మహేష్‌బాబు (MaheshBabu) ‘ఎస్‌ఎస్‌ఎంబీ28’ మ్యూజిక్ కోసం థమన్ (SS Thaman) రెమ్యునరేషన్ అన్ని కోట్లా!

Updated on Sep 27, 2022 12:48 PM IST
ఎస్‌ఎస్‌ థమన్ (SS Thaman) మ్యూజిక్ చేసిన సినిమాలు సూపర్‌‌హిట్ అవుతున్నాయి. మహేష్‌ (MaheshBabu) – త్రివిక్రమ్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు
ఎస్‌ఎస్‌ థమన్ (SS Thaman) మ్యూజిక్ చేసిన సినిమాలు సూపర్‌‌హిట్ అవుతున్నాయి. మహేష్‌ (MaheshBabu) – త్రివిక్రమ్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు

అఖండ, భీమ్లానాయక్, సర్కారు వారి పాట సినిమా సక్సెస్‌లలో మ్యూజిక్‌ డైరెక్టర్ ఎస్‌ఎస్‌ థమన్ (SS Thaman) పాత్ర కూడా ఉంది. ఆ సినిమాల్లో పాటలతోపాటు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌‌ కూడా సినిమాల విజయానికి తోడ్పడిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం టాలీవుడ్‌లోని స్టార్ సంగీత దర్శకుల్లో ఆయన కూడా ఒకరు. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులు చేస్తూ బిజీబిజీగా ఉన్నారు థమన్. మహేష్‌బాబు (MaheshBabu) – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఎస్‌ఎస్‌ఎంబీ28 సినిమాకు సంగీతం అందిస్తున్నారు థమన్.

అఖండ సినిమా నుంచి వరుస విజయాలు థమన్ ఖాతాలో పడుతున్నాయి. ఆయన సంగీతం అందిస్తున్న సినిమాల్లో పాటలతోపాటు బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్ కూడా థియేటర్‌‌లో ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంటున్నాయి. దాంతో ఆయా స్టార్ హీరోలు కూడా థమన్‌తోనే తమ ప్రాజెక్టులకు మ్యూజిక్ చేయించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ఎస్‌ఎస్‌ థమన్ (SS Thaman) మ్యూజిక్ చేసిన సినిమాలు సూపర్‌‌హిట్ అవుతున్నాయి. మహేష్‌ (MaheshBabu) – త్రివిక్రమ్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు

ఇప్పుడు డబుల్..

తాజాగా మహేష్‌బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమాకు సంగీతం చేయడానికి థమన్ అందుకునే రెమ్యునరేషన్‌పై పలు వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. చాలాకాలంగా ఇండస్ట్రీలో ఉన్న థమన్.. ఒక్కో సినిమాకు సంగీతం అందించడానికి రూ.2 కోట్లు తీసుకుంటారని టాక్. అయితే ఎస్‌ఎస్‌ఎంబీ28 సినిమాకు మాత్రం థమన్‌ తన రెమ్యునరేషన్‌ను డబుల్ చేశారని సమాచారం. ఈ సినిమా కోసం రూ.4 కోట్లు నుంచి రూ.5 కోట్ల వరకు అందుకోనున్నారని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. అదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా కూడా మారింది.

ఇక, ఇటీవలే ఎస్‌ఎస్‌ఎంబీ28 సినిమా రెగ్యులర్‌‌ షూటింగ్‌ స్టార్ట్ అయ్యింది. మొదటి షెడ్యూల్‌ కూడా పూర్తయ్యిందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలో మహేష్‌బాబు (MaheshBabu) సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా ఎస్‌ఎస్‌ థమన్ (SS Thaman) సంగీతం అందిస్తున్నారు.

Read More : మహేష్‌బాబు (MaheshBabu) – త్రివిక్రమ్‌ సినిమా టైటిల్‌ ‘అయోధ్యలో అర్జునుడు’? పరిశీలిస్తున్న చిత్ర యూనిట్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!