Nayanthara (నయనతార) : హ‌నీమూన్ నుంచి డైరెక్ట్‌గా షారూక్ ఖాన్ షూటింగ్‌కు వెళ్లిన కొత్త పెళ్లికూతురు !

Updated on Jun 28, 2022 05:59 PM IST
జ‌వాన్ సినిమాలో షారూక్ ఖాన్‌కు జోడిగా న‌య‌న‌తార (Nayanthara) కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్నారు.
జ‌వాన్ సినిమాలో షారూక్ ఖాన్‌కు జోడిగా న‌య‌న‌తార (Nayanthara) కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్నారు.

సౌత్ టాప్ హీరోయిన్ న‌య‌న‌తార (Nayanthara) పెళ్లి త‌ర్వాత మ‌ళ్లీ సినిమా షూటింగ్స్‌లో బిజీ అయ్యారు. న‌య‌న‌తార‌, విగ్నేష్‌లు హ‌నీమూన్ కోసం థాయిలాండ్ వెళ్లారు. హ‌నీమూన్ నుంచి తిరిగి వ‌చ్చాక న‌య‌న్.. ముంబైలో షారూక్ ఖాన్ న‌టిస్తున్న జ‌వాన్ సినిమా షూటింగ్ షెడ్యూల్‌కు హాజ‌ర‌య్యారు. జ‌వాన్ సినిమాలో న‌య‌న‌తార షారూక్ ఖాన్‌కు జోడిగా న‌టిస్తున్నారు. 

ముంబైలో న‌య‌న్

జ‌వాన్ సినిమాలో షారూక్ ఖాన్‌కు జోడిగా న‌య‌న‌తార (Nayanthara) కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్నారు. సౌత్ టాప్ హీరోయిన్ న‌య‌న‌తార నార్త్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇప్ప‌టికే తెలుగు, త‌మిళ్, మ‌ల‌యాళ భాష‌ల్లో నయనతారకి విపరీతమైన క్రేజ్ ఉంది. గ‌తంలోనూ న‌య‌న‌తార‌కు బాలీవుడ్‌లో న‌టించే అవ‌కాశం వ‌చ్చినా.. సౌత్ సినిమాల‌పైనే ఫోక‌స్ చేశారు. 

 

జ‌వాన్ సినిమాలో షారూక్ ఖాన్‌కు జోడిగా న‌య‌న‌తార (Nayanthara) కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్నారు.

షారూక్‌తో న‌య‌న్

కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కుమార్ జ‌వాన్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. న‌య‌న‌తార  (Nayanthara) కూడా బాలీవుడ్ బ‌డా స్టార్ షారూక్ ఖాన్ స‌ర‌స‌న న‌టించేందుకు ఒప్పుకున్నారు. ప్ర‌స్తుతం జ‌వాన్ షూటింగ్ షెడ్యూల్ ముంబైలో జ‌రుగుతుంది. ఆ షూటింగులో న‌య‌న‌తార కూడా పొల్గొన్నారు. షారూక్‌, న‌య‌న్‌లకు సంబంధించిన‌ కొన్ని సీన్స్ చిత్రీక‌రిస్తున్నారు. ఈ చిత్ర‌ం మొద‌టి షెడ్యూల్ జూలై 15 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. 

మ‌రోవైపు న‌య‌న‌తార తెలుగులో చిరంజీవి సినిమా గాడ్ ఫాద‌ర్‌లోనూ న‌టించ‌నున్నారు. గాడ్ ఫాద‌ర్‌లో చిరంజీవికి చెల్లెలుగా న‌య‌న‌తార వెండితెర‌పై క‌నిపించ‌నున్నారు. సైరాలో భార్య‌గా న‌టించిన న‌య‌న‌తార గాడ్ ఫాద‌ర్‌లో సిస్ట‌ర్ రోల్ చేస్తున్నారు.

జ‌వాన్ సినిమాలో షారూక్ ఖాన్‌కు జోడిగా న‌య‌న‌తార (Nayanthara) కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్నారు.

సోష‌ల్ మీడియాలో యాక్టివ్ అయిన న‌య‌న్
త‌మిళ ద‌ర్శ‌కుడు విగ్నేష్‌తో న‌య‌న‌తార పెళ్లి జూన్ 9 న జ‌రిగింది.  న‌య‌న్, విగ్నేష్‌ల పెళ్లి అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. త‌మిళ‌నాడులోని మహాబలిపురంలో వీరి వివాహం జ‌రిగింది. న‌య‌న్, విఘ్నేశ్‌ పెళ్లికి సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. 

ప్ర‌స్తుతం న‌య‌న్, విఘ్నేశ్‌ల జంట‌ థాయిలాండ్‌లో హనీమూన్ ఎంజాయ్ చేసి ఇండియాకు చేరుకున్నారు. అలాగే వీరి హ‌నీమూన్ జ‌ర్నీకి సంబంధించిన ఫోటోలను ఎప్ప‌టిక‌ప్పుడు అభిమానుల కోసం సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. పెళ్లికి ముందు కొద్ది రోజుల నుంచి న‌య‌న‌తార త‌న సోష‌ల్ మీడియాలో ఎలాంటి అప్‌డేట్స్ ఇవ్వ‌లేదు. ఇక పెళ్లి అయిన క్ష‌ణం నుంచి, త‌న మ్యారేజ్ లైఫ్‌కు సంబంధించిన ప్రతీ అప్‌డేట్ పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నారు. 

 

గ్లామ‌ర్ పాత్ర‌లు చేయ‌న‌ట్టేనా?
నయనతార (Nayanthara) భర్త విఘ్నేశ్‌ శివన్ కూడా అజిత్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఆ సినిమా ప్రొడక్షన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. ఈ సంవత్సరమే ఆ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. నయనతార నటించిన సినిమాలకు కూడా గతంలో విఘ్నేశ్‌ దర్శకత్వం వహించారు. న‌య‌న‌తార గ్లామ‌ర్ రోల్స్‌లో ఇక క‌నిపించ‌ర‌నే టాక్ వినిపిస్తుంది. కీల‌క‌మైన పాత్ర‌ల్లో న‌య‌న‌తార న‌టిస్తార‌ట‌. క‌థా బ‌ల‌మున్న సినిమాల‌లో న‌య‌న‌తార న‌టిస్తార‌ట‌. 

Read More: Nayanthara & Vignesh Shivan: పెళ్లి త‌ర్వాత న‌య‌న‌తార, విఘ్నేశ్‌ల ఫ్యాన్ ఫాలోయింగ్ మ‌రింత పెరిగింద‌ట‌!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!