సినిమా నాకు ఎదిరించే ధైర్యాన్ని ఇచ్చింది : 'అంటే సుందరానికి' (Ante Sundaraniki) ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ !
హీరో నాని నటించిన అంటే.. సుందరానికీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హాజరయ్యారు. ఇదే క్రమంలో పవన్ కల్యాణ్ సినిమా రంగానికి సంబంధించిన ఎన్నో విషయాలపై మాట్లాడారు.
అన్ని వర్గాల వారు కష్టపడితేనే సినిమా : పవన్ కల్యాణ్
ప్రతీ సినిమా ఈవెంట్‌లో అభిమానుల కేరింతలు ఉంటేనే సందడి ఉంటుందని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. ఎవరినైనా ఎదిరించే ధైర్యం చిత్ర పరిశ్రమ వల్లే తనకు వచ్చిందన్నారు. అభిమానుల కారణంగానే తన కుటుంబంలోని నటులు ఉన్నత స్థాయిలో ఉన్నారన్నారు. సినిమా పరిశ్రమ ఒక్కరి సొత్తు కాదని.. అందరిదన్నారు.
తనకు, నరేష్‌కు వేరు వేరు ఆలోచనలు, అభిప్రాయాలు ఉండవచ్చన్నారు. అంటే ఎవరి ఇష్టాఇష్టాలు వారివని చెప్పకనే చెప్పారు పవన్. సినిమా, రాజకీయం వేరు వేరుగా చూడాలన్నారు.
ఓ చిత్రాన్ని నిర్మించాలంటే పలు డిపార్టుమెంటులు పని చేయాలన్నారు. ఎంతో మంది కష్టపడితేనే ఓ సినిమా నిర్మించగలరన్నారు. ఎన్నో కులాలు, మతాలు, ప్రాంతాల వారు ఓ సినిమా కోసం కష్టపడతారని పవన్ తెలిపారు. ఇలా అందరీ కష్టంతోనే 'అంటే.. సుందరానికీ' వంటి సినిమాలు నిర్మితమవుతాయన్నారు.
నా వాళ్లు 'నాని' అభిమానులు - పవన్
హీరో నానికి తన కుటుంబంలో కూడా అభిమానులున్నారంటూ పవన్ (Pawan Kalyan) 'అంటే.. సుందరానికి' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పారు. తన అక్క నాని సినిమాలు చూస్తారన్నారు. నాని విలక్షణ నటనతో మెప్పిస్తారన్నారు. నాని వ్యక్తిత్వం నచ్చుతుందన్నారు. ఎదిరించి నిలబడగల వ్యక్తిగా 'నాని' మంచి విజయాలు అందుకోవాలన్నారు.
భవిష్యత్తులో హీరోగా నాని మరిన్ని సినిమాలు చేయాలన్నారు. అలాగే సినిమాకు వెన్నెముక లాంటి వాళ్లు దర్శకులన్నారు పవన్. ఇదే క్రమంలో 'అంటే.. సుందరానికి' దర్శకుడు వివేక్ ఆత్రేయకు తన అభినందనలు తెలిపారు. తాను కూడా నాని సినిమా చూస్తానని చెప్పారు.
నాని సినిమాలో నా గురించి చెబితే బాగోదు : పవన్
మైత్రీ మూవీ మేకర్స్ తాను నటించే 'భవదీయుడు భగత్ సింగ్' అనే సినిమాను కూడా నిర్మిస్తుందని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చెప్పారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రానుందన్నారు. తన సినిమా ఫంక్షన్ కాదు కాబట్టి.. తన సినిమా వివరాలు వెల్లడించనన్నారు పవన్.
తన సినిమాకు సంబంధించినవి ఏవీ కూడా నాని ఈవెంట్‌లో ప్లే చేయవద్దని చెప్పారట పవన్. కానీ తన AV ప్లే చేయడం తనకు కోపం తెప్పించిందంటూ పవన్ సరదాగా చెప్పారు. తన విజువల్స్ వేయకుంటే ఫ్యాన్స్ ఊరుకోరు కాబట్టి.. అందుకే AV ప్లే చేశారన్నారు.
అభిమానుల కోసం డాన్సులు : పవన్ కళ్యాణ్
'అంటే.. సుందరానికీ'.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) డాన్సులతో కూడిన AV ని చిత్ర యూనిట్ ప్లే చేశారు. అయితే ఆ డాన్సుల వీడియో చూసిన పవన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. డాన్సులు చూసి తానేనా వేసిందని అనిపించిందన్నారు. తాను వేసే స్టెప్పులు ఫ్యాన్స్ కోసమేనన్నారు. దర్శక, నిర్మాతలు కూడా అభిమానుల కోసం డాన్సులు వేయిస్తున్నారంటూ చమత్కారంగా మాట్లాడారు పవన్ కల్యాణ్.
ఇక తాను డాన్సులు వేయలేనని పవన్ కల్యాణ్ చెప్పారు. 'పాటల్లో ఇకపై నడిచే అవకాశం ఇవ్వండి.. అంతేకానీ డాన్సులు వేస్తానని' మాత్రం కోరవద్దన్నారు కల్యాణ్. రాజకీయాల్లో గొడవ పడటం అంత ఈజీ కాదన్నారు. ఫైనల్‌గా 'అంటే.. సుందరానికీ' సినిమాలో నటించిన నటీనటులకు అభినందనలు తెలిపారు పవన్ కల్యాణ్.