ప్ర‌భాస్‌ ( Prabhas)ను కొత్త లుక్‌లో చూపించాల్సిందే అంటున్న‌ ప్ర‌శాంత్ నీల్‌                     

Updated on May 29, 2022 12:17 PM IST
 స‌లార్ సినిమాలో ప్ర‌భాస్  ( Prabhas)  అందంగా క‌నిపించేలా  ప్ర‌శాంత్ నీల్ చేయాల‌నుకుంటున్నారు.
స‌లార్ సినిమాలో ప్ర‌భాస్  ( Prabhas)  అందంగా క‌నిపించేలా ప్ర‌శాంత్ నీల్ చేయాల‌నుకుంటున్నారు.

బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ ( Prabhas)  ఇమేజ్ ఒక్క‌సారిగా మారిపోయింది. ప్ర‌భాస్ పాన్ ఇండియా స్టార్‌గా దూసుకుపోతున్నారు. రాధేశ్యామ్ సినిమాలో ప్ర‌భాస్ లుక్ ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేదు. ప్ర‌భాస్ కాస్టూమ్స్ కూడా రాధేశ్యామ్ మూవీలో బాలేదంటూ కొంద‌రు కిట్రిక్స్ అన్నారు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ ప‌లు కొత్త ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నారు. ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్‌లో స‌లార్ (Salaar) సినిమాలో ప్ర‌భాస్ న‌టిస్తున్నారు.

కేజీఎఫ్ చాప్ట‌ర్‌2 సినిమాతో ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్‌గా మారారు ప్ర‌శాంత్ నీల్. సినిమాను ఎలా హిట్ చేయాలో తెలిసిన స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్. కేజీఎఫ్ సినిమాల్లో య‌శ్‌ యాక్ష‌న్ సీన్స్ చూసిన ఆడియ‌న్స్ కేరింత‌లు కొట్టారు. అంత‌కు మించిన సీన్స్ ప్ర‌శాంత్ నీల్ త‌న నెక్ట్ సినిమాలో చూపిస్తార‌ట‌. ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ నీల్ ప్ర‌భాస్ న‌టిస్తున్న స‌లార్ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌భాస్‌ను స్లిమ్‌గా చూపించేందుకు ప్ర‌శాంత్ నీల్ ట్రై చేస్తున్నారు. స‌లార్ సినిమాలో ప్ర‌భాస్  ( Prabhas)  అందంగా క‌నిపించేలా చేయాల‌నుకుంటున్నారు. ప్ర‌భాస్ లుక్ ఎలా ఉండాలో ప్ర‌శాంత్ నీల్ డిసైడ్ చేస్తార‌ట‌. అందుక‌నే ప్ర‌భాస్ వెయిట్ త‌గ్గుతున్నార‌ట‌.

ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్‌లో స‌లార్ సినిమాలో ప్ర‌భాస్ (Prabhas) న‌టిస్తున్నారు.

గ‌తంలో ప్రభాస్‌ ( Prabhas) కు మోకాలికి దెబ్బ త‌గ‌లింది. అంతేకాకుండా న‌డుముకి కూడా స‌ర్జ‌రీ అయింది. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్ర‌శాంత్ నీల్ ప్ర‌భాస్ కోసం యాక్ష‌న్ , ఫైట్ సీన్స్ చేయిస్తున్నార‌ట‌. ప్ర‌భాస్ ఇమేజ్ త‌గ్గ‌కుండా. సినిమా స్టోరికి త‌గ్గ‌ట్టుగా సీన్స్, డైలాగులు, ఫైట్స్ ఉండ‌బోతున్నాయి. స్టంట్ మాస్ట‌ర్ల కోసం ప్ర‌శాంత్ నీల్ వేటాడుతున్నారు. స‌లార్ ఇండియ‌న్ సినిమాలో రికార్డులు తొక్కుకుంటూ దూసుకెళ్లేలా చేయాల‌న్న‌ది ప్ర‌శాంత్ నీల్ మాస్ట‌ర్ ప్లాన్. స‌లార్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ప్ర‌భాస్‌కు జోడిగా ఈ సినిమాలో శృతి హాస‌న్ న‌టిస్తుంది. జ‌గ‌ప‌తి బాబు విల‌న్‌గా భ‌యంక‌ర‌మైన రోల్ చేయ‌నున్నారు.  హోంబ‌లే సంస్థ భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. 2023లో స‌మ్మ‌ర్‌లో స‌లార్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 
 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!