'నాని' చేసే కామెడీ మామూలుగా లేదండీ బాబు.. ‘అంటే సుంద‌రానికి’ (Ante Sundaraniki) బ్లూపర్ వీడియో వైరల్ !

Updated on May 27, 2022 12:37 PM IST
Ante Sundaraniki :అంటే సుంద‌రానికి అనే టైటిల్‌తో వ‌స్తున్న సినిమా ప్రేక్ష‌కుల‌కు చ‌క్కిలిగింత‌లు పెట్టిస్తుంద‌ట‌
Ante Sundaraniki :అంటే సుంద‌రానికి అనే టైటిల్‌తో వ‌స్తున్న సినిమా ప్రేక్ష‌కుల‌కు చ‌క్కిలిగింత‌లు పెట్టిస్తుంద‌ట‌

Ante Sundaraniki: టాలీవుడ్‌లో నేచుర‌ల్ స్టార్ నాని (Nani) హీరోయిజ‌మే వేరు. హీరో నాని చేసే కామెడీకి ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఫిదా అవుతుంటారు. అలాగే  'అంటే సుంద‌రానికి' అనే టైటిల్‌తో  నాని చేస్తున్న సినిమాపై ప్రేక్ష‌కుల‌కు అంచనాలు బాగానే ఉన్నాయి. అంతలా, ఈ సినిమా చ‌క్కిలిగింత‌లు పెట్టిస్తుంద‌ట‌. ద‌ర్శ‌కుడు వివేక్ ఆత్రేయ రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైనర్‌గా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. అలాగే మ‌ల‌యాళీ బ్యూటీ న‌జ్రియా న‌జీమ్ (Nazriya) ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం కానున్నారు. 

'అంటే సుంద‌రానికి' సినిమా ప్రస్తుతం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. దీంతో ఈ చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్ల జోరు పెంచారు. ఈ సినిమా నుండి తొలుత పాట‌లను రిలీజ్ చేస్తూ, సినీ అభిమానులలో ఆసక్తిని పెంచారు. ఇదే క్రమంలో నాని, న‌జ్రియా ‘This or That’ ఛాలెంజ్‌తో ఓ వీడియోని కూడా చేశారు. ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అలాగే ఈ చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్ల‌లోనూ వినోదానికి పెద్దపీట వేయడం విశేషం. 

ప్ర‌స్తుతం 'అంటే సుంద‌రానికి' చిత్రం నుంచి మేక‌ర్స్ బ్లూప‌ర్స్ వీడియో ఒక‌టి విడుద‌ల చేశారు. 'సుంద‌రం ప్ర‌పంచానికి స్వాగ‌తం' అంటూ స‌ర‌దా స‌న్నివేశాలతో  కూడిన ఈ వీడియో ప్రేక్షకులకూ నవ్వులను పంచుతోంది. ప్రేక్ష‌కుల‌కు చ‌క్కలిగింత‌లంటూ వీడియో చివ‌రిలో ఓ టైటిల్ కూడా ఆస‌క్తిగా మారింది. చాలా స‌ర‌దాగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారనే విధంగా వీడియో కంటెంట్ ఉంది. ఇక సినిమా కూడా అంతే స‌ర‌దాగా సాగుతుంద‌ని ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. నానీ, నజ్రియా నటించిన సన్నివేశాలన్నీ దాదాపు నవ్వు పుట్టించే విధంగానే ఉన్నాయి. ఇక న‌రేశ్, విష్ణు వ‌ర్ధ‌న్ చేస్తున్న కామెడీ మామూలుగా లేదు. 

వివేక్ సాగ‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఈ చిత్రానికి సంగీతం అందించారు.మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ యేర్నేని, ర‌విశంక‌ర్ వై .. 'అంటే సుంద‌రానికి' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంటే సుంద‌రానికి (Ante Sundaraniki) చిత్రం జూన్ 10న విడుద‌ల కానుంది. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!