మహేష్‌బాబు (MaheshBabu) – త్రివిక్రమ్ ‘ఎస్‌ఎస్‌ఎంబీ28’ బిజినెస్‌ వార్తలపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత నాగవంశీ

Updated on Oct 06, 2022 11:42 PM IST
మహేష్‌బాబు (MaheshBabu) - త్రివిక్రమ్‌ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌ మొదటి షెడ్యూల్‌ ఇప్పటికే పూర్తయ్యింది
మహేష్‌బాబు (MaheshBabu) - త్రివిక్రమ్‌ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌ మొదటి షెడ్యూల్‌ ఇప్పటికే పూర్తయ్యింది

సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu) – త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎస్‌ఎస్‌ఎంబీ28 వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆరంభం అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను నాగవంశీ నిర్మిస్తున్నారు.

మహేష్‌బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మూడో సినిమా కావడంతో ఎస్‌ఎస్‌ఎంబీ28పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. ఆ రెండు సినిమాలు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందజేశాయి. అయితే ఆ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడి చేయలేదనే చెప్పాలి. ఈ విషయాన్ని మహేష్‌ త్రివిక్రమ్‌ కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. దాంతో ఈసారి వాళ్ల కాంబినేషన్‌లో వచ్చే సినిమా కచ్చితంగా బ్లాక్‌బస్టర్ హిట్‌ అవుతుందనే ఆశలో ఉన్నారు అభిమానులు. అయితే ఎస్‌ఎస్‌ఎంబీ28 ప్రకటించినప్పటి నుంచి ఆ సినిమా నుంచి ఎప్పుడు ఏ అప్‌డేట్‌ వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఈ సినిమా బిజినెస్‌పై పలు వార్తలు నెట్టింటిని షేక్ చేస్తున్నాయి.

మహేష్‌బాబు (MaheshBabu) - త్రివిక్రమ్‌ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌ మొదటి షెడ్యూల్‌ ఇప్పటికే పూర్తయ్యింది

బడ్జెట్‌పై అవగాహన వచ్చిన తర్వాత..

ఎస్‌ఎస్‌ఎంబీ28 నాన్‌ థియేట్రికల్, థియేట్రికల్ బిజినెస్‌ ఓ రేంజ్‌లో జరుగుతున్నట్టు వార్తలు వినిపించాయి. నాన్‌ థియేట్రికల్ రైట్స్‌ రూ.75 కోట్లు, థియేట్రికల్ రైట్స్‌ రూ.125 కోట్లకు అమ్ముడయ్యాయని కథనాలు వచ్చాయి. ఈ సినిమా షూటింగ్ పూర్తికాకముందే.. దాదాపుగా రూ.200 కోట్లు బిజినెస్ జరిగిందని మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. ఈ రూమర్స్‌పై నిర్మాత నాగవంశీ స్పందించారు. ‘ఇప్పటివరకు ఎస్‌ఎస్‌ఎంబీ28 సినిమాకు ఏ విధమైన బిజినెస్ జరగలేదని చెప్పారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ మొదటి షెడ్యూల్ పూర్తయ్యింది. 

నాన్‌థియేట్రికల్ హక్కుల కోసం ఇప్పటివరకు ఎవరూ సంప్రదించలేదు. మేము కూడా ఎవరినీ ఈ విషయం గురించి కాంటాక్ట్ కాలేదు. అసలు ఈ సినిమాకు ఎంత బడ్జెట్ అవుతుంది అనే విషయంపై మాకే క్లారిటీ లేదు. బడ్జెట్‌పై పూర్తిస్థాయి అవగాహన వచ్చిన తర్వాత నాన్‌ థియేట్రికల్ బిజినెస్‌ గురించి ఆలోచిస్తాం’ అని చెప్పుకొచ్చారు నాగవంశీ. మహేష్‌బాబు (MaheshBabu) – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఎస్‌ఎస్‌ఎంబీ28 సినిమా సెకండ్ షెడ్యూల్‌ షూటింగ్‌ విజయ దశమి తర్వాత ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.  

Read More : సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu) సినిమాపైనే ఆశలు పెట్టుకున్న బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde)!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!