అదిరిపోయిన ‘పఠాన్’ (Pathaan) మూవీ టీజర్.. యాక్షన్‌తో అదరగొట్టేసిన షారుక్‌ ఖాన్ (Shah Rukh Khan)

Updated on Nov 02, 2022 04:46 PM IST
షారుక్ ఖాన్ (Shah Rukh Khan) నటిస్తున్న ‘పఠాన్’ (Pathaan) సినిమా టీజర్ విడుదలై.. యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతోంది
షారుక్ ఖాన్ (Shah Rukh Khan) నటిస్తున్న ‘పఠాన్’ (Pathaan) సినిమా టీజర్ విడుదలై.. యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతోంది

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ (Shah Rukh Khan) సుమారు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇవాళ్టితో ఆయన 58వ పడిలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా షారుక్ నటిస్తున్న ‘పఠాన్’ (Pathaan) చిత్రం టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘పఠాన్ గురించి నీకేం తెలుసు?’ అనే డైలాగ్‌తో మొదలైన టీజర్.. ఫైట్ సీక్వెన్స్‌తో యాక్షన్ ప్రియుల్ని అలరించేలా ఉంది. 

‘పఠాన్‌ ఇంకా బతికే ఉన్నాడో లేదో తెలియదు’ అనే డైలాగ్‌తో షారుక్‌ రోల్‌ను పరిచయం చేయడం.. ‘బతికే ఉన్నా’ అంటూ ఆయన చెప్పడం.. వంటి సీన్స్‌ హీరో ఫ్యాన్స్‌తో ఈలలు వేయించేలా ఉన్నాయి. పఠాన్‌ ఎవరు? ఆయన్ని పోలీసులు ఎందుకు అరెస్టు చేశారనే విషయాలతోపాటు ఇందులో జాన్‌ అబ్రహం (John Abraham) పాత్ర ఏమిటనేది సినిమాపై ఆసక్తిని రేపుతోంది. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పఠాన్’ మూవీని యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. వచ్చే ఏడాది జనవరి 25న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ మూవీని హిందీతోపాటు తెలుగు, తమిళంలో ఏకకాలంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 

ఇకపోతే, షారుక్ ఖాన్ జన్మదినాన్ని ఆయన అభిమానులు పండుగలా భావిస్తారని చెప్పొచ్చు. ప్రతి ఏడాది నవంబర్ రెండో తేదీన ముంబైలోని షారుక్ ఇల్లు.. మన్నత్ వద్ద ఫ్యాన్స్ కోలాహలం ఓ రేంజ్‌లో ఉంటుంది. పుట్టిన రోజున కింగ్ ఖాన్‌ను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు అక్కడికి వస్తుంటారు. ఎప్పటిలాగే ఈ బర్త్ డేకు కూడా షారుక్‌ను చూసేందుకు మంగళవారం అర్ధరాత్రి నుంచే ఆయన ఫ్యాన్స్ మన్నత్ దగ్గర బారులు తీరారు. అభిమానులు బాణసంచా కాలుస్తూ, అరుపులు, కేరింతలతో షారుక్‌కు పుట్టిన రోజు విషెస్ చెప్పారు. ఫ్యాన్స్‌ను చూసేందుకు షారుక్ రాత్రి పూట బయటకు వచ్చారు. తన చిన్న కొడుకు అబ్‌రామ్‌ను వెంటబెట్టుకుని మన్నత్ బాల్కనీలోకి వచ్చిన ఆయన.. అభిమానులకు అభివాదం చేశారు. బాల్కనీ నుంచి సెల్ఫీలు తీసుకున్నారు. 

Read more: ‘గీత గోవిందం’ కాంబో రిపీట్‌ ! విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda)తో రష్మికా మందాన (Rashmika Mandanna) సినిమా

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!