రజినీకాంత్ (Rajinikanth), విజయ్ (Vijay) వంటి స్టార్ హీరోల రెమ్యునరేషన్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
కోలీవుడ్ స్టార్ హీరోలకు ఇతర భాషల్లో కూడా మంచి మార్కెట్ ఉంది. తెలుగు, హిందీ భాషల్లో కోలీవుడ్ హీరోల సినిమాలు రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తుండటంతో ఈ హీరోలు భారీగా రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారు. హీరోలు తీసుకునే రెమ్యునరేషన్లు సినిమా బడ్జెట్‌లో సగానికంటే ఎక్కువగానే ఉంటున్నాయని ఇండస్ట్రీ టాక్. అయితే ఆ రెమ్యునరేషన్ ఎంత అనేది తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే. కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది స్టార్ హీరోలు రూ.100 కోట్ల కంటే ఎక్కువ మొత్తం పారితోషికంగా తీసుకుంటున్నారు.
సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth)కు భాషతో సంబంధం లేకుండా భారీ ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులో రజినీకాంత్ నటించిన సినిమాల్లో మెజారిటీ సినిమాలు సక్సెస్ అయ్యాయి. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టాయి కూడా. రజినీకాంత్ సినిమాలకు తెలుగులో హిట్ టాక్ వస్తే టాలీవుడ్ హీరోల సినిమాలకు వచ్చిన కలెక్షన్లు వస్తాయనే సంగతి తెలిసిందే.
జైలర్ సినిమా కోసం..
ప్రస్తుతం రజినీకాంత్ జైలర్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు రజినీకాంత్ రూ.140 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నారని టాక్. సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించకపోతే రజినీకాంత్ రెమ్యునరేషన్‌లో కొంత మొత్తం తిరిగిచ్చేస్తారు. ఈ కారణం వల్లే ఆయనతో సినిమాలను నిర్మించడానికి నిర్మాతలు కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. మరో స్టార్ హీరో విజయ్ (Vijay) కూడా రూ.100 కోట్ల కంటే ఎక్కువ మొత్తం పారితోషికంగా తీసుకుంటున్నారు. విజయ్ ఖాతాలో ఒక్క పాన్ ఇండియా హిట్ కూడా లేకున్నా తమిళనాడులో విజయ్‌కు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు.
ఇక, సౌత్ ఇండియాలోనే హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో ప్రభాస్. ప్రభాస్ ఒక్కో సినిమాకు రూ.125 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ (Prabhas) నటిస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే.
Read More : ప్రభాస్ (Prabhas) సలార్ రిలీజ్ అయ్యేది అప్పుడేనంట.. డేట్ ప్రకటించిన మేకర్స్.. ఆనందంలో ఫ్యాన్స్!