకున్నారో అలాగే చేశారు కాబట్టే ఈ రోజు ఆ సినిమా అంత పెద్ద విజయాన్ని అందుకుంది’ అని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు. 

ఇకపోతే, శాండల్‌వుడ్ స్టార్ హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి ‘కాంతార’ను స్వీయ దర్శకత్వంలో నటిస్తూ తెరకెక్కించారు. ఈ సినిమాలో ఆయన సరసన సప్తమి గౌడ (Sapthami Gowda) కథానాయికగా యాక్ట్ చేశారు. అచ్యుత్ కుమార్, కిషోర్, ప్రమోద్ శెట్టి ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. ‘విక్రాంత్ రోణ’ ఫేమ్ అజినీష్ లోక్‌నాథ్ ‘కాంతార’కు సంగీతం అందించారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ హోంబాలే ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.  

Read more: EXCLUSIVE : రైతు కూడా దేశ భక్తుడే.. అందరికీ ప్రశ్నించే అధికారం ఉంది : ప్రకాష్ రాజ్ (Prakash Raj)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!