ప్రభాస్ (Prabhas) – సందీప్ రెడ్డి ‘స్పిరిట్‌’ సినిమాలో నటించడంపై బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్‌‌ క్లారిటీ

Updated on Sep 08, 2022 08:54 PM IST
ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం ప్రాజెక్ట్‌ K, సలార్ సినిమాల్లో నటిస్తున్నారు. ఆ సినిమాల షూటింగ్‌లు శరవేగంగా జరుగుతున్నాయి
ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం ప్రాజెక్ట్‌ K, సలార్ సినిమాల్లో నటిస్తున్నారు. ఆ సినిమాల షూటింగ్‌లు శరవేగంగా జరుగుతున్నాయి

గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) సరసన నటించడానికి ఏ హీరోయిన్‌ అయినా ఆసక్తి కనబరుస్తారు. సాహో సినిమా రిలీజ్ అయ్యాక, ఆయన పక్కన యాక్ట్ చేయడానికి ఎందరో బాలీవుడ్ కథానాయికలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న ఓ సినిమాలో నటించడానికి బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సోషల్ మీడియాలో ఇటీవలే వార్తలు వచ్చాయి.

ప్రభాస్ హీరోగా "అర్జున్‌ రెడ్డి" డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనుంది. ఆ సినిమాకు "స్పిరిట్" అనే టైటిల్ ఖరారు చేశారు మేకర్స్. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ నటించనున్నారనే వార్తలు వచ్చాయి. ఇటీవల "లాల్ సింగ్ చడ్డా" మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన కరీనా వరుసగా సినిమాలు చేస్తున్నారు.

ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం ప్రాజెక్ట్‌ K, సలార్ సినిమాల్లో నటిస్తున్నారు. ఆ సినిమాల షూటింగ్‌లు శరవేగంగా జరుగుతున్నాయి

ఆసక్తిగా ఎదురుచూస్తున్నా..

"స్పిరిట్" సినిమాలో నటిస్తున్నట్టు వస్తున్న వార్తలపై కరీనా ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. "ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ మూవీలో హీరోయిన్‌గా చేస్తున్నారా" అని ఒక విలేకరి కరీనాను ప్రశ్నించారు. ‘ప్రభాస్ పక్కన నటించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. కానీ, అవకాశం రాలేదు. స్పిరిట్ మూవీ గురించి కూడా నన్ను ఎవరూ సంప్రదించలేదు. సోషల్ మీడియాలో మాత్రం ప్రభాస్ "స్పిరిట్‌"లో నేనే హీరోయిన్ అని రాస్తున్నారు. దీనిలో ఏ మాత్రం నిజం లేదు’ అని క్లారిటీ ఇచ్చారు కరీనా.

దీంతో "స్పిరిట్‌"లో కరీనా నటిస్తున్నారని వస్తున్న వార్తలన్నీ రూమర్స్ అని తేలిపోయింది. ఇక, "స్పిరిట్‌" సినిమా షూటింగ్ వచ్చే ఏడాది మొదలయ్యే చాన్స్ ఉంది. కాగా, ప్రభాస్ (Prabhas) నటిస్తున్న సలార్, ప్రాజెక్ట్ K సినిమాలు సెట్స్‌పైనే ఉన్నాయి. ఇక పాన్‌ వరల్డ్‌ సినిమా ‘ఆదిపురుష్’ వీఎఫ్ఎక్స్ వర్క్ మాత్రం శరవేగంగా జరుగుతోంది.

Read More : ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్‌కు అదిరిపోయే హింట్‌ ఇచ్చిన ‘సలార్’ చిత్ర యూనిట్..‘వయొలెంట్‌’ అని ట్వీట్‌

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!