Brahmastra: 'బ్రహ్మాస్త్రం' ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్త వసూళ్లు తెలిస్తే షాక్ అవాల్సిందే..
'బ్రహ్మాస్తం' మొదటి భాగం - 'శివ' (Brahmastra) సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. రణ్‌బీర్, అలియా, నాగార్జున, అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్ వంటి స్టార్ నటులు ఈ సినిమాలో నటించారు. హిందూ పురాణాల ఆధారంగా 'బ్రహ్మాస్త్రం' సినిమాను దర్శకుడు ఆయాన్ ముఖర్జీ తెరకెక్కించారు. 'బ్రహ్మాస్త్రం' సినిమా విడుదలకు ముందే రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా విడుదలైన తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందో తెలుసా!
అన్ని కోట్ల కలెక్షనా!
పాన్ ఇండియా సినిమా 'బ్రహ్మాస్త్రం' మిక్సిడ్ టాక్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 75 కోట్లను వసూళ్లు చేసింది. బ్రహ్మాస్త్రం సినిమాను రూ. 410 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమా మొదటి షో తరువాత నెగెటీవ్ టాక్ ప్రచారంలో ఉంది. అయినా కూడా ఇన్ని కోట్ల రూపాయలు వసూళ్లు చేసిందంటే గొప్ప విషయమే అని సినీ క్రిటీక్స్ అంటున్నారు. మరో రెండు రోజుల్లో 'బ్రహ్మాస్త్రం' (Brahmastra) సినిమా బ్రేక్ ఈవెన్ చేయగలదనే నమ్మకంతో చిత్ర యూనిట్ ఉంది.
బాయ్ కాట్ బాలీవుడ్ ట్రెండ్‌ను అధిగమించి సినిమా మంచి బిజినెస్ చేస్తోంది. బ్రహ్మాస్త్రం సినిమా మొదటి రోజు వసూళ్లను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో ప్రకటించింది. 'బ్రహ్మాస్త్రం' సినిమా ఇండియాలో దాదాపు 5,019 థియేటర్లలో రిలీజ్ అయింది. ఓవర్సీస్‌లో దాదాపు 3,894 స్క్రీన్లలో ప్రదర్శితమవుతోంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 8,913 స్క్రీన్లలో రిలీజ్ అయింది.
వసూళ్లు పెరుగుతాయా?
'బ్రహ్మాస్త్రం' (Brahmastra) మూడు భాగాలుగా తెరకెక్కనుంది. 'బ్రహ్మాస్త్రం' మొదటి భాగం శివ పేరుతో హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 9న విడుదల చేశారు .స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ అండ్ స్టార్‌లైట్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూ. 410 కోట్ల బడ్జెట్‌తో నిర్మించాయి.
వీకెండ్ కావడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. ఈ సినిమా ఆన్‌లైన్ టికెట్ల అమ్మకం జోరు కూడా పెరిగింది. ఇక గణేష్ నిమజ్జన వేడుకలు కూడా ముగియడంతో 'బ్రహ్మాస్త్రం' సినిమా వసూళ్లు పెరుగుతాయని మేకర్స్ భావిస్తున్నారు. 'బ్రహ్మాస్త్రం' ముందు ముందు ఎలాంటి రికార్డులు బ్రేక్ చేయనుందో చూడాలి.
Read More: Brahmastra Movie Review: 'బ్రహ్మాస్త్రం మొదటి భాగం - శివ' రివ్యూ.. అస్త్రాల ప్రపంచంలో అద్భుతాలు