Special Story : అందం మాటున దాగిన అంతులేని బాధలు.. విధిని ఎదిరించిన నటీమణులు (Heroines)

Updated on Nov 02, 2022 10:39 PM IST
సినిమాల్లో నటించడానికి భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఆనందంగా ఉంటారు హీరోయిన్లు అని అనుకుంటారు. అయితే దాని వెనుక మనకు తెలియని బాధలెన్నో ఉంటాయి
సినిమాల్లో నటించడానికి భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఆనందంగా ఉంటారు హీరోయిన్లు అని అనుకుంటారు. అయితే దాని వెనుక మనకు తెలియని బాధలెన్నో ఉంటాయి

సినిమా అంటేనే రంగుల ప్రపంచం. అందం, అభినయం అంతకు మించిన అదృష్టం ఉంటేనే ఇండస్ట్రీలో రాణించగలరు. పైకి కనిపించేంత బ్యూటిఫుల్ ప్రపంచం మాత్రం కాదు సినిమా అంటే. మనం కళ్లతో చూసి ఆనందించడానికి వాళ్లు ఎంతో కష్టపడుతుంటారు. ఎన్ని బాధలు ఉన్నా వాటిని మొహంపై కనిపించకుండా దాచుకుంటూనే మనల్ని అలరిస్తుంటారు నటీనటులు. చిన్న చిన్న క్యారెక్టర్లు చేసే వాళ్ల నుంచి స్టార్ హీరోహీరోయిన్లు కూడా ఇందుకు అతీతులు కాదు.

షూటింగ్ సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మేకప్‌, లైటింగ్ సహా ఎన్నో హంగులు ఉంటాయి షూటింగ్‌ ప్రదేశంలో. వాటి కారణంగా ఎదురయ్యే సమస్యలు కొన్ని అయితే.. పర్సనల్‌ లైఫ్‌లో ఉన్న సమస్యలు మరికొన్ని. మానసిక, శారీరక, ఆరోగ్య సమస్యలతో సతమతమవుతూనే అభిమానులను అలరిస్తుంటారు నటీనటులు.

సినిమా అనే రంగుల ప్రపంచంలో అందంగా ఉన్నప్పుడే అవకాశాలు వస్తాయి. వయసు మీద పడినా, అనారోగ్యం కారణంగా ఆకర్షణ తగ్గినా అవకాశాలు చేజారిపోతాయి. అందం కాస్త తగ్గినా అవకాశాలు చేజారిపోయే వారిలో ముందు వరుసలో ఉంటారు హీరోయిన్లు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో అవకాశాలు రావడమే అరుదు. అదృష్టం బాగుంటేనే సినిమా హిట్‌ అవుతుంది. సినిమా హిట్ అయితేనే మరిన్ని చాన్స్‌లు లభిస్తాయి. లేకపోతే వారి కెరీర్ ముగిసినట్టే. బయటకు అందంగా, ఆనందంగా కనిపించే పలువురు హీరోయిన్లు తమ జీవితాల్లో ఎన్నో ఇబ్బందులతో సతమతమవుతుంటారు. శారీరక, మానసిక సమస్యలతో బాధపడే పలువురు హీరోయిన్ల (Heroines) గురించి తెలుసుకుందాం..

సినిమాల్లో నటించడానికి భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఆనందంగా ఉంటారు హీరోయిన్లు అని అనుకుంటారు. అయితే దాని వెనుక మనకు తెలియని బాధలెన్నో ఉంటాయి

సమంత (Samantha)
ఏ మాయ చేశావె సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు సమంత (Samantha). ఈ సినిమాలో నటనకు మంచి పేరు తెచ్చుకున్న సామ్.. దాదాపు అందరు స్టార్ హీరోలతోనూ నటించారు. అక్కినేని వారసుడు నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పలు కారణాలతో విడాకులు తీసుకుని వార్తల్లో నిలిచారు సమంత. వరుసగా సినిమాలు చేస్తూ బాలీవుడ్, హాలీవుడ్‌లో అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు.

ప్రస్తుతం సమంత కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉందని చెప్పాలి. ఇటువంటి సమయంలో సమంత అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టు తెలిసింది. మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్‌ కారణంగా ఈ  వ్యాధి బారినపడినట్టు తెలిపారు సామ్. గతంలో సమంత చర్మ సంబంధ వ్యాధితో బాధపడ్డారు.

