ప్రభాస్ (Prabhas), మహేష్‌బాబు అడిగినా వాళ్లతో సినిమాలు చేయను: నిర్మాత ఎంఎస్‌ రాజు

Updated on Jun 12, 2022 07:59 PM IST
మహేష్‌బాబు, ఎంఎస్‌ రాజు, ప్రభాస్ (Prabhas)
మహేష్‌బాబు, ఎంఎస్‌ రాజు, ప్రభాస్ (Prabhas)

టాలీవుడ్‌లో చిన్న సినిమాలతోనే భారీ విజయాలు అందుకుని బాక్సాఫీస్‌ను షేక్ చేసిన నిర్మాత ఎంఎస్‌ రాజు (MS Raju). దేవి, వర్షం, ఒక్కడు, మనసంతా నువ్వే, నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలతో వరుసగా బాక్సాఫీస్‌ను ఆయన బ్యానర్‌‌లోని సినిమాలు షేక్ చేశాయి. ప్రభాస్ 'వర్షం', మహేష్‌బాబు 'ఒక్కడు' సినిమాలతోనే తమ స్టార్‌‌ డమ్‌ను సొంతం చేసుకున్నారు.

ఈ మధ్యకాలంలో ఎంఎస్ రాజు పెద్ద సినిమాలను పక్కన పెట్టి విభిన్న తరహా కథాంశాలతోనే సినిమాలు తీస్తున్నారు. కొంతకాలంగా డైరెక్షన్‌ వైపు అడుగులేస్తున్న ఎంఎస్‌ రాజు తాజాగా దర్శకత్వం వహించిన సినిమా '7 డేస్‌ 6 నైట్స్'.

సుమంత్ అశ్విన్ హీరోగా నటించిన 7 డేస్‌ 6 నైట్స్‌ సినిమా జూన్‌ 24న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో జోరు పెంచింది చిత్ర యూనిట్. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఎంఎస్‌ రాజు మీడియాతో మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూలో మహేష్‌బాబు, ప్రభాస్‌ (Prabhas)లపై సంచలన కామెంట్స్ చేశారు.

7 డేస్‌ 6 నైట్స్‌ సినిమా పోస్టర్

మహేష్‌బాబు , ప్రభాస్‌లతో సినిమా చేయను

ప్రభాస్‌ హీరోగా చేసిన వర్షం, మహేష్ బాబు హీరోగా నటించిన ఒక్కడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్‌ అనే విషయం తెలిసిందే. అలాగే ఆ రెండు సినిమాలు ఇద్దరు హీరోల కెరీర్‌‌లో బ్లాక్‌బస్టర్‌‌లుగా కూడా నిలిచాయి. ఈ క్రమంలో ఎంఎస్‌ రాజు అడిగితే ప్రభాస్, మహేష్‌బాబు సినిమాలు చేయకుండా ఉంటారా? అని చాలా మంది అనుకుంటున్నారు.

అయితే, ఆ ఇద్దరు హీరోలతో తాను సినిమాలు చేయబోనని ఎంఎస్‌ రాజు సంచలన కామెంట్స్ చేశాడు. అసలు స్టార్ హీరోలు, దర్శకుల వెంట తాను పడబోనని అన్నాడు. తనకు నచ్చినట్టుగానే తాను సినిమాలు తీస్తానని.. పెద్ద సినిమాలు చేయాలని ప్రభాస్, మహేష్‌ అడిగినా అంగీకరించబోనని స్పష్టం చేశాడు ఎంఎస్‌ రాజు.

ప్రభాస్‌  తో చేసిన 'వర్షం ' పెద్ద హిట్ 

ప్రస్తుతం టాలీవుడ్‌లో సినిమాలు తీస్తున్న నిర్మాతల్లో దిల్‌ రాజు అందరికంటే ఒకడుగు ముందే ఉన్నారు. ఒకప్పుడు దిల్‌ రాజు స్థానంలో ఎంఎస్‌ రాజు ఉండేవాడు. సినిమా ప్రారంభం నుంచి రిలీజ్ వరకు అన్ని విషయాలను దగ్గరుండి ఆయనే చూసుకునేవాడు.

దర్శకులు, హీరోలు హీరోయిన్లు, నటీనటులతో సమన్వయం చేసుకుంటూ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేవాడు. అంతేకాదు.. ప్రతి ప్రాజెక్టు విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలూ తీసుకునేవాడు. కానీ ఇప్పుడు మహేష్‌బాబు, ప్రభాస్ (Prabhas) లాంటి స్టార్లు అడిగినా వాళ్లతో సినిమాలు చేయబోనని ఎంఎస్ రాజు చేసిన కామెంట్లపై, నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Read More: ఆదిపురుష్ సినిమా బ‌డ్జెట్ ఎంతో తెలిస్తే షాక్ అవాల్సిందే!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!