Prabhas: ప్రభాస్ తానే హీరోగా, నిర్మాతగా ఓ సినిమా చేస్తున్నారా..? ఆ పేరు ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తోంది !

Updated on Aug 17, 2022 07:19 PM IST
Prabhas: ప్రభాస్ 'బాహుబలి' సినిమాతో దక్షిణాదితో పాటు ఉత్తరాది ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాడు. స్టార్ హీరోగా మారిపోయాడు.
Prabhas: ప్రభాస్ 'బాహుబలి' సినిమాతో దక్షిణాదితో పాటు ఉత్తరాది ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాడు. స్టార్ హీరోగా మారిపోయాడు.

ప్రభాస్ (Prabhas) ..   బాహుబలి, బాహుబలి 2 సినిమాలతో భారత చలనచిత్ర చరిత్రలోనే ఒక నూతన అధ్యాయానికి తెరతీసిన కథానాయకుడు. కానీ ఆ తర్వాత ఆయన నటించిన సాహో, రాధే శ్యామ్ సినిమాలు అనుకున్నంత గొప్ప సినిమాలుగా ఏమీ నిలవలేదు. ఈ క్రమంలో కేజీఎఫ్ ఫ్రాంచైసీకి సూత్రధారి అయిన దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో 'సలార్' సినిమా సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు ప్రభాస్. 

అలాగే ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆది పురుష్' చిత్రంలో నటిస్తున్నారు మన యంగ్ రెబల్ స్టార్. రామాయణ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో సీత పాత్రధారిగా క్రితి సనన్ నటిస్తోంది. ఈ సినిమాపై కూడా అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి. బాలీవుడ్ వర్గాలను కూడా ఇప్పటికే ఈ సినిమా అమితంగా ఆకర్షిస్తోంది. 

మారుతి సినిమా పై క్రేజీ అప్డేట్

ఈ మధ్యకాలంలో ప్రభాస్ (Prabhas) నటిస్తున్న సినిమాకి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ నెట్టింట్లో హల్చల్ చేయడం ప్రారంభించింది. మారుతి దర్శకత్వంలో ఇప్పటికే ప్రభాస్ ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే ఈ ప్రాజెక్టు ప్రస్తుతం పట్టాలెక్కే అవకాశం కనిపించడం లేదట. అలాగే నిర్మాత కూడా ప్రాజెక్టు నుండి తప్పుకున్నాడట.

'రాజా డీలక్స్' అనే పేరుతో నిర్మాత డివివి దానయ్య గతంలో ప్రభాస్ (Prabhas) హీరోగా ఓ సినిమాను ప్లాన్ చేశారని వార్తలొచ్చాయి. ఆ చిత్రానికి మారుతి డైరెక్టర్ కాగా, అనుకోకుండా ఈ మధ్యకాలంలోనే దానయ్య ఆ ప్రాజెక్టు నుండి వైదొలిగారని వినికిడి. అయితే, దానయ్య వదిలేసిన ఈ సినిమాను ప్రభాస్ స్వయంగా నిర్మించడానికి ముందుకొచ్చారని సమాచారం. 

రూ. 50 కోట్లు పారితోషికమా

ప్రభాస్ (Prabhas), మారుతి కాంబినేషనులో చేయబోయే సినిమాకి రూ.50 కోట్లు పారితోషికం కూడా ఫిక్స్ అయినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా ప్రారంభమయ్యే సరికి చాలా సమయం పడుతుంది కాబట్టి.. నిర్మాత వేరే ప్రాజెక్టులతో బిజీ అవ్వడం వల్ల, ప్రభాస్ స్వయంగా సినిమాను నిర్మించడానికి సిద్ధమయ్యారని చెబుతూ ఓ వార్త ఫిల్మ్ నగర్ వర్గాలలో కోడై కూస్తోంది. 

Read More: Salaar Release Date: ప్రభాస్ 'సలార్' నుంచి క్రేజీ అప్‌డేట్‌.. రిలీజ్ డేట్ ఖరారు!

Advertisement
Credits: Instagram

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!