Ante Sundaraniki : 'అంటే.. సుంద‌రానికి' ప్రీ రిలీజ్‌ వేడుకలో.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు ఊహించని ట్రీట్ !

Updated on Jun 08, 2022 01:22 PM IST
 'అంటే.. సుంద‌రానికి' (Ante Sundaraniki) ప్రీ రిలీజ్ కోసం ప‌వ‌న్ కళ్యాణ్ వ‌స్తున్నారంటూ, నాని త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు.
'అంటే.. సుంద‌రానికి' (Ante Sundaraniki) ప్రీ రిలీజ్ కోసం ప‌వ‌న్ కళ్యాణ్ వ‌స్తున్నారంటూ, నాని త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు.

Nani: నాని.. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మంచి సక్సెస్ రేట్ ఉన్న కథానాయకుడు. 'అష్టాచెమ్మ'  చిత్రంతో తన సినీ కెరీర్ ప్రారంభించిన నాని, ఆ తర్వాత అనతికాలంలోనే మంచి నటుడిగా మార్కులు కొట్టేశాడు. ఇప్పుడు ఒకవైపు నటిస్తూనే, మరోవైపు నిర్మాతగానూ దూసుకుపోతున్నాడు.

భీమిలి కబడ్డీ జట్టు, జెంటిల్ మేన్, భలే భలే మగాడివోయ్, నిన్ను కోరి, ఎవడే సుబ్రహ్మణ్యం, జెర్సీ చిత్రాలు .. నానిలోని టాలెంట్‌ను సినీ లోకానికి పరిచయం చేశాయి. తద్వారా ఆయన స్థానాన్ని పరిశ్రమలో సుస్థిరం చేశాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా దగ్గరైన హీరోగా, నాని స్థానం టాలీవుడ్‌లో పదిలం. 

అంటే.. సుంద‌రానికి ఓ వైవిధ్యమైన కథ

Nani : నాని  విభిన్న చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంటారు. అలాగే, వైవిధ్యమైన సబ్జెక్టులు, కొత్తదనంతో కూడిన సబ్జెక్టులను ఎంచుకుంటూ ఉంటారు. ప్ర‌స్తుతం 'అంటే..సుందరానికి' (Ante Sundaraniki) అనే టైటిల్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వంలో 'అంటే.. సుంద‌రానికి' సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో నానికి జోడిగా న‌జ్రియా న‌టించారు.

నాని న‌టించిన ఈ సినిమా జూన్ 10న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి వివేక్ సాగ‌ర్ సంగీతం అందించారు. అన్నింటికంటే, ముఖ్యమైన విషయం ఏమిటంటే..  'అంటే.. సుంద‌రానికి' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌స్తున్నారంటూ చిత్ర యూనిట్ తెలిపింది. 

ముఖ్య అతిథిగా  ప‌వ‌న్ క‌ల్యాణ్

హైద‌రాబాద్‌లోని శిల్ప‌క‌ళావేదిక‌లో 'అంటే.. సుంద‌రానికి' (Ante Sundaraniki)  ప్రీ రిలీజ్ వేడుక జ‌ర‌గ‌నుంది. తొలుత జూన్ 8 తేదిన ఈ ఈవెంట్‌ను నిర్వ‌హించాల‌నుకున్నారు. కానీ అదే తేదీని జూన్ 9 కి మార్చడం గమనార్హం.

ఈ  ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రానున్నారని నిర్మాతలు సోషల్ మీడియా ద్వారా తెలిపారు.ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసమే,  ఈవెంట్‌ను ఒక్క రోజు వెన‌క్కి జ‌రిపార‌నే టాక్ కూడా వినిపిస్తుంది. మరోవైపు, సినిమా  ప్ర‌మోష‌న్ల‌ను మరింత పెంచి.. పాజిటివ్ టాక్ వ‌చ్చేలా చేయాల‌నే సంకల్పంతోనే ప‌వ‌న్‌‌ సహాయం కోరారని వినికిడి. 

ప్ర‌మోష‌న్ల జోరు

శ్యామ్ సింగ రాయ్ త‌ర్వాత హీరో నాని న‌టించిన సినిమా 'అంటే.. సుంద‌రానికి'. ఈ సినిమాతో మరో సూప‌ర్  హిట్ కొట్టాల‌ని నాని భావిస్తున్నారు. అందు కోసం ప్ర‌మోష‌న్ల‌ను సైతం డిఫెరెంట్‌గా ప్లాన్ చేశారు.

'అంటే.. సుంద‌రానికి' చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, వై రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా దీనిని వివేక్ ఆత్రేయ తెర‌కెక్కించారు.  తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో జూన్ 10న ఈ మూవీ (Ante Sundaraniki) రిలీజ్ కానుంది. 

తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో జూన్ 10న అంటే.. సుంద‌రానికి (Ante Sundaraniki) రిలీజ్ కానుంది. 

ప‌వన్‌కు థాంక్స్ : నాని

త‌న సినిమా ప్రీ రిలీజ్ కోసం ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌స్తున్నారంటూ నాని ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు. 'సుంద‌ర ప్ర‌సాద్ కోసం వ‌స్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ గారికి ధ‌న్య‌వాదాలంటూ' పోస్ట్ చేశారు. త‌న‌తో పాటు 'అంటే.. సుంద‌రానికి' టీం కూడా థ్రిల్ ఫీల‌వుతున్నారని తెలిపారు.

జూన్ 9న జ‌రిగే ఈవెంట్ కోసం ప్రత్యేకంగా అందరం ఎదురుచూస్తున్నామంటూ పేర్కొన్నారు. ఈ చిత్రంలో నరేశ్‌, రోహిణి, నదియా, హర్షవర్ధన్‌, రాహుల్‌ రామకృష్ణ, సుహాస్‌లు న‌టించారు.

Read More: నాని' చేసే కామెడీ మామూలుగా లేదండీ బాబు.. ‘అంటే సుంద‌రానికి’ (Ante Sundaraniki) బ్లూపర్ వీడియో వైరల్ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!