హనీమూన్‌కు వెళ్లిన‌ న‌య‌న్ (Nayanthara), విగ్నేష్ (Vignesh Shivan).. స్పెయిన్‌లో విహ‌రించ‌నున్న కొత్త‌జంట‌

Updated on Aug 12, 2022 07:49 PM IST
త‌న భార్య‌ న‌య‌న‌తార‌ (Nayanthara) తో స్పెయిన్ వెళ్తున్నానంటూ విగ్నేష్ శివ‌న్ త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.
త‌న భార్య‌ న‌య‌న‌తార‌ (Nayanthara) తో స్పెయిన్ వెళ్తున్నానంటూ విగ్నేష్ శివ‌న్ త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

సౌత్ స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార (Nayanthara), త‌మిళ ద‌ర్శ‌కుడు విగ్నేష్ శివ‌న్‌ల పెళ్లి అంగ‌రంగ వైభ‌వంగా జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి త‌ర్వాత ఈ జంట సినిమాల‌తో బిజీ అయ్యారు. ప్ర‌స్తుతం సినిమాల షెడ్యూల్‌లో బ్రేక్ రావ‌డంతో ఇద్ద‌రూ హ‌నీమూన్‌కు వెళ్లారు. త‌న భార్య‌తో స్పెయిన్ వెళ్తున్నానంటూ విగ్నేష్ శివ‌న్ త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. న‌య‌న్‌తో దిగిన ఫోటోల‌ను కూడా విగ్నేష్ పోస్ట్ చేశారు. 

వైఫ్‌తో స్పెయిన్‌కు వెళ్తున్నా : విగ్నేష్

న‌య‌న‌తార‌ (Nayanthara), విగ్నేష్‌లు స్పెయిన్ దేశానికి వెళ్లారు. స్పెయిన్‌లో వీరిద్ద‌రూ ప‌ది రోజులు ఉండ‌నున్నారు. వీరు మ‌ళ్లీ ఆగ‌స్టు 21న చెన్నైకు తిరిగి రానున్నారు. పెళ్లి త‌ర్వాత న‌య‌న్ ముంబైలో జ‌రిగిన‌ షారూక్ ఖాన్ షూటింగ్‌కు హాజ‌ర‌య్యారు. విగ్నేష్ చెన్నైలో జ‌రుగుతున్న చెస్ ఒలింయాడ్ ప‌నులతో బిజీగా మారిపోయారు. సినిమా షూటింగ్‌ల‌కు బ్రేక్ రావ‌డంతో, విగ్నేష్ త‌న భార్య న‌య‌న్‌తో క‌లిసి స్పెయిన్ దేశంలో విహ‌రించేందుకు వెళ్లారు.

స్పెయిన్ దేశంలోని బార్సిలోనాలో వెకేషన్‌కు న‌య‌న్ (Nayanthara), విగ్నేష్‌లు వెళ్లారు. చాలా రోజుల త‌ర్వాత త‌మ ప‌నులకు బ్రేక్ దొరికింద‌ని విగ్నేష్ త‌న ఇన్ స్టాలో తెలిపారు. నయన్ మెడ‌లో విగ్నేష్ క‌ట్టిన‌ తాళిబొట్టు క‌నిపించ‌డం విశేషం.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌ న‌య‌న్, విక్కీల పెళ్లిని ఓ డాక్యుమెంటరీగా స్ట్రీమింగ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ డాక్యుమెంటరీని ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్ట్ చేశారు. వీరి పెళ్లి వేడుక వీడియోను రౌడీ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తోంది.

Read More: Nayanthara & Vignesh Shivan: పెళ్లి త‌ర్వాత న‌య‌న‌తార, విఘ్నేశ్‌ల ఫ్యాన్ ఫాలోయింగ్ మ‌రింత పెరిగింద‌ట‌!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!