Mahesh Babu : మహేష్ బాబు - రాజమౌళి మూవీలో బాలీవుడ్‌ బ్యూటీ..ఈ చిత్రాన్ని ఇంగ్లీషులో కూడా రిలీజ్ చేస్తారని టాక్

Updated on Sep 17, 2022 04:29 PM IST
సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేష్‌బాబు (MaheshBabu) త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నారు. అనంతరం రాజమౌళి సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది
సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేష్‌బాబు (MaheshBabu) త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నారు. అనంతరం రాజమౌళి సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది

సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu) – దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఎస్‌ఎస్‌ఎంబీ29 వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమాను రూపొందించనున్నారు. సర్కారు వారి పాట వంటి హిట్‌ తర్వాత మహేష్‌ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో సినిమా చేస్తున్నారు. ఎస్‌ఎస్‌ఎంబీ28 అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ వంటి బ్లాక్‌బస్టర్‌‌ హిట్‌ తర్వాత రాజమౌళి.. మహేష్‌బాబుతో సినిమా చేయనున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకు తగినట్టుగానే సినిమాకు కథను రెడీ చేస్తున్నట్టు తెలిపారు రాజమౌళి. మహేష్‌తో తెరకెక్కించబోయే సినిమా కథ గురించి రాజమౌళి ఒక వేదికపై క్లారిటీ కూడా ఇచ్చారు.

పదేళ్లుగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్..

రాజమౌళి – మహేష్‌బాబు (MaheshBabu) కాంబినేషన్‌ సినిమా కోసం అభిమానులు చాలా సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రాబోతోందని పది సంవత్సరాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇటీవలే ఆ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడింది. అప్పటి నుంచి ఈ సినిమా గురించిన విషయాలపై ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరో అప్‌డేట్‌ ప్రస్తుతం నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది.

సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేష్‌బాబు (MaheshBabu) త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నారు. అనంతరం రాజమౌళి సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది

ఇంగ్లీష్‌లో కూడా..

ఎస్‌ఎస్‌ఎంబీ29 సినిమాను తెలుగుతోపాటు ఇంగ్లీష్‌లో కూడా తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. మిగిలిన భాషల్లోకి డబ్బింగ్‌ చేసి రిలీజ్‌ చేస్తారని సమాచారం. ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమా తర్వాత రాజమౌళికి హాలీవుడ్‌లో కూడా పాపులారిటీ వచ్చింది. దీనికి సంబంధించిన వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజం ఎంత అనేది తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

ఇక, ఎస్‌ఎస్‌ఎంబీ29 సినిమాలో మహేష్‌బాబు సరసన నటించే హీరోయిన్‌ విషయంపై కూడా పలు ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి.

మహేష్‌ – రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాలో -బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె ఎంపిక అయ్యారని వార్తలు వస్తున్నాయి. ‘XXX – ది రిటర్న్‌ ఆఫ్‌ జెండర్‌‌ కేజ్’ సినిమాతో హాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయమయ్యారు దీపిక. దీంతో హాలీవుడ్‌లో కూడా మహేష్‌బాబు (MaheshBabu) తో తెరకెక్కించనున్న ఎస్‌ఎస్‌ఎంబీ29 రిలీజ్‌ చేస్తుండడంతో.. ఈ సినిమాకు సైతం ఆమె క్రేజ్ ఉపయోగపడుతుందని అనుకుంటున్నారట రాజమౌళి.

Read More : మహేష్‌బాబు (MaheshBabu) – త్రివిక్రమ్ సినిమాలో మలయాళ స్టార్ హీరో.. నిజమెంతో మరి?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!