Pathaan Movie First Look: ఇంటెన్సివ్ లుక్‌లో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్.. 'పఠాన్' మూవీ ఫస్ట్ లుక్!

Updated on Jun 25, 2022 09:21 PM IST
షారుఖ్ ఖాన్ 'పఠాన్' మూవీ పోస్టర్ (Shah Rukh Khan Pathaan Movie Poster)
షారుఖ్ ఖాన్ 'పఠాన్' మూవీ పోస్టర్ (Shah Rukh Khan Pathaan Movie Poster)

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నుంచి సినిమా వ‌చ్చి దాదాపు నాలుగేళ్ళు దాటిపోయింది. ఆయన సాలిడ్ కంబ్యాక్ కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారంతో ఆయన తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి 30ఏళ్లు పూర్తిచేసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన అభిమానులకు సర్​ప్రైజ్​ ఇచ్చారు. ప్రస్తుతం షారుఖ్ నటిస్తున్న చిత్రం 'పఠాన్‌'. ఈ మూవీ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేశారు మేకర్స్‌. 

ఇందులో పొడవాటి జుట్టుతో ముఖంపై రక్తంతో గన్‌ చేతబట్టి కనిపించాడు షారుఖ్ ఖాన్. యశ్‌ రాజ్‌ సంస్థ ఈ మూవీని నిర్మిస్తోంది. మిస్ట‌రీ యాక్ష‌న్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో దీపికా ప‌దుకొణె (Deepika Padukone), జాన్ అబ్ర‌హం కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు.

సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 25న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని హిందీ, తమిళం, తెలుగులో మాత్రమే రిలీజ్‌ చేస్తున్నారు. ఓం శాంతి ఓం, హ్యాపీ న్యూ ఇయర్, చెన్నై ఎక్స్‌ప్రెస్ తర్వాత దీపికాతో నాలుగోసారి జత కట్టాడు షారుఖ్.
 

ప్రపంచంలోని ధనిక నటుల్లో షారుఖ్ కూడా ఒకరు. ఆయన దాదాపు 80 సినిమాల్లో నటించారు. ఇక నాలుగేళ్లుగా సిల్వర్​స్క్రీన్​కు దూరంగా ఉన్న షారుక్​.. 2023లో ఒకేసారి మూడు చిత్రాలతో రానున్నారు. 'పఠాన్' (Pathaan Movie​) తో పాటు, అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో 'జవాన్'​, రాజ్‌కుమార్ హిరానీ ద‌ర్శ‌క‌త్వంలో 'డంకీ'తో ప్రేక్షకులను పలకరించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను జ‌రుపుకుంటున్న ఈ చిత్రం త్వ‌ర‌లో షూటింగ్ ప్రారంభించ‌నుంది. ఇక, వీటితో పాటు 'రాకెట్రీ', 'లాల్​ సింగ్​ చద్ధా', 'బ్రహ్మాస్త్ర', 'టైగర్​ 3'లో ఆయన అతిథి పాత్రలో మెరవనున్నారు.

1992లో 'దీవానా' సినిమాతో బాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చాడు షారుక్‌. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి చేరాడు. అంతకుముందు టీవీ యాక్టర్‌‌గా, నెగెటివ్‌ రోల్స్‌ వేస్తూ ఉండేవాడు. విజయాలు, అపజయాలు.. ఎన్నో చేదు అనుభవాలు.. ఇలా 30 ఏళ్లుగా తన సినీ కెరీర్‌ ను కొనసాగించాడు.

షారుక్‌ 2018లో వచ్చిన జీరో సినిమాలో చివరిగా కనిపించాడు. వరుస ఫ్లాపులు వస్తుండడంతో కాస్త లేట్‌ అయినా పర్లేదు.. గట్టిగా హిట్ కొట్టాలని ఫిక్స్‌ అయి పఠాన్‌ సినిమాను లైన్‌ లో పెట్టాడు. యశ్‌ రాజ్‌ సంస్థకు (Yash Raj Films) 50వ సినిమా.. పఠాన్ కావడం విశేషం.

Read More: Sharukh Khan: షారుఖ్ ఖాన్ సినిమా జ‌వాన్‌లో 'రానా ద‌గ్గుబాటి' (Rana Daggubati )... ఏ పాత్ర‌లో న‌టిస్తున్నారంటే?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!