Salaar Release Date: ప్రభాస్ 'సలార్' నుంచి క్రేజీ అప్‌డేట్‌.. రిలీజ్ డేట్ ఖరారు!

Updated on Aug 16, 2022 07:30 PM IST
'సలార్' చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన (Salaar ReleaseDate) ఈ పోస్టర్‌లో చేతిలో రక్తంతో తడిసిన పదునైన ఆయుధాలతో పవర్ ఫుల్ లుక్‏లో కనిపిస్తున్నాడు.
'సలార్' చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన (Salaar ReleaseDate) ఈ పోస్టర్‌లో చేతిలో రక్తంతో తడిసిన పదునైన ఆయుధాలతో పవర్ ఫుల్ లుక్‏లో కనిపిస్తున్నాడు.

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 'రాధేశ్యామ్' సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చారు డార్లింగ్ ప్రభాస్. ఇక, ప్రస్తుతం చేతిలో ఉన్న పాన్ ఇండియా భారీ బడ్జెట్ చిత్రాలతో తీరిక లేకుండా గడిపేస్తున్నారు. ఈ నేపథ్యంలో  ప్రభాస్‌, కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ కలయికలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'సలార్‌' (Salaar) నుండి ఓ లేటెస్ట్ అప్డేట్ రిలీజ్ అయ్యింది.  

'సలార్‌' సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ (Shruti Haasan) హీరోయిన్‌గా నటిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రేయా రెడ్డి ఈ సినిమాలో కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా భువన్ గౌడ వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా, కేజీఎఫ్ సిరీస్‌కి సంగీతం అందించిన రవి బస్రూర్, ఈ సినిమాకి కూడా మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.  శివకుమార్ ఆర్ట్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. అలాగే ఈ సినిమా కోసం అన్బరువు ప్రత్యేకంగా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.  హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న 'సలార్‌' (Salaar) సినిమా అప్‌డేట్‌ కోసం, చాలా రోజుల నుండి ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో అభిమానుల‌కు స్వాతంత్య్ర దినోత్సవం రోజున చిత్ర యూనిట్ ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. 'సలార్‌' రిలీజ్‌ డేట్‌ను ప్రకటించి ఫ్యాన్స్‌లో జోష్‌‌ను నింపింది. ఈ సినిమాను వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 28న విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు.

'సలార్' చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన (Salaar Release Date) ఈ పోస్టర్‌లో, ప్రభాస్ గెటప్ చాలా వైవిధ్యంగా ఉంది.  రక్తంతో తడిసిన పదునైన ఆయుధాలతో ఆయన పవర్ ఫుల్ లుక్‏లో కనిపిస్తున్నాడు. ప్రభాస్ కత్తి పట్టి దుండగులను నరికిన తీరు.. ఆ శవాలు నిస్తేజంగా పడి ఉండడం.. కథానాయకుడు కత్తులతో చేసే స్వైరవిహారం.. ఈ  యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన పోస్టర్లు చూసి జనాలు ఫిదా అవుతున్నారు.  ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది.  

Read More: Prabhas: 'సలార్' (Salaar) షూటింగ్‌లో ప్రభాస్ కాలికి గాయం.. ఆందోళనలో ఫ్యాన్స్ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!