సినిమాల్లో నటించడానికి భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఆనందంగా ఉంటారు హీరోయిన్లు అని అనుకుంటారు. అయితే దాని వెనుక మనకు తెలియని బాధలెన్నో ఉంటాయి

నయనతార (Nayanthara)

రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘చంద్రముఖి’తో టాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయమయ్యారు నయనతార (Nayanthara). ఆ తర్వాత వరుసగా అందరు స్టార్ హీరోలతో నటించి లేడీ సూపర్‌‌స్టార్‌‌గా పేరు తెచ్చుకున్నారు. కెరీర్ ప్రారంభంలో గ్లామర్‌‌ పాత్రలకే పరిమితమైన నయన్.. తర్వాత తర్వాత లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలు కూడా చేశారు. డైరెక్టర్‌‌ విఘ్నేష్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న నయన్.. సరోగసీ ద్వారా కవల పిల్లలకు తల్లి అయ్యారు.

కాగా, కెరీర్‌‌ ప్రారంభం నుంచి ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీగా ఉన్న నయనతారకు.. మేకప్‌ కారణంగా ఎలర్జీ వచ్చింది. దాంతో స్కిన్ ఎలర్జీ సోకింది. చాలాకాలం చికిత్స తీసుకున్న నయన్‌ ప్రస్తుతం కోలుకున్నారు.

సినిమాల్లో నటించడానికి భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఆనందంగా ఉంటారు హీరోయిన్లు అని అనుకుంటారు. అయితే దాని వెనుక మనకు తెలియని బాధలెన్నో ఉంటాయి

ఇలియానా (Ileana)
ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ పోతినేని హీరోగా అరంగేట్రం చేసిన దేవదాసు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు ఇలియానా (Ileana). తన అందం, అభినయంతో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు. టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లోనూ పలు సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు ఈ గోవా బ్యూటీ.

ఇలియానా కూడా చాలాకాలంపాటు బాడీ డిస్మార్ఫిక్ డిజాస్టర్‌‌తో  బాధపడ్డారు. ఇదొక మానసిక వ్యాధి. ఈ వ్యాధి సోకిన వాళ్లు తమ శరీరం, అందం గురించి నెగెటివ్ ఆలోచనలతో బాధపడుతూ ఉంటారు. తాము అందంగా లేమని ఆందోళన చెందుతుంటారు. చాలాకాలం ఈ వ్యాధితో బాధపడిన ఇలియానా చికిత్స తర్వాత కోలుకున్నారని టాక్.

సినిమాల్లో నటించడానికి భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఆనందంగా ఉంటారు హీరోయిన్లు అని అనుకుంటారు. అయితే దాని వెనుక మనకు తెలియని బాధలెన్నో ఉంటాయి

దీపికా పదుకొనె (Deepika Padukone)
హిమేష్ రేషమియా చేసిన మ్యూజిక్ వీడియో ‘నామ్ హై తేరా’లో చేసిన దీపికా పదుకొనె (Deepika Padukone).. కన్నడంలో తెరకెక్కిన ఐశ్వర్య సినిమాలో మొదటిసారి నటించారు. ఓం శాంతి ఓం సినిమాతో బాలీవుడ్‌లోకి వచ్చిన దీపిక స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. అందం, అభినయంతో అభిమానులను అలరిస్తున్న దీపికా పదుకొనె మొదటిసారి తెలుగు సినిమాలో నటిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ సినిమా ‘ప్రాజెక్ట్‌ కె’లో హీరోయిన్‌గా చేస్తున్నారు. హాలీవుడ్‌ సినిమాలోనూ నటించారు దీపికా పదుకొనె.

ఇక, దీపిక కూడా చాలాకాలంగా డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. రణ్‌బీర్‌‌ కపూర్‌‌తో బ్రేకప్ అయిన తర్వాత మానసికంగా క్రుంగిపోయారు. డిప్రెషన్‌ నుంచి బయటపడడానికి చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఇప్పటికీ దాని నుంచి పూర్తిగా బయటపడలేదనే వార్తలు వినిపిస్తున్నాయి.

