Sharukh Khan Birthday Special : బాలీవుడ్ బాద్‌షాగా బ్లాక్ బాస్టర్ హిట్లు సాధించిన హీరో షారుఖ్ !
భారతీయ సినిమా ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక పేజీని తయారు చేసుకున్న నటుడు షారుఖ్ ఖాన్ (Sharukh Khan). బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చి.. తన నటనతో టాప్ హీరోగా ఎదిగారు. ప్రేమ కథలతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. షారుఖ్ నటించిన ఎన్నో సినిమాలు వంద కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించాయి.
బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలతో ఉత్తమ నటుడిగా ఎన్నో అవార్డులు అందుకున్నారు షారుఖ్. ఇదే క్రమంలో ప్రపంచ స్థాయిలో కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు. షారుఖ్ ఖాన్ బర్త్ డే సందర్భంగా పింక్ విల్లా స్పెషల్ స్టోరి మీకోసం
బాద్షా ఎక్కడి వాడంటే ..!
షారుఖ్ ఖాన్‌ను అభిమానులు బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ అని పిలుచుకుంటారు. షారూఖ్ ఖాన్ 1965 నవంబర్ 2 తేదీన ఢిల్లీలోని ముస్లిం కుటుంబంలో జన్మించారు. షారుఖ్ తండ్రి తాజ్ మహ్మద్ ఖాన్ ఆఫ్గనిస్తాన్ దేశానికి చెందిన పఠాన్ వంశస్తుడు. ఈయన స్వాతంత్య్ర సమరయోధులు కూడా. షారుఖ్ తనను తాను హాఫ్ హైదరాబాదీ (తల్లి), హాఫ్ పఠాన్ (తండ్రి), హాఫ్ కాశ్మీరీ (నానమ్మ)గా అభివర్ణించుకుంటారు.
ప్రేమ కోసం హీరోగా మారిన షారుఖ్ (Sharukh Khan).
15 ఏళ్ల వయసులో షారుఖ్ తండ్రి క్యాన్సర్ వ్యాధితో మరణించారు. తల్లి కూడా 1990లో అనారోగ్యంతో కన్నుమూశారు. ఢిల్లీలో ఉన్నప్పుడే షారూఖ్ గౌరీ అనే అమ్మాయిని ప్రేమించారు. తానేంటో నిరూపించుకున్నాకే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 1988లో టీవీ సీరియల్స్‌లో నటించడం మొదటుపెట్టారు. సీరియల్స్ ద్వారానే షారూఖ్ ఖాన్ తొలి సక్సెస్ అందుకున్నారు. 1991లో గౌరీని పెళ్లి చేసుకున్నారు.
పెళ్లి తరువాత హీరోగా ఎంట్రీ
1992 లో షారుఖ్ ఖాన్ (Sharukh Khan).కు బాలీవుడ్ హీరో అయ్యే ఛాన్స్ వచ్చింది. 'దిల్ ఆషినా హై' సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తరువాత 'దీవానా'తో మంచి సక్సెస్ అందుకున్నారు. బాజీఘర్, డర్ సినిమాలు షారూఖ్ ఖాన్‌కు బ్రేక్ ఇచ్చిన సినిమాలు.
వంద కోట్ల సినిమాలు
'దిల్ వాలే దుల్హన్ లే జాయేంగే' సినిమాతో షారూఖ్ ఖాన్ స్టార్ డమ్ ఒక్కసారిగా మారిపోయింది. నార్త్ ఇండియాతో పాటు సౌత్ ఇండియాలోనూ మంచి పేరు సంపాదించుకున్నారు. 'దిల్ వాలా దుల్హన్ లే జాయేంగే' సినిమా అప్పట్లో రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. తెలుగులో కూడా ఈ సినిమా 'ప్రేమించి పెళ్లాడతా' పేరుతో విడుదలై సూపర్ హిట్ అయ్యింది.
ఉత్తమ నటుడుగా షారుఖ్
షారుఖ్ ఎనిమిది ఫిలిమ్ ఫేర్ అవార్డులను అందుకున్న హీరోగా చరిత్రలో నిలిచారు. బాజీఘర్, దిల్ వాలే దుల్హనియా జాయేంగే, దిల్‌తో పాగల్ హై, కుచ్ కుచ్ హోతా హౌ, దేవదాస్, స్వదేశ్, చక్ దే ఇండియా, మై నేమ్ ఈజ్ ఖాన్ సినిమాలకుగానూ షారుఖ్ ఉత్తమ నటుడిగా ఫిలిమ్ ఫేర్ అవార్డులు అందుకున్నారు.
షారుఖ్ ఖాన్ దాదాపు 80 సినిమాల్లో నటించారు. సినిమా సినిమాకు కొత్తదనం చూపించే పాత్రలనే షారుఖ్ సెలెక్ట్ చేసుకుంటారు. ప్రేమికుడిగానే కాకుండా అన్ని రకాల పాత్రల్లోనూ ఒదిగిపోతారు. అంతేకాదు.. మల్టీస్టారర్ సినిమాల్లో కూడా షారుఖ్ నటించడానికి ముందే ఉంటారు.
షారుఖ్ ఖాన్ ఎన్నో అవార్డులు అందుకున్నారు. 2005 లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది. 14 ఫిలిమ్ ఫేర్ అవార్డులు అందుకున్న స్టార్ హీరో షారుఖ్. దాదాపు 12 సినిమాలు వంద కోట్లకు పైగా వసూళ్లు చేశాయి. 30 కి పైగా బ్రాండ్ యాడ్లలో నటించిన ఘనత కూడా షారుఖ్ ఖాన్‌దే.బాలీవుడ్ నట దిగ్గజం దిలీప్ కుమార్ తరువాత, అన్ని ఫిలిమ్ ఫేర్ అవార్డులు సాధించిన ఏకైక నటుడు షారుఖ్ ఖానే.
షారుఖ్ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించారు. కో ప్రొడ్యూసర్‌గా కూడా షారుఖ్ సినిమాలను నిర్మించారు. షారుఖ్ పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంటారు. షారుఖ్ వ్యాఖ్యతగా ఉంటే ఆ కార్యక్రమం సందడిగా ఉంటుంది.
రాకేట్రి, లాల్ సింగ్ చద్దా, బ్రహ్మాస్త్ర సినిమాలలో కూడా చిన్న పాత్రల్లో నటించి మెప్పించారు.ప్రస్తుతం షారుఖ్ ఖాన్ పఠాన్, జవాన్ సినిమాలలో నటిస్తున్నారు. అలాగే రాజ్ కుమార్ హిరానీతో 'డంకీ' సినిమాలో నటిస్తున్నారు.
Read More: అదిరిపోయిన ‘పఠాన్’ (Pathaan) మూవీ టీజర్.. యాక్షన్‌తో అదరగొట్టేసిన షారుక్ ఖాన్ (Shah Rukh Khan)