Salaar : 'డార్లింగ్' ప్ర‌భాస్ (Prabhas) న‌టిస్తున్న‌.. స‌లార్ టీజ‌ర్ రిలీజ్ ఎప్పుడంటే ?

Updated on Jun 13, 2022 12:12 AM IST
ప్ర‌భాస్ (Prabhas) ఫ్యాన్స్ స‌లార్ టీజర్ కోసం వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు.
ప్ర‌భాస్ (Prabhas) ఫ్యాన్స్ స‌లార్ టీజర్ కోసం వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు.

పాన్ ఇండియా హీరో ప్రభాస్ (Prabhas) న‌టిస్తున్న 'స‌లార్' (Salaar) చిత్రం నుంచి టీజ‌ర్ రిలీజ్ కానుంది. కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో 'స‌లార్' తెర‌కెక్కుతోంది. 'స‌లార్' టీజ‌ర్‌ను సాధ్యమైనంత త్వరగా రిలీజ్ చేసేందుకు ప్ర‌శాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. భారీ బ‌డ్జెట్‌తో 'స‌లార్' సినిమాను హోంబ‌లే ఫిలిమ్స్ నిర్మిస్తోంది. ప్ర‌భాస్ స‌ర‌స‌న శృతిహాస‌న్ న‌టిస్తున్నారు. 

అభిమానుల్లో జోష్ నింపనున్న డార్లింగ్ ప్ర‌భాస్
ఇటీవలే 'స‌లార్' సినిమాకు సంబంధించి రెగ్యులర్ అప్‌డేట్స్ ఇవ్వాలంటూ ప్ర‌భాస్ ఫ్యాన్ ఒక‌రు.. ప్ర‌శాంత్ నీల్‌కు సూసైడ్ లెట‌ర్ కూడా రాశారు. ఇక ఆ త‌ర్వాత నుంచి 'స‌లార్' సినిమా అప్‌డేట్స్‌ను నిర్మాతలు.. ఓ ప్రత్యేక ట్విటర్ ఖాతా ద్వారా ఇవ్వాలని సంకల్పించారు. స‌లార్‌పై అభిమానులలో భారీ అంచ‌నాలే ఉన్నాయి. రాధేశ్యామ్ ఫ్లాప్ త‌ర్వాత ప్ర‌భాస్, ఓ మంచి హిట్ సినిమా చేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. అభిమానుల కోసం ప‌లు ప్రాజెక్టుల‌కు ఓకే చెప్పారు.

ప్ర‌భాస్ (Prabhas) ఫ్యాన్స్ స‌లార్ టీజర్ కోసం వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు.

సినిమాల‌తో బిజీగా ప్ర‌భాస్
ప్రస్తుతం ప్రాజెక్ట్ కె, ఆదిపురుష్.. ఈ రెండు సినిమాల్లో ప్ర‌భాస్ (Prabhas) న‌టిస్తున్నారు. ప్ర‌భాస్ న‌టించే సినిమాల‌న్నీ పాన్ ఇండియా సినిమాలే కావ‌డం విశేషం. 'బాహుబ‌లి' త‌ర్వాత ప్ర‌భాస్ రేంజ్ ఒక్క‌సారిగా మారిపోయింది. పాన్ వ‌రల్డ్ స్టార్  అయ్యేందుకు ప్ర‌భాస్ ప్రయత్నిస్తున్నారని వినికిడి. బాలీవుడ్ బడా ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో.. ప్రభాస్ హీరోగా 'ఆదిపురుష్' సినిమాని 3డీ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. దాదాపు రూ. 500 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

ప్ర‌శాంత్ నీల్ టీజర్ ఎప్పుడు విడుదల చేస్తారో..?

ప్రశాంత్ నీల్ 'స‌లార్' టీజ‌ర్‌ను జూలై రెండో వారంలో రిలీజ్ చేస్తార‌నే టాక్ వినిపిస్తుంది. 'స‌లార్' టీజ‌ర్ నిజానికి మే నెల‌లో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని కార‌ణాల‌తో ప్ర‌శాంత్ నీల్ ఈ టీజ‌ర్ విడుద‌ల‌ను పోస్ట్ పోన్ చేశారు. త్వ‌ర‌లో స‌లార్ టీజ‌ర్‌పై అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది. ఇక ప్ర‌భాస్ (Prabhas) ఫ్యాన్స్ 'స‌లార్' టీజర్ కోసం వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు. 

 Read More: ప్రభాస్ (Prabhas), మహేష్‌బాబు అడిగినా వాళ్లతో సినిమాలు చేయను: నిర్మాత ఎంఎస్‌ రాజు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!