సినిమాల్లో నటించడానికి భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఆనందంగా ఉంటారు హీరోయిన్లు అని అనుకుంటారు. అయితే దాని వెనుక మనకు తెలియని బాధలెన్నో ఉంటాయి

సోనాలి బింద్రే (Sonali Bendre)

సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు హీరోగా తెరకెక్కిన మురారి సినిమాతో టాలీవుడ్‌లోకి వచ్చారు సోనాలి బింద్రే (Sonali Bendre). ఈ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. టాలీవుడ్‌లో స్టార్ హీరోలతోపాటు బాలీవుడ్‌లోనూ  నటించి స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు. అందం, అభినయంతో హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సోనాలి.

సోనాలి బింద్రే మెటాస్టాటిక్ కేన్సర్‌‌తో బాధపడ్డారు. కొన్ని రోజుల చికిత్స తర్వాత కేన్సర్‌ ‌నుంచి బయటపడ్డారు. ఆపరేషన్ సమయంలో తన భర్త, కుటుంబసభ్యులు ఇచ్చిన ప్రోత్సాహం, మనోధైర్యంతో  కేన్సర్‌‌ను జయించానని చాలాసార్లు చెప్పారు సోనాలి బింద్రే.

సినిమాల్లో నటించడానికి భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఆనందంగా ఉంటారు హీరోయిన్లు అని అనుకుంటారు. అయితే దాని వెనుక మనకు తెలియని బాధలెన్నో ఉంటాయి

మమతా మోహన్‌దాస్‌ (Mamta Mohandas)

హీరోయిన్‌గా, సింగర్‌‌గా మంచి పేరు తెచ్చుకున్నారు మలయాళ కుట్టి మమతా మోహన్‌దాస్. యమదొంగ, కేడీ, చింతకాయల రవి సినిమాలతో  తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. వరుస అవకాశాలతో ఇండస్ట్రీలో బిజీగా ఉన్న సమయంలోనే మమతా మోహన్‌దాస్ కేన్సర్ బారిన పడ్డారు. దాంతో నటనకు తాత్కాలికంగా బ్రేక్ తీసుకున్నారు. చికిత్స అనంతరం కోలుకుని సెకండ్‌ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేశారు మమత. ఆమె మరోసారి కేన్సర్ బారిన పడ్డారని వార్తలు వచ్చాయి. అయితే వాటిలో నిజమెంత అనేది మాత్రం తెలియదు.

సినిమాల్లో నటించడానికి భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఆనందంగా ఉంటారు హీరోయిన్లు అని అనుకుంటారు. అయితే దాని వెనుక మనకు తెలియని బాధలెన్నో ఉంటాయి

స్నేహా ఉల్లాల్ (Sneha Ullal)
ఉల్లాసంగా.. ఉత్సాహంగా సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు నీలి కళ్ల సుందరి స్నేహా ఉల్లాల్ (Sneha Ullal). మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన నేను మీకు తెలుసా సినిమాలోనూ నటించి మెప్పించారు. ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్‌ పోలికలు ఎక్కువగా ఉండే స్నేహ.. టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లో కూడా పలు సినిమాలు చేశారు.

అందం, అభినయం ఉన్నా అదృష్టం కలిసి రాకపోవడంతో సినిమా అవకాశాలు ఎక్కువగా దక్కలేదు స్నేహా ఉల్లాల్‌కు. ఇక, స్నేహ కూడా ఆటో ఇమ్యూన్ సమస్యతో బాధపడ్డారు. సమస్య తీవ్రం కావడంతో కొన్నాళ్లు బెడ్‌పైనే ఉండి చికిత్స తీసుకున్నారు. ప్రస్తుతం సమస్య నుంచి బయటపడిన స్నేహా ఉల్లాల్‌ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.
వీరే కాకుండా సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు (Heroines) మానసిక, శారీరక సమస్యలతో బాధపడుతుంటారు. వాటిని మనకు తెలియకుండా పక్కనపెట్టి.. మనల్ని ఎంటర్‌‌టైన్ చేయడానికి ఎంతో కష్టపడుతుంటారు. వాళ్ల బాధలను పంటి కింద దాచుకుంటూ మనకి వినోదాన్ని పంచుతున్న నటీనటులందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం.

Read More : ‘గీత గోవిందం’ కాంబో రిపీట్‌ ! విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda)తో రష్మికా మందాన (Rashmika Mandanna) సినిమా

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!