ఆదిపురుష్ (Adipurush )లో కృష్ణంరాజు న‌టిస్తున్నార‌ట‌.. ప్ర‌భాస్‌కు ఏమ‌వుతారో తెలుసా!

Updated on Jun 06, 2022 08:17 PM IST
ప్ర‌భాస్ పెద‌నాన్న కృష్ణం రాజు కూడా ఆదిపురుష్ (Adipurush) సినిమాలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నార‌ట‌.
ప్ర‌భాస్ పెద‌నాన్న కృష్ణం రాజు కూడా ఆదిపురుష్ (Adipurush) సినిమాలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నార‌ట‌.

పాన్ ఇండియా హీరో ప్ర‌భాస్ (Prabhas) ప్ర‌స్తుతం ప‌లు చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నారు. ప్ర‌భాస్ చేస్తున్న సినిమాల్లో అత్యంత భారీ బ‌డ్జెట్ సినిమా ఆదిపురుష్. రామాయ‌ణం ఆధారంగా బాలీవుడ్ ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ హీరోగా ఆదిపురుష్ తెర‌కెక్కుతుంది. ఈ సినిమాకు రూ. 500 కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్నారు. ప్ర‌భాస్ రాముడిగా న‌టించ‌నున్నారు. సీత పాత్ర‌లో కృతి స‌న‌న్ ప్ర‌భాస్‌కు జోడిగా న‌టించ‌నున్నారు. బాలీవుడ్  స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ రావ‌ణుడిగా యాక్ట్ చేయ‌నున్నారు. 

ఆదిపురుష్‌లో కృష్ణం రాజు (Krishnam Raju) న‌టిస్తున్నారా?
ప్ర‌భాస్ పెద‌నాన్న కృష్ణం రాజు కూడా ఆదిపురుష్ (Adipurush) సినిమాలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నార‌ట‌. రాముడు తండ్రి జ‌న‌క మ‌హారాజు పాత్ర‌ను కృష్ణం రాజును చేయ‌మ‌ని చెప్పార‌ట‌. అందుకు కృష్ణం రాజు కూడా అంగీక‌రించాని టాక్. సీత తండ్రి జ‌న‌క మ‌హారాజు పాత్ర‌లో కృష్ణం రాజు ప్ర‌భాస్‌కు మామ‌గా వెండితెర‌పై క‌నిపించ‌నున్నారు. రాధేశ్యామ్ సినిమాలో కృష్ణం రాజు ప్ర‌భాస్ గురువుగా న‌టించారు. రాధేశ్యామ్ ప్లాప్‌తో  ప్ర‌భాస్ అభిమానులు తీవ్ర నిరాశ‌లో ఉన్నారు. అయితే ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేసే వ‌రుస సినిమాలు ఫ్యాన్స్ హుషారుగా ఉన్నారు. 

స‌లార్ సినిమా అప్‌డేట్స్ ప్ర‌భాస్ (Prabhas) అభిమానుల్లో జోష్ నింపుతున్నాయి. ఆదిపురుష్ లేటెస్ట్ న్యూస్ కూడా ఆనందం క‌లిగిస్తుంద‌ని డార్లింగ్ ఫ్యాన్స్ అంటున్నారు. ఆదిపురుష్ 3డీ సినిమాగా రిలీజ్ చేయ‌నున్నారు. ప్ర‌భాస్ రాముడి అవ‌తారంలో 8 అడుగుల ఎత్తులో క‌నిపించ‌నున్నారు.  బాహుబలి కంటే ప‌దింత‌లు విజువ‌ల్ ఎఫెక్ట్ ఎక్కువ‌గా ఉండేలా ప్లాన్ చేశార‌ట‌. విజువ‌ల్స్ చూస్తే థియేట‌ర్ల‌లలో ఫ్యాన్స్‌కు పూన‌కాలే అంటున్నారు సినీ క్రిటిక్స్.

ప్ర‌భాస్ పెద‌నాన్న కృష్ణం రాజు కూడా ఆదిపురుష్ (Adipurush) సినిమాలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నార‌ట‌.

కృష్ణంరాజు వ‌ద్దంటున్న ఓ వ‌ర్గం
ప్ర‌భాస్, కృష్ణం రాజులు క‌లిసి న‌టించే సినిమాలు హిట్ కావ‌నే టాక్ కూడా ఉంది. వీరిద్ద‌రూ క‌లిసి చేసిన సినిమాలు ప్లాప్‌ల‌వుతాయ‌ని ప్ర‌భాస్ ఫ్యాన్స్ కొంద‌రు చెబుతున్నారు. రాధేశ్యామ్ కూడా ప్ర‌భాస్ కెరీయ‌ర్‌లో అట్ట‌ర్ ప్లాప్ అయిందంటున్నారు. అందుకే కృష్ణం రాజును ప్ర‌భాస్ సినిమాలో పెట్టుకోక‌పోవ‌డ‌మే మంచిదంటున్నారు. కృష్ణం రాజుపై త‌మ‌కు ఎలాంటి కోపం లేద‌ని.. ఆయ‌న అంటే కూడా త‌మ‌కు గౌర‌మ‌ని ప్ర‌భాస్ (Prabhas) ఫ్యాన్స్ చెబుతున్నారు. కానీ ప్ర‌భాస్‌తో కృష్ణంరాజు న‌టించ‌డం వ‌ల్ల ప్రాబ్ల‌మ్ అంటున్నారు. 

కృష్ణంరాజుకు పెరుగుతున్న స‌పోర్ట్
కృష్ణం రాజు హీరోగా ఎన్నో బ్లాక్ బాస్ట‌ర్ హిట్‌లు సాధించారు. అలాంటి హీరోను గౌర‌వించాల‌ని  ప్ర‌భాస్ ఫ్యాన్స్‌లో మ‌రికొంద‌రు చెబుతున్నారు. క‌థ‌ను బ‌ట్టి సినిమా హిట్ ఉంటుంది కానీ.. ప్ర‌భాస్ సినిమాలో కృష్ణం రాజు ఉంటే ఫ్లాప్ అవ‌ద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. 

ప్ర‌భాస్ ఫిట్‌నెస్ కోసం ఏం చేస్తున్నారు
రాముడిగా ప్ర‌భాస్ ఓ దేవుడిలా అనిపించాలి. చూసేందుకు అందంగా అనిపించాలి. అందుకు ప్ర‌భాస్ కోసం ద‌ర్శ‌కుడు ఓం రౌత్ కొన్ని స‌ల‌హాలు ఇచ్చార‌ట‌. ప్ర‌భాస్ చాలా మంచి వ్య‌క్త‌ని.. షూటింగ్‌కు త‌న ఇంటి నుంచి స్పెష‌ల్ ఫుడ్ తీసుకొస్తార‌ని ఓం రౌత్ చెప్పారు. సెట్‌లో అంద‌రికీ త‌న‌ ఇంటి భోజ‌నం రుచేంటో చూపిస్తారట ప్ర‌భాస్. రాముడిగా క‌నిపించాలంటే శ‌రీరం ఫిట్‌గా ఉంచుకోవాల‌ని ప్ర‌భాస్‌తో ఓం రౌత్ చెప్పార‌ట‌. అలా చెప్ప‌గానే ప్ర‌భాస్ ఇలా జిమ్ చేస్తున్నార‌ట‌. టి - సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్లు ఆదిపురుష్ (Adipurush) సినిమా తీస్తున్నారు. ఆదిపురుష్ సినిమా 2023 జ‌న‌వ‌రి 12 న ప్ర‌పంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు భాష‌ల్లో రిలీజ్ కానుంది.

Read more:https://telugu.pinkvilla.com/entertainment/pan-india-star-prabhas-up-coming-movie-adipurush-budget-to-be-rs-500-crore-969 

Advertisement
Credits: Twitter

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!