మహేష్‌బాబు (MaheshBabu)తో తెరకెక్కించే సినిమా నా కెరీర్‌‌లోనే పెద్దది.. ఎస్‌ఎస్‌ఎంబీ29పై రాజమౌళి కామెంట్స్

Updated on Oct 06, 2022 11:55 PM IST
త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు మహేష్‌బాబు (MaheshBabu). అనంతరం రాజమౌళి సినిమా పట్టాలెక్కించనున్నారు
త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు మహేష్‌బాబు (MaheshBabu). అనంతరం రాజమౌళి సినిమా పట్టాలెక్కించనున్నారు

సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu) అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అనౌన్స్‌మెంట్ ఇటీవలే వచ్చింది. దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli)తో సినిమా చేయనున్నట్టు అధికారికంగా ప్రకటన వచ్చింది. మహేష్‌బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఎస్‌ఎస్‌ఎంబీ28 వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆరంభం అనే టైటిల్‌ను ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది.

బాహుబలి సినిమాతో టాలీవుడ్‌ సత్తాను జాతీయస్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి... ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాతో తెలుగు సినిమా ఘనతను అంతర్జాతీయంగా చాటి చెప్పారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా హిందీ వెర్షన్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఈ సినిమాపై విదేశీ ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. హాలీవుడ్‌కు చెందిన టెక్నిషీయన్స్ కూడా జక్కన్న టాలెంట్‌కు హ్యాట్సాఫ్‌ చెబుతున్నారు.

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు మహేష్‌బాబు (MaheshBabu). అనంతరం రాజమౌళి సినిమా పట్టాలెక్కించనున్నారు

అలాంటి సినిమా చేయలేదంటూ..

ఇక, తాజాగా రాజమౌళి హాలీవుడ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్నారు. హాలీవుడ్ ఫిలిం ఫెస్టివల్ ‘బియాండ్ ఫెస్ట్‌’ లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను ప్రదర్శించారు. ఈ స్క్రీనింగ్‌కు అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. సినిమాను ప్రేక్షకులందరూ ఎంతో ఎగ్జైటింగ్‌గా చూశారు. సినిమా పూర్తయిన వెంటనే రాజమౌళికి స్టాండింగ్ ఒవియేషన్ ఇచ్చారు. అనంతరం ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో రాజమౌళి మాట్లాడారు. ఈ సందర్భంగా సూపర్‌‌స్టార్‌‌ మహేష్‌తో చేయబోయే సినిమా గురించి కామెంట్స్‌ చేశారు రాజమౌళి.

మహేశ్‌తో తెరకెక్కించే సినిమా తన కెరీర్‌లో‌నే అతి పెద్దది అని చెప్పారు రాజమౌళి. ఇప్పటివరకు అటువంటి సినిమాను చేయలేదని చెప్పారు. ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడి కథతో సినిమాను తెరకెక్కించబోతున్నట్టు తెలిపారు. ఇప్పటికే ఈ సినిమా గురించిన విషయాలు ఇండియాలో ట్రెండ్ అవుతున్నాయని చెప్పారు రాజమౌళి. 

రాజమౌళితో సినిమా చేయబోతుండటంపై మహేష్‌బాబు కూడా తన ఆనందాన్ని ఇప్పటికే మీడియాతో పంచుకున్నారు. ‘రాజమౌళి‌తో ఒక్క సినిమా చేస్తే 25 చిత్రాలకు పనిచేసినట్లే. ఈ సినిమాలో క్యారెక్టర్‌‌ కోసం చాలా కష్టపడాలి. సినిమా కథ దానిని డిమాండ్ చేస్తుంది. జక్కన్నతో చేయబోయే సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ ప్రాజెక్టు పాన్ ఇండియాగా తెరకెక్కుతుంది. దేశంలోని ప్రేక్షకులందరికీ ఈ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని మహేష్‌బాబు చాలా రోజుల క్రితమే చెప్పుకొచ్చారు. మహేష్‌బాబు (MaheshBabu) – రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్‌ తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం #SSMB29  పేరుతో ట్రెండింగ్‌ అవుతోంది.

Read More : సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu) సినిమాపైనే ఆశలు పెట్టుకున్న బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde)!